brs mla - Vishvambhara News

పంట కొంటారా? కొనరా?
విశ్వంభర, ఆర్మూర్: రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటలను  కొంటారో? కొనరో? సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
తమ పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నా ఈ ఇందిరమ్మ రాజ్యానికి  ఇసుమంత కనికరం కూడా లేదని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం రోడ్లపై, కల్లాల్లో మండుతున్న ఎండలకు ఎండుతూ తూకం తగ్గుతోందని, అకాల వానలకు తడిచి ముద్దవుతోందని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి అన్నదాతల ఆరుగాలం శ్రమ ఆవిరవుతోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేకేశ్వర్, ఆలూర్, నందిపేట్ ఆర్మూర్ రూరల్ తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి పంట పండించారని ఆయన తెలిపారు. అయితే ధాన్యం  కొనేదిక్కులేక రైతుల దైన్యం వర్ణనాతీతమని ఆయన చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు.  అటు ఐకేపీలు, ఇటు సొసైటీలు ఎవరికి వారుగా కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ కల్లాలపై ధాన్యం రాశులు మాత్రం కదలడం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారని, రైతులను అవమానిస్తున్నారని, ధాన్యం అమ్ముడుపోక రైతులు నానా అవస్థలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు
క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న దయనీయ పరిస్థితి చూస్తుంటే పంటల కొనుగోలుపై సర్కార్ మాటలు నీటిమూటలేనని విధితమవుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. చివరి గింజ వరకూ కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే అరిగిపోయిన రికార్డును పదేపదే వినిపిస్తున్నా ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని, గన్నీ బ్యాగులు, కాంటాలు, లారీలు కనిపించడం లేదని ఆయన తెలిపారు.
ఇకనైనా గిట్టుబాటు ధరకు పంటంతా కొనకపోతే రైతాంగం ఆందోళన బాట పట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు.  అన్నదాతల ఆగ్రహాన్ని సర్కార్ చవి చూడకతప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

బ్రేకింగ్ : మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఈరోజు ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు.

తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు

తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.

అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం చేసి.. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. అలా చేస్తే పొన్నం ప్రభాకర్ కు తాను క్షమాపణలు చెబుతానని.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు కౌశిక్ రెడ్డి.