demoted as constable from DSP - Vishvambhara News

మహిళా కానిస్టేబుల్‌తో ఎఫైర్‌.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోట్‌
మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి ఉత్తరప్రదేశ్‌ పోలీసులు షాకిచ్చారు. డీఎస్పీగా ఉన్న ఆయన్ను ఏకంగా కానిస్టేబుల్‌ స్థాయికి డిమోట్‌ చేశారు. మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా గడుపుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న మూడేళ్లకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీకి చెందిన కృపా శంకర్‌ కనౌజియా కానిస్టేబుల్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి ఎదిగాడు. 2021లో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో కుటుంబ కారణాలు చెప్పి సెలవుపెట్టాడు. ఇంటికి వెళ్లడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో భర్త ఇంటికి రాకపోవగా, ఫోన్లు కలవకపోవడంతో ఏం జరిగిందోనని భయపడిపోయిన అతడి భార్య ఎస్పీని ఆశ్రయించింది.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అయితే ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఏకంతంగా ఉండటాన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీతోపాటు ఇతర ఆధారాలు సేకరించిన అధికారులు అతడిపై క్రమశిక్షణారాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ఇందులో భాగంగా డీఎస్పీగా ఉన్న అతడిని గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోట్‌ చేశారు.