#Telangana #cabinet #meeting #postponed #news #politics #government #update - Vishvambhara News

తెలంగాణ కేబినెట్ మీటింగ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
తెలంగాణ కేబినెట్ సమావేశం నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఈసీ నుంచి అనుమతి వచ్చినపడు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం.. ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అంతా మధ్యాహ్నం నుంచి సచివాలయంలోనే ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు.

కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ నిలిచిపోయింది. సీఎంతో పాటు మంత్రులు వెనుదిరిగి వెళ్లారు. ఈసీ అనుమతి దొరికితే రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై చర్చించాలని అనుకున్నారు. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జరగనుంది. దీంతో.. ఆ వేడుకల నిర్వహణతో విభజన అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని అనుకున్నారు. కానీ.. ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో భేటీ వాయిదా పడింది. అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని చెప్పారు.