Everyone should plant trees to save the environment - Vishvambhara News

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
విశ్వంభర భూపాలపల్లి జూలై 9 :-  విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని  భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జయ శంకర్ ఎకో పార్కు లో అటవీశాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎస్పి కిరణ్ ఖరే తో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,  ఎస్పీ కిరణ్ ఖరే ఏకో పార్కులో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా విస్తీర్ణం లో అడవి ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా అని ప్రభుత్వం  సూచించిన విధంగా వనమహోత్సవం ద్వార జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రహదారుల వెంబడి, ఖాళీ ప్రదేశాలలోను, అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోను, పాఠశాలల్లోను మొక్కలు నాటాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు.

పెద్ద మొత్తంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ
కాలుష్య నివారణకు ప్రతి ఇంటి ఆవరణలో కనీసం మూడు నుండి ఐదు మొక్కలు తప్పకుండా నాటాలని ఎమ్మెల్యే అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సింగరేణి, అటవి శాఖ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ నర్సరీల ద్వారా గ్రామ, మున్సిపల్ స్థాయిలో ప్రతి ఇంటికి ఉచితంగా మొక్కలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.  వృక్షాలను మనం రక్షించినప్పుడు అవి తిరిగి మనల్ని రక్షిస్తాయని కాబట్టి పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు కంకణ బద్ధులుగా గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు.
ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని భూపాలపల్లి జిల్లా రాష్ట్రంలోనే పర్యావరణ సమతుల్యత కలిగిన జిల్లా అని  ప్రతి కుటుంబం తమ ఇంటి ఆవరణలో ఖాళీ స్థలాల్లో కచ్చితంగా మొక్కలు నాటాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్ఓ వసంత,
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు,
అటవి శాఖ అధికారులు, మున్సిపల్  కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.