JEE mains - Vishvambhara News

జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..!
బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఇవాళ(ఆదివారం) విడుదల చేసింది. రెండు విభాగాల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఉండటం విశేషం. ఇక ఏపీకి చెందిన యాయవరం శ్రవణ్‌ రామ్‌, తెలంగాణ విద్యార్థులు వివేక్‌జిత్‌ దాస్‌, బోడ ప్రభంజన్‌ జాదవ్‌, బానోత్‌ రిత్వక్‌ 99 పర్సంటైల్‌ స్కోర్‌ చేశారు. అదేవిధంగా బీప్లాన్‌లో కర్ణాటకకు చెందిన అరుణ్‌ రాధాక్రిష్ణ, ఏపీకి చెందిన కలసాని సాకేత్‌ ప్రణవ్‌ (ఏపీ) 100 పర్సంటైల్‌ సాధించారు.

ఏపీకి చెందిన మరో విద్యార్థి కాలిగాట్ల దేవీప్రసాద్‌ 99.99 పర్సంటైల్‌ సాధించాడు. ఏప్రిల్‌ 12న జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్షను దేశవ్యాప్తంగా 291 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. బీఆర్క్‌ పరీక్షకు 36,707 మంది, బీప్లానింగ్‌ పరీక్షకు 16,228 మంది విద్యార్థులు హాజరయ్యారు. 73,362 మంది విద్యార్థులు బీఆర్క్‌కు, 38,105 మంది బీప్లానింగ్‌ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్నారు. కాగా, బీఆర్క్‌ పరీక్ష ఫలితాల్లో జార్ఖండ్‌కు చెందిన బసాక్‌, తమిళనాడు విద్యార్థి ముత్తు 100 పర్సంటైల్‌ సాధించారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.ac.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చు.