school books - Vishvambhara News

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
Anantapuram Sri Chaitanya School: అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆదిమూర్తి నగర్‌లో ఉన్న శ్రీ చైతన్య సిక్స్త్ బ్రాంచ్‌లో పుస్తకాల విక్రయాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయించి, వాటిని విద్యార్థుల ఇళ్లకు, పాఠశాలకు లేదా ఉపాధ్యాయుల ఇళ్లకు తెప్పించి అక్కడి నుంచి విద్యార్థులకు అందజేస్తున్నారని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి మెటా యాప్ పేరుతో సుమారు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి చదువుతున్న చిన్నారికి ఫోన్, మెటా యాప్‌తో ఏం పని ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల అవసరాల పేరుతో అదనపు యాప్‌లు, పుస్తకాలు, ఇతర సామగ్రిని తప్పనిసరి చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, బెల్టులు తదితర వస్తువులను పాఠశాలలే విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించిందా? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై గతంలో కూడా పలు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతపురం ఎంఈఓ, డీఈఓ అధికారులు స్పందించి పాఠశాలలో జరుగుతున్న పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి విక్రయాలపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించి సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

స్కూల్ పుస్తకాల్లో తమన్నా బయోగ్రఫీ.. భగ్గుమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
హీరోయిన్ తమన్నా గురించి అందరికీ తెలిసిందే. ఆమె చాలా కాలంగా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే ఇప్పడు తమన్నా విషయంలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఎందుకంటే ఆమె జీవిత చరిత్రను ఓ స్కూల్ పాఠ్య పుస్తకాల్లో పెట్టారు. దాంతో స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులోని హెబ్బ‌ళ సింధీ స్కూల్ కు చెందిన ఏడో తరగతి స్టూడెంట్ల పాఠ్య పుస్తకాల్లో తమన్నా, రణ్‌వీర్‌ సింగ్‌ జీవిత చరిత్రను పాఠంగా చేర్చారు. వీరిద్దరూ సింధీ వర్గానికి చెందిన వారే కాబట్టి.. వారిద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు.. ఎలా పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు అనేది పుస్తకాల్లో ఉంచారు.

కాగా దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు సినిమాల పిచ్చి పడుతుందని వారు ఆగ్రహం తెలుపుతున్నారు. దీన్ని విద్యా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చిల్డ్ర‌న్ రైట్స్ క‌మీష‌న్‌తో పాటు క‌ర్ణాట‌క‌ ప్రైమ‌రీ అండ్ సెకండ‌రీ స్కూల్స్ బోర్డ్‌కు విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.