vishvambhara - Vishvambhara News

నిత్య శ్రామికుడు.! అలుపెరగని కార్మికుడు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.!!
విశ్వంభర,హైదరాబాద్ : "కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున అంటే సెప్టెంబర్ 6, 2024న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించింది. మృధు స్వభావి, అజాత శత్రువు, అందరిని కలుపుకుని ముందుకు వెళ్లే మంచి మనసున్న మహేష్ కుమార్ గౌడ్ అనతి కాలంలోనే పార్టీలో అందరివాడుగా ముద్ర వేసుకున్నారు."

కార్యకర్తలకు అందుబాటులో అతి సామాన్య కార్యకర్తగా..

ఒక్క ఉపాయం జీవితాన్నే మార్చేస్తుందనే ది వ్యాపార ప్రకటన, కానీ ఒక్క అవకాశం చరిత్రగతినే మార్చేస్తుందనే ది  రాజకీయం. వందేళ్ల సుధీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అరుదైన సంఘటనలు, చరిత్ర గతిని మార్చే సందర్బాలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఊహించని పరిణామాలకు కేంద్ర బిందువుగా కూడా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. అంకితభావంతో పార్టీ కోసం పని చేసిన  సామాన్య కార్యకర్తలు పార్టీ పరంగా అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలను ఆవిష్కరించిన ఆనవాళ్లు కూడా కోకొల్లలు. అచ్చం అదే కోవలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనదైన మార్క్ రాజకీయాలను దూకుడుగా కొనసాగిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా బాధ్యతలు చేపట్టి  నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా విశ్వంభర ప్రత్యేక కథనం.

అందరివాడు గా పీసీసీ చీఫ్ ..

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున అంటే 6-9-2024న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించింది. మృధు స్వభావి, అజాత శత్రువు, అందరిని కలుపుకుని ముందుకు వెళ్లే మంచి మనసున్న మహేష్ కుమార్ గౌడ్ అనతి కాలంలోనే అందరివాడుగా ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన 10 రోజుల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.ఆ తర్వాత ప్రభుత్వానికి, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు వారధిగా పనిచేస్తూ వినూత్న అడుగులు వేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్.

గాంధీ భవన్లొ సందడి వెనక పీసీసీ చీఫ్ ప్రత్యేక కార్యాచరణ..

గత సెప్టెంబర్ 25-2024వ తారీఖున మంత్రులను గాంధీ భవన్ లో అందుబాటులో ఉండాలని చెప్తూ  ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని రూపొందించారు మహేష్ కుమార్ గౌడ్. ఏడాది కాలంగా ఆ కార్యక్రమం అజరామరంగా కొనసాగుతోంది. దీంతో  ప్రతిరోజూ మంత్రులు, అనుచరులు, వివిధ సమస్యలతో వచ్చే సామాన్య ప్రజలతో గాంధీ భవన్ నిత్యం సందడిగా కనిపిస్తుంటుంది. అదే సెప్టెంబర్ 25న బీసీ సంఘాల నాయకులతో పీసీసీ అధ్యక్ష హోదాలో  తొలి సమావేశం నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని మొదటి సమావేశం రోజునే బీజం పడిందని చెప్పొచ్చు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటమే ఎజెండా..

ఆ తర్వాత జిల్లాల స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు అక్టోబర్ 3నుండి జిల్లాల  పర్యటన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసారు మహేష్ కుమార్ గౌడ్. 2024 నవంబర్ 5వ తారీఖున కుల గణన విధి విధానాల కోసం బోయనపల్లి గాంధేయన్ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్ గాంధీ సారధ్యంలో జరిగిన భేటీకి కీలక సలహాలందించారు మహేష్ కుమార్ గౌడ్. కుల గణనలో దేశానికి ఆదర్శంగా నిలిచింది ఈ సర్వే. అదే నెల నవంబర్ 10వ తారీఖున రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మలేషియా పర్యటనకు శ్రీకారం చుట్టారు మహేష్ కుమార్ గౌడ్. అదే సంవత్సరం డిసెంబర్ 18న మణిపూర్ మారణహోమాన్ని నిరసిస్తూ ప్రముఖ వ్యాపార దిగ్గజం అధానీకి వ్యతిరేకంగా ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుండి అనూహ్య స్పందన రావడం విశేషం. మణిపూర్ ఘటనలకు నిరసన కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యక్రమాలే కాకుండా మానవీయ కోణంలో కూడా నాయకులు స్పందిస్తా రనే సంకేతాలు క్యాడర్ కు పంపించారు మహేష్ కుమార్ గౌడ్.

కేంద్ర సర్కార్ విధానాలపై వ్యతిరేకత ముందంజ..

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన గౌతం అధాని అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకురావడాన్ని నిరసిస్తూ  వాస్తవాలు  ప్రజానీకానికి తెలియజేసేందుకు ఛలో  రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుని విజయవంతం చేసారు మహేష్ కుమార్ గౌడ్. అంతే కాకుండా అంబేడ్కర్ విగ్రహం వరకూ భారీ ర్యాలీ తోపాటు జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

బీసీ బిల్లు రూపకల్పనలో పీసీసీ చీఫ్ కీలక భూమిక..

ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన బీసీ పోరు గర్జన కార్యక్రమానికి నేతృత్వం వహించారు మహేష్ కుమార్ గౌడ్. బీసీ రాజ్యాధికారం, బీసీ సాధికారత, బీసీ రిజర్వేషన్ల సాధన పట్ల బీసీ సామాజిక వర్గంలో కొత్త ఆలోచనలకు ఈ నిరసన కార్యక్రమం శ్రీకారం చుట్టింది. అదే ఏప్రిల్ 8న గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో నిర్వహించిన సీడబ్ల్యూసీ మరియు ఏఐసీసీ సమావేశానికి హాజరై కీలక ప్రసంగం చేసారు మహేష్ కుమార్ గౌడ్. ఏప్రిల్ 13న కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వక్ప్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. ఇదిలా ఉండగా ఏప్రిల్ 16న నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబ సభ్యుల విచారణ నోటీసుల నేపధ్యంలో బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి గాంధీ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్.

దిగ్విజయంగా ప్రజాప్రతినిధులు కార్యక్రమం..

ఇక మే నెలలో ఆపరేషన్ సింధూర్ నేపధ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వినూత్న ర్యాలీ నిర్వహించారు. అదే మే నెల 29, 2025 నుండి జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని జూన్ 4, 2025వరకూ అప్రతిహతంగా కొనసాగించారు మహేష్ కుమార్ గౌడ్. ఆ తర్వాత అనూహ్యంగా జూన్ 10వ తారీఖునుండి అందుబాటులో ప్రజాప్రతినిధులు కార్యక్రమం పేరుతో ప్రతీ రోజు ఒక నాయకుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్ లో అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమం నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. జూలై 2న పఠాన్ చెరు సిగాచీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల మహేష్ కుమార్ గౌడ్ చలించిపోయారు. హుటాహుటిన బాధితులను పరామర్శించారు. బాధిత కుటంబాలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్.

కార్యక్రమాల రూప శిల్పి..  ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పీసీసీ..

జూలై 31 జనహిత పాదయాత్ర మరియు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పనితీరును క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రెండు విడతలుగా జరిగింది. అదే ఆగస్టు నెల 14న బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర కు సంఘీభావంగా ఓట్ చోర్ - గద్దీ చోడ్ అనే నినాదంతో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. దీంతో ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసి పార్టీ బలోపేతానికి దోహదం చేయడమే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు మహేష్ కుమార్ గౌడ్. సంవత్సర కాలంలోనే తన మార్క్ రాజకీయ ముద్రను బలంగా చాటుకున్నారు మహేష్ కుమార్ గౌడ్.

కృష్ణహరి. సీనియర్ జర్నలిస్ట్

ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్
విశ్వంభర,హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన ఆరు గ్యారెంటీలలో దాదాపు అన్ని అమలు చేశామన్న ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, బట్టి విక్రమార్క లాంటి కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీ కార్డులను దాచుకోండి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని హామీలను నెరవేర్చుతాం” అని ప్రజలను మభ్యపెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు వంద రోజులు కాదు, రెండు సంవత్సరాలు గడిచిపోయినా ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రభుత్వం, దాదాపు అన్నీ చేశామంటూ చెప్పడం ప్రజలను మోసగించడమే” అని కేటీఆర్ మండిపడ్డారు.

ఆరు గారంటీల అమలు విషయంలో, ఇచ్చిన 420 హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం, ప్రోపగండాను చూసి ప్రజలు అసలు నిజం అర్థం చేసుకున్నారని, అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తరిమేస్తున్నారని కేటీఆర్ అన్నారు.భట్టి విక్రమార్కతో పాటు క్యాబినెట్‌లో ఉన్న ఏ మంత్రి అయినా రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్లి, మేము అన్ని హామీలు అమలు చేశాం” అని ప్రజల ముందు చెప్పాలని ఆయన సవాలు విసిరారు. దమ్ముంటే చెప్పండి… చెప్పిన తర్వాత ప్రజలు మిమ్మల్ని తరిమి వేయకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న అబద్ధాలకు, ప్రోపగండాకు ప్రతి గ్రామంలో ప్రజలే సమాధానం చెప్తారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఘనంగా ప్రారంభమైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024
భారతదేశ సెయిలింగ్ క్యాలెండర్‌లో ల్యాండ్‌మార్క్ ఈవెంట్ అయిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్  2024 ఈరోజు ఘనంగా  ప్రారంభించబడింది. ప్రారంభ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే VSM, కమాండెంట్ MCEME, కల్నల్ కమాండెంట్ కార్ప్స్ ఆఫ్ EME, కమోడోర్ EME సెయిలింగ్ అసోసియేషన్ మరియు ప్రెసిడెంట్ లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో EME సెయిలింగ్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ సెయిలింగ్‌ ప్రతిభకు, క్రీడాస్ఫూర్తికి పోటీగా నిలువనుంది .

భారతదేశానికి చారిత్రాత్మకంగా, EME సెయిలింగ్ అసోసియేషన్ 15 సంవత్సరాలలో మొదటిసారిగా అంతర్జాతీయ మెజరర్స్ క్లినిక్, అంతర్జాతీయ న్యాయమూర్తుల సెమినార్‌ను కూడా నిర్వహించింది, సెయిలింగ్ పోటీలలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలను కొనసాగించడానికి మరియు ప్రతిభను పెంపొందించడానికి ఈవెంట్ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది.
ఈ సంవత్సరం బహుళ-తరగతి రెగట్టా యొక్క పునరుజ్జీవనాన్ని కూడా సూచిస్తుంది, ఇవి సెయిలింగ్ ఔత్సాహికుల యొక్క విభిన్న శ్రేణిని ఒకచోట చేర్చి, భారతదేశంలో పెరుగుతున్న ప్రజాదరణ మరియు పోటీ స్ఫూర్తికి దోహదం చేస్తాయి.

ఈవెంట్‌లలో సమగ్ర పవర్‌బోట్ కోర్సులు మరియు దేశం నలుమూలల నుండి వచ్చిన NCC క్యాడెట్ నావికుల కోసం YAI కోచింగ్ క్యాంప్ ఉన్నాయి, ఇది ఈవెంట్ యొక్క సమగ్ర స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఈ శిబిరం బాలిక నావికులకు శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించింది మరియు BASS అనాథాశ్రమంలోని పిల్లల కోసం ప్రత్యేక సెషన్‌లను ప్రదర్శించింది, యువ తరంలో నౌకాయానం పట్ల ప్రేమను పెంపొందించింది.EME సెయిలింగ్ అసోసియేషన్ & లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ఆర్మీ మరియు దేశంలో క్రీడలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.