congress Government - Vishvambhara News

ఆగస్టు 15 తర్వాత బీజేపీ ఉద్యమాలు ఉధృతం.. రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
BJP Telangana: ఆగస్టు 15 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు, ఫీజు బకాయిల అంశాలపై బీజేపీ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తెలిపారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ఆయా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోందని చెప్పారు.

ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై బీజేపీ పోరాటం చేయనుందని రాంచందర్‌రావు తెలిపారు. ఆగస్టు 15 తర్వాత ఉద్యమాల తీవ్రతను పెంచడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పాదయాత్ర, బస్సుయాత్ర వంటి కార్యక్రమాలను నిర్వహించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా పార్టీ నేతల మధ్య సయోధ్యపై కూడా రాంచందర్‌రావు స్పందించారు. బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని, సయోధ్య పూర్తయిందని పేర్కొన్నారు. “సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేషన్ కేర్ పూర్తయింది.. లంచ్‌లు, డిన్నర్లు కూడా జరిగాయి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వం, నేతల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ఇక బీజేపీ నుంచి కొందరు నేతలు జనసేనలో చేరుతున్న అంశంపైనా రాంచందర్‌రావు స్పందించారు. ఈ సందర్భంగా “సినిమా పిచ్చి ఉన్నవారు కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు 2025 జూలై నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత దూకుడుగా ప్రజా ఉద్యమాలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు రాంచందర్‌రావు వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. పాదయాత్ర, బస్సుయాత్రతో పాటు ఇతర కార్యక్రమాలపై పార్టీ త్వరలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‎కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్
రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా పట్టణాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పట్టణాలకు విడుదల చేయని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పాలనలో పట్టణాల పరిపాలన పూర్తిగా దెబ్బతిందని, పారిశుద్ధ్యం నుంచి తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వరకు ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించి, నిధులు కేటాయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం మళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయడంతో అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు.

ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ, మరోవైపు పట్టణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.

మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల్లోని ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమగ్రంగా సమీక్షించారు.

పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని పార్టీ మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసిన కేటీఆర్, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన విజయాలు సాధించాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొని, కలిసికట్టుగా సమిష్టిగా పోరాడితే విజయం తప్పక సాధ్యమని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై హరీష్ రావు నేతలకు పలు సూచనలు చేశారు.

జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను నేతలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని వారు నాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని సమావేశంలో స్పష్టం అయ్యింది.

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
విశ్వంభరా, ఎల్బీనగర్ : - రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రుణమాఫీ చేస్తే హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవి కి
రాజీనామా చేస్తామని ప్రగల్బాలు పలికాడని వెంటనే రాజీనామా చేయాలని
మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కే ఎల్ ఆర్ అన్నారు. శుక్రవారం ఆర్కే పురం లోని ఎన్టీఆర్ నగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీఎం చిత్రపటానికి క్షీరాభిషేక కార్యక్రమానికి కే ఎల్ ఆర్, టిపిసిసి ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి లు  హాజరూ అయ్యారు. అనంతరం కిచెన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
రైతుల రుణమాఫీపై మాట ఇచ్చి  నిలబెట్టుకున్నామని  అన్నారు.
ఏకకాలంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేశారని అన్నారు, రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ మిత్తిలకు కూడా సరిపోలేదని, విమర్శించారు,ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్, బండి మధుసూదన్ రావు, జ్ఞానేశ్వర్ యాదవ్,కిరణ్, రమేష్ నేత, అక్బర్, లింగుస్వామి గౌడ్, దుబ్బాక శేఖర్, రాజు నాయక్,
శేఖర్ ముదిరాజ్, కళ్యాణ్,
పెదవూర సైదులు,మహేందర్, నబీ, శ్రీశైలం,
శ్రీకాంత్ రెడ్డి, సలీం,  పాషా, షఫీ, పటేల్, ప్రేమ్ , భాస్కర్, రవి,నాను నాయక్, నగేష్, పాండు, అనిల్,
శశి,విప్లవ, అంజిరెడ్డి, లక్ష్మీ, రేణుక, మాధవి, సంతోష, రమ,కవిత, జయశ్రీ, జయమ్మ, శ్వేత, స్వరూప, శైలజ, శానజ్ బేగం, మంగా ప్రజాప్రతినిధులు.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్.. పునరాలోచనలో సర్కార్..!
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మద్యం బ్రాండ్లను మార్చిరాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఇటీవల ఐదు కొత్త బ్రాండ్ల ద్వారా 26 కొత్త బీర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది.

ఈ బీర్ల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ మేరకు కొత్త బీర్ల అమ్మకాలకు సంబంధించిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడ కింగ్‌ఫిషర్‌ బీర్లను లోడ్లకు లోడ్లు దించుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ఏ వైన్స్‌కు వెళ్లినా కింగ్ ఫిషర్ బీర్లు లేవంటున్నారు. అదేబ్రాండ్ కావాలనుకునే వారికి కొన్ని చోట్ల రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. దీంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల్లో బీర్ల నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో కృత్రిమ బీర్ల కొరత సృష్టించారనే అనుమానాలకు తావిస్తోంది.

BREAKING: తెలంగాణ కేబినెట్ భేటీ షురూ..!
లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘాన్ని అనుమతులు కోరిన విషయం తెలిసిందే.  ఆదివారం షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది ఈసీ. ఈ మేరకు సోమవారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో భాగమైన ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరుకావొద్దని ఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4వ తేదీ లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

BREAKING: తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి..!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పలు షరతులను విధిస్తూ మంత్రివర్గ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని ఈసీ షరతు విధించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది.

ఈసీ అనుమతి లేకపోవడంతో రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం వరకు ఈసీ అనుమతి కోసం వేచిచూస్తామని, అప్పటికీ రాకపోతే ముఖ్యమంత్రి సహా మంత్రి వర్గమంతా ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను విన్నవించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఈసీ అనుమతులు ఇవ్వడంతో పార్టీ వర్గాలు శాంతించాయి.

మరోవైపు, రైతు రుణమాఫీ, ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ భేటీలో చర్చించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు (జూన్ 2)న వేడుకల నిర్వహణపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.