Triple talaq - Vishvambhara News

హిజాబ్ వ్యాఖ్యలు మంటపెట్టాయి.. ఒవైసీకి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్!!
విశ్వంభర తెలంగాణ, బ్యూరో: భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ కూడా భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందనే ఊహలకు ముందు, బురఖా ధరించిన మహిళను తమ పార్టీకి అధ్యక్షురాలిగా నియమించే ధైర్యం ఒవైసీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు.

ఆదివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించిన బండి సంజయ్, ఎంఐఎం పార్టీలో మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆ పార్టీ ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇచ్చిందని, కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లో మహిళలకు ఎంత స్థానం కల్పించిందని నిలదీశారు. మాటలతోనే మహిళా సాధికారత జరిగిందని చెప్పలేమని ఆయన విమర్శించారు.

2018 ఎన్నికల సమయంలో పాతబస్తీలో అక్బరుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా బీజేపీ తరఫున షాజాదీ సయ్యద్‌ను పోటీకి దింపామని, అప్పట్లో ఆమెను బెదిరించి ఓడించారని సంజయ్ ఆరోపించారు. ప్రస్తుతం షాజాదీ సయ్యద్ జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. మహిళా సాధికారతపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఒవైసీ, తన పార్టీలోనూ వ్యక్తిగత జీవితంలోనూ మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు.

ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళల పేరుపై సంక్షేమ పథకాలు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గృహాలు వంటి చర్యల ద్వారా ముస్లిం మహిళలకు వాస్తవమైన సాధికారతను అందించింది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. ఈ కారణంగానే చాలా మంది ముస్లిం మహిళలు ప్రధాని నరేంద్ర మోదీని తమ సోదరుడిలా భావిస్తున్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా, భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిందని, అందువల్ల పాకిస్థాన్ వంటి దేశాలకంటే భిన్నంగా భారత్‌లో హిజాబ్ ధరించిన మహిళ కూడా ప్రధాని కావచ్చని అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా తీవ్ర వాదోపవాదాలకు దారితీశాయి.

Telangana: రాష్ట్రంలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు.. ఎక్కడంటే..!!
ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పగా కేసు నమోదు చేసినట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన జాస్మీన్ అనే మహిళకు అబ్దుల్ అతిక్తో 2017లో వివాహమైందన్నారు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది ఫిబ్రవరిలో అబ్దుల్ అతిక్‌పై వేధింపుల కేసు నమోదైంది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటూ పోషణ కోసం కోర్టులో కేసు వేయగా, నెలకు రూ.7 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే అతీక్ కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయలేదు. నాలుగు నెలలుగా భార్యకు డబ్బులు ఇవ్వకుండా ఆమె ఫోన్ చేసిన లిప్ట్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. మళ్లీ కేసు పెడతానని భార్య అనడంతో అతడు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నట్లు ఈ నెల 11న వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల నిడివితో మెసేజ్ పంపాడు.

ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి వాట్సప్ మెసేజ్ భార్య ఫోన్‌కు పంపాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు అతిక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్ స్పెక్టర్ వివరించారు.కాగా సుప్రీంకోర్టు 2019లో 3:2 మెజారిటీతో ముస్లింలలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకునే ఆచారం చెల్లదని, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్దమని తీర్పునిచ్చింది. త్రిబుల్ తలాక్ చెప్పిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.