Murder - Vishvambhara News

లాయర్ స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో లాయర్ స్వప్న(34) దారుణ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన సొంత చెల్లెలిని చంపేందుకు అన్న రాజు పన్నిన ప్లాన్ ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వప్న కదలికలను ఎప్పటికప్పుడు రాజుకు చేరవేసిన శేఖర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నం
విచారణలో షాకింగ్ నిజాలు ఒప్పుకున్న రాజు, హత్యకు ముందు స్వప్నను చంపేందుకు రెండుసార్లు ప్రయత్నించినట్లు తెలిపాడు. మొదటిసారి కారుతో స్వప్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. రెండోసారి బుల్డోజర్‌తో స్వప్నను ఢీకొట్టించి, ఆ ప్రమాదంలో ఆమె మరణిస్తే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. అయితే, స్వప్న అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రమాదాల నుండి ప్రాణాలతో బయటపడింది.

సీసీ కెమెరాలు లేని ప్రదేశాల కోసమే వేట
సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ముందే గుర్తించిన రాజు, ఆ ప్రదేశాల్లో స్వప్నను వాహనాలతో వెనుక నుండి ఢీకొట్టాలని ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ సక్సెస్ చేయడం కోసం తన స్నేహితులు వీరేష్, శివ, శేఖర్ సహాయం తీసుకున్నాడు. గతంలో నమోదైన ఈ రోడ్డు ప్రమాద కేసులను ఇప్పుడు పోలీసులు హత్యాయత్నం కేసులుగా మార్చనున్నట్లు వెల్లడించారు.

అత్తాపూర్‌లో న్యాయవాది ఖదీర్ దారుణ హత్య
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సులేమాన్‌ నగర్‌లోని తన కార్యాలయంలో న్యాయవాది ఖదీర్ ఉన్న సమయంలో దుండగులు ఆకస్మికంగా దాడి చేశారు. కత్తులతో ఆయనపై పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఖదీర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఖదీర్ మరణించినట్లు నిర్ధారించుకున్న అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ విభేదాల కారణంగా ఖదీర్ బావమరుదులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

నగరంలో మరో దారుణం.. 12ఏళ్ల బాలిక హత్య..!
హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున బాలికను దారుణంగా హత్య చేశారు. 12 ఏళ్ల బాలికను హత్య చేసి తగలబెట్టి చెత్త కుప్పలో పడేశారు. పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తప్పిపోయి వారం రోజులు అవుతోంది.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం లక్ష్మా తండాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చింది. ఈ నెల 7వ తేదీన వారి పెద్ద కుమార్తె(12) కిరాణా షాపు వద్దకు వెళ్లి వస్తానని తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో బాలిక కోసం చుట్టపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరికి బాలిక తప్పిపోయిన వారం రోజులకు చెత్తకుప్పలో తగలబెట్టి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వదిలించుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ దక్కేదని బాలిక తల్లిదండ్రులు రోధిస్తున్నారు.

ప్రియుడి కోసం.. భర్తని హత్య చేయించిన భార్య
ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది ఓ భార్య. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆదిలాబాద్‌కు చెందిన టీచర్‌ జాదవ్‌ గజానంద్‌ జైనథ్‌, రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. అయితే, భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు నేరస్తులు ఎవరనేది బయటపెట్టారు. మృతుడు జైనథ్ భార్య మహేష్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె ప్రియుడితో సంతోషంగా ఉండాలంటే.. తన భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.

ఈ క్రమంలో భర్త మృతిచెందినా.. తన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని, ఒక సుపారీ గ్యాంగ్‌తో ఫోన్‌లో మాట్లాడి డీల్ కుదుర్చుకుని వారితో హత్య చేయించింది. అయితే, భర్త హత్య జరిగిన రెండురోజుల తర్వాత భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త రెండురోజుల నుంచి ఇంటికి రాలేదని, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదని కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. కాగా, పోలీసులు ఆ మహిళతో పాటు హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

వాహనంతో వెనుక నుంచి గుద్ది.. తాడును మెడకు బిగించి.. ఆపై పెట్రోల్ పోసి..
విశ్వంభర, నల్లగొండ బ్యూరో: సరిగ్గా ఏడాది క్రితం హత్య కేసులో నిందితుడైన యువకుడిని సరిగ్గా అదే నెలలో ప్లాన్ చేసి పక్కాగా హత్య చేశారు. వాహనంతో వెనుక నుంచి గుద్ది బలవంతంగా కారులోకి ఎక్కించుకుని దూర ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆపై తాడును మెడకు బిగించి చంపేశారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చివరికి కటకటలాపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన నందికొండ వెంకన్న(26) ఈనెల 23న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతడి ఆచూకీ గురించి వెతకగా, అతడి మోటారు సైకిల్ రాయిన్‌గూడెం గ్రామం పరిధిలో దొరికింది. దీంతో వెంకన్న తండ్రి నందికొండ సైదులు సూర్యాపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.  దర్యాప్తులో భాగంగా మూడు టీమ్‌లను రంగంలోకి దించి కేసును ఛేదించారు. సదరు యువకుడు నందికొండ వెంకన్న హత్యకు గురయినట్టుగా పోలీసులు తెల్చారు. అసలు విషయంలోకి వెళితే..

హత్య జరగడానికి కారణం హత్యే..

నందికొండ వెంకన్న 2022 సంవత్సరంలో తన స్నేహితుడైన బెజవాడ రాజశేఖర్‌ను డబ్బు వివాదం విషయంలో హత్య చేశారు. ఈ విషయంలో కట్టంగూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.  అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన వెంకన్న తనకు బెజవాడ రాజశేఖర్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహానీ ఉందని టేకుమట్ల గ్రామంలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రాజశేఖర్ హత్యకు ప్రతీకారంగా రాజశేఖర్ సొంత అన్న బెజవాడ రమేశ్ ప్లాన్ చేశారు. దీంతో నందికొండ వెంకన్న మరో స్నేహితుడు ఖమ్మంపాటి సైదులుతో కలిసి టేకుమట్ల గ్రామంలో ఉంటున్న వెంకన్నను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. కానీ సాధ్యం కాలేదు.

తమ్ముడిని చంపిన సరిగ్గా ఏడాదికి..
తన సోదరుడు బెజవాడ రాజశేఖర్‌ను మే 2022లో చంపారని, అదే నెలలో ఎలాగైన హత్య చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 21న బెజవాడ రమేశ్, ఖమ్మంపాటి సైదులు రెక్కీ నిర్వహించి వెళ్లారు. అనంతరం ఈనెల 23న నందికొండ వెంకన్నను ఎలాగైనా చంపాలని బెజవాడ రమేశ్, ఖమ్మంపాటి సైదులులు కలిసి బెజవాడ రాజశేఖర్ సొంత బాబాయి బెజవాడ జానయ్య, బోడ సతీష్ కుమార్, ఇస్లావత్ సురేశ్‌కు విషయం చెప్పారు. దీంతో వారు సరేనని చెప్పడంతో ఉదయం 8.15 గంటల సమయంలో టేకుమట్ల క్రాస్ రోడ్డు వద్ద బెజవాడ జానయ్య, ఇస్లావత్ సురేశ్‌లు నందికొండ వెంకన్న కోసం ఎదురుచూశారు. ఆ సమయంలో నందికొండ వెంకన్న యాక్టివా వాహనంపై సూర్యాపేటకు వెళుతుండగా, వెనుక నుంచి ఫాలో అయ్యి రాజుగారి తోట హోటల్ వద్ద ఎదురుగా వచ్చి మహేంద్ర వాహనంతో ఖమ్మంపాటి సైదులు ఢీకొట్టాడు. దీంతో వెంకన్న రోడ్డు పక్కన పడిపోయాడు. వెంటనే వెంకన్నను బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని మోతే గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ వెంకన్న మెడకు తాడును బిగించి చంపేశారు. అక్కడే ఉన్న కర్రలను శవంపై వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు.ఈ కేసును ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ వై.సురేందర్ రెడ్డి, ఎస్ఐ ఎన్.బాలునాయక్, సిబ్బందిని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు.

వనపర్తిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య..!
వనపర్తి జిల్లాలో ఓ బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) బుధవారం రాత్రి ఆరుబయట నిద్రించాడు.

గుర్తుతెలియని దుండగులు శ్రీధర్ రెడ్డిని అతికిరాతకంగా నరికి చంపారు.  అయితే గురువారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు చూసేసరికి దారుణ హత్యకు గురైనట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. మృతుడు శ్రీధర్‌రెడ్డి కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. శ్రీధర్ రెడ్డి హత్యకు గురైనట్లు విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లోనే దాడులు పెరిగాయన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి స్పందిస్తూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కొడుకుని కిరాతకంగా కొట్టి చంపిన తండ్రి
విశ్వంభర, చిన్నశంకరంపేట : బెట్టింగ్ కు అలవాటు పడిన కుమారుడిని ఎన్ని సార్లు మందలించిన వినకపోగ 2 కోట్లకు పైగా అప్పులు చేయడంతో విసిగిపోయిన తండ్రి కిరాతంగా హత్య చేసిన సంఘటన చిన్నశంకరంపేట మండలం భాగిర్తి పల్లిలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం మేరకు కుటుంబీకుల  వివరాలు ఇలా ఉన్నాయి. శంకరంపేట గ్రామపంచాయతీ ఆమ్లెట్ గ్రామమైన భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సత్యనారాయణ  రైల్వే ఉద్యోగి. అతని కుమారుడు రెడ్డి ముఖేష్( 28) క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. వద్దని కుమారున్ని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రెండు కోట్లకు పైగా అప్పులు చేశాడు. విసికెత్తిన తండ్రి సత్యనారాయణ ముఖేష్ నిద్రిస్తుండగా రాడుతో కొట్టి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ సంబంధానికి రెండు నిండు ప్రాణాలు బలి
విశ్వంభర, బిజినపల్లి: భర్త ఉన్నా మరొకరితో చనువుగా తిరుగుతూ తన చావుతోపాటు భర్త మరణానికి కారణమైంది ఓ ఇల్లాలు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బిజినపల్లి మండలం ముంగనూరు గ్రామానికి చెందిన సంఘనమోని వెంకటయ్య (45)కు ఇద్దరు భార్యలు. వారికి ఐదుగురు సంతానం. కాగా, వెంకటయ్య రెండో భార్య తారకమ్మ (34) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో చనువుగా మెలుగుతుంది. దీంతో ఆ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలోనే పంచాయితీలు జరిగాయి. తారకమ్మను పద్ధతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు హెచ్చరించారు. అయినా ఆమె అదే పనిగా మరోవ్యక్తితో చనువుగా మెలగడం కొనసాగించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వెంకటయ్య గురువారం రాత్రి రెండు గంటల సమయంలో తారకమ్మ నిద్రపోతున్న సమయంలో ఆమె తలను బండకేసి కొట్టడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన వెంకటయ్య భయాందోళనకు గురై   గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని  పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగశేఖర రెడ్డి తెలిపారు.