mahesh kumar goud - Vishvambhara News

ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వానికి 1000 రోజులు: మహేష్‌ కుమార్‌ గౌడ్
Mahesh Kumar Goud: ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ప్రజాపాలనలో 1000 రోజులు ఒక మైలురాయిగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రైతులు, మహిళలు, యువత, బలహీనవర్గాలను ప్రభుత్వ విధానాలకు కేంద్రబిందువుగా మార్చామని చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కల్పించామని, రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. రుణమాఫీ కోసం రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని చెప్పారు. ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.30 వేల కోట్లు, సన్నవడ్ల బోనస్‌కు దాదాపు రూ.4 వేల కోట్లు, రైతుబీమాకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌ అందిస్తున్నామని చెప్పారు. పేదల కోసం 16.32 లక్షల కొత్త రేషన్‌ కార్డులు జారీ చేశామని, మొత్తం 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని తెలిపారు.

తెలంగాణ యువతలో విశ్వాసం కల్పించేలా 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం ప్రారంభించడంతో పాటు 100 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ సామాజిక న్యాయ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్
విశ్వంభర,హైదరాబాద్: ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరదీసింది.. ‘దీక్ష దివాస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ బయటికి వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ముగిసిన శకం అని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రజా సెంటిమెంట్‌ను రాజకీయ లాభం కోసం వాడుకుని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందింది అని ఆయన ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బూటకపు మాటలను నమ్మవద్దని  తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారని.. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం అని ఆరోపించారు.

తెలంగాణ వచ్చింది కేసీఆర్ దీక్ష వల్ల కాదని సోనియా గాంధీ వల్ల వచ్చిందన్నారు. ‘రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా’ అని చెప్పి నిమ్స్‌లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, కేటీఆర్ ఒక్కసారి చదవాలని సూచించారు.బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించాలని హితవు పలికారు. 2009లో ముగిసిన దీక్షతో బీఆర్ఎస్ నాటకాలకు తెరతీస్తోందనిమండిపడ్డారు. నిజమైన దీక్షకు మయన్మార్ ఐరన్ లేడీఇరోమ్ షర్మిలా 16 ఏళ్ల నిరాహార దీక్షే ఉదాహరణ అని.. షర్మిల దీక్షకు కేసీఆర్ దీక్షకు “నక్క – నాగలోకం” తేడా ఉందని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయం అని మహేశ్ గౌడ్ జోష్యం చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక వర్సిటీల విద్యార్థులు ఉద్యమానికి ఊపిరులుగా నిలిచారన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని చెప్పుకొచ్చారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ప్రజలకు మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ సమావేశం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.తొలుత ఎమ్మెల్యేలతో రేవంత్, దీపాదాస్ సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం అవుతారు. సమావేశంలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా పాల్గొంటారు. దీనివల్ల వారి మధ్య సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్.. అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్చర్లలో ఎమ్మెల్యేల సమావేశం విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!
తెలంగాణ బీసీల్లో బలమైన  సామాజిక వర్గాల్లో ఒకటి గౌడ సామాజిక వర్గం. దీంతో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ ను  పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ కే పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.

అయితే పీసీసీ పదవి కోసం మంత్రులతో సహా ముఖ్యనేతలు పోటీ పడ్డారు . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు , మధు యాష్కీ గౌడ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి , జగ్గారెడ్డి , సీతక్క , బలరాం నాయక్ , సంపత్ కుమార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది .కానీ చివరికి రేసులో మహేష్ కుమార్ గౌడ్ , బలరాం నాయక్ పోటీ పడ్డారు . అయితే సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం, బీసీ నాయకుడు కావడం , ఎన్ ఎస్ యూ ఐ నుండి పార్టీ లో ఎదిగిన నేతగా ఉండడం మహేష్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చింది అని తెలుస్తుంది . అలాగే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కు  సీఎం రేవంత్ మద్దతు తెలుపడంతో, ఇటు పార్టీ అటు ప్రభుత్వం రెండు   సమన్వయంగా  పనిచేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో రేవంత్ మద్దతు తెలిపిన మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ గా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అయినట్లు తెలుస్తుంది

ఇక పీసీసీ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పదవులు, పీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ పెద్దలతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో బీసీల్లో మరో బలమైన సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. ఈ సామాజికవర్గానికి ఈసారి మంత్రి  పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి హైదరాబాద్ , రంగారెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు రానున్నాయి.నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావు , మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .