Road Accident - Vishvambhara News

Himachal Pradesh bus accident: ఘోర బస్సు ప్రమాదం... 12 మంది మృతి..!!
Himachal Pradesh bus accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బస్సు సిమ్లా నుంచి కుప్వీ వైపు ప్రయాణిస్తోంది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ‘పోష్’ పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హరిపుర్‌ధార్ మార్కెట్ సమీపంలో మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో బస్సు మలుపు వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉండటంతో డ్రైవర్‌కు రహదారి స్పష్టంగా కనిపించకపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లోయలో పడిన బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్థులు సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. గాయపడిన వారిని నాహన్, రాజ్‌గఢ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘోర ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి
నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్‌వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్‌లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

దక్షిణ నేపాల్‌లోని రౌతాహత్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారత నంబర్ ప్లేట్ ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో జీపు డ్రైవర్ సోహైల్ అమీర్ (22) కూడా ఉన్నారని, వారందరూ బిర్‌గంజ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో సుమారు 17 మంది ప్రయాణికులతో ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.

ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందం సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు, గాయపడిన ఇద్దరిని బృందం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి పంపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

#WATCH | Uttarakhand: A tempo traveller, with about 17 passengers on board, fell into a deep gorge near Badrinath Highway in Rudraprayag. Rescue work is being carried out by SDRF and Police team. So far, two injured have been sent to the hospital by the team through ambulance.… pic.twitter.com/5v9nhLFL4B

— ANI (@ANI) June 15, 2024

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు నుంచి రొయ్యల లోడ్‌తో వస్తున్న లారీని, పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న మరో లారీ ఢీకొంది.

కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. మృతుల్లో ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నారు.

మరో లారీలో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడున్నారు. ఘటనాస్థలంలో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 4గంటలకు ప్రమాదం జరగగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

ఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి
రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ అకాడమి వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో 10మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ 10 మంది విద్యార్థులు వీకెండ్ కావటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఓ ఫుడ్ కోర్టుకు వెళ్లారు.

రాత్రి అక్కడ భోజనం చేసిన విద్యార్థులు రెండు కార్లలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో పోలీస్ అకాడమి వద్ద కార్లు రోడ్డు పక్కన నిలిపారు. ఔటర్ రింగు రోడ్డులో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ అదుపుతప్పి ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి, యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం ధాటికి వారి శరీరాలు నుజ్జు నుజ్జయ్యాయి.

మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.మరికొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరిలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందినవారి వివరాలు తెలియాల్సివుంది.

వివాహ వేడుకలో విషాదం.. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతి
ఓ వివాహ వేడుకలో విషాదం మిగిలింది. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వ్యక్తి రాత్రి 10గంటల తర్వాత పాటలు ప్లే చేయడం మానేశాడు.

దీంతో అతడికి పెళ్లికి వచ్చిన బంధువుల మధ్య గొడవ చెలరేగింది. పాటలు పెట్టాల్సిందేనని బంధువులు వాదించగా డీజే ఆపరేటర్ మాత్రం సమయం అయిపోయిందని వారితో చెప్పాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్లేందుకు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తిప్పడం ప్రారంభించాడు. దీంతో అడ్డగించబోయిన ఓ బాలిక, ఇద్దరు మహిళలు డీజే వాహనం చక్రాల కింద పడిపోయారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా రమరతి (55) అనే మహిళ, రేష్మ (17), శాంత (30) చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన అనంతరం స్థానికులు ఆగ్రహంతో డీజే వాహనానికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నామని బేతుల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ కమలా జోషి వెల్లడించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 20మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్ షహర్ నుంచి భక్తులు వైష్ణో దేవిని దర్శించుకోవడానికి మినీ బస్సులో బయల్దేరారు.

ఈ క్రమంలో ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలై ఏడుగు మృతిచెందగా మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. బస్సులోని ప్రయాణికులు ఒకే కుటుంబానికి చెందిన వారీగా గుర్తించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబాలా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Haryana | Seven people died and more than 20 people were injured in a bus accident on the Ambala-Delhi-Jammu National Highway: Dr. Kaushal Kumar, Civil Hospital, Ambala Cantt https://t.co/Iu332pIKq4 pic.twitter.com/6JcaJ4gxSv

— ANI (@ANI) May 24, 2024

బోల్తాపడ్డ ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు... ఇద్దరు బాలికలు మృతి
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానాకు చెందిన ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సు హైదరాబాద్‌ నుంచి బళ్లారికీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

వివరాలు ఇలా ఉన్నాయి... ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ నిద్ర మత్తులో బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లిచూపులకు వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి..!
పెళ్లిచూపులకు వస్తుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆ యువకుడు అక్కడికక్కడే   దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్‌.మల్లవరం గ్రామానికి చెందిన పాలకుర్తి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు సందీప్‌ (31) ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కొంతకాలం అమెరికాలోనూ ఉద్యోగం చేశాడు. అయితే విదేశాల్లో ఉద్యోగం చేయడం ఇష్టంలేక తల్లిదండ్రులతో ఉంటూనే జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చి ఇక్కడే జాబ్ చూసుకున్నాడు. ఈ క్రమంలో సందీప్‌కు ఒక పెళ్లి సంబంధం వచ్చింది.

పెళ్లిచూపులు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పడంతో బెంగళూరు నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఐతేపల్లి సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శనివారం వేకువజామున సందీప్‌ ప్రయాణిస్తున్న కారు.. ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.