BJP - Vishvambhara News

హామీలు గాలికి.. వసూళ్లే లక్ష్యం..రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ధ్వజం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం తన కుర్చీని కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల అభివృద్ధిపై లేదని విమర్శించారు. ఢిల్లీలోని పెద్దలకు వేల కోట్ల రూపాయలు పంపడంపైనే మంత్రివర్గ సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయని, సామాన్యుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు నెలకు రూ.2500లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

నిరుద్యోగులు, విద్యార్థులపై నిర్లక్ష్యం
నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ నిలదీశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల వేలాది విద్యా సంస్థలు, లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు పేదలకు వైద్యం అందించడం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలే లక్ష్యంగా పోరాటం
కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో, వాటికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో కేబినెట్ సమావేశంలో చర్చించి స్పష్టమైన తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ ప్రజాప్రతినిధులు
మంగళవారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనకు బీజేపీ సిద్ధమైంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి బండి సంజయ్, రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరి భాగ్యలక్ష్మి ఆలయం, అనంతరం లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టి
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  తాజాగా విడుదల చేసిన 2024–25 ఆర్థిక సంవత్సర నివేదిక ప్రకారం.. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా అందిన విరాళాల్లో సింహభాగం బీజేపీకే దక్కాయి. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి ఎలక్టోరల్ ట్రస్ట్‌లకు రూ.3,826 కోట్ల విరాళాలు అందాయి. ఈ మొత్తం నిధుల్లో, బీజేపీకి రూ.3,157 కోట్లు (సుమారు 82.5%) దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం రూ.298.78 కోట్లు (7.8%) మాత్రమే దక్కాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.102 కోట్లు అందాయి.

ప్రధాన దాతలు - కార్పొరేట్ దిగ్గజాల వాటా
రాజకీయ విరాళాల్లో కార్పొరేట్ సంస్థల వాటా అత్యధికంగా ఉంది. ఎలివేటెడ్ అవెన్యూ రియల్టీ రూ.500 కోట్లు అందజేసి అగ్రస్థానంలో నిలిచింది. టాటా గ్రూప్ (టాటా సన్స్ & TCS) సుమారు రూ.525 కోట్ల నిధులను సమకూర్చింది. మేఘా ఇంజనీరింగ్ తెలుగు రాష్ట్రాల నుండి రూ.175 కోట్లను విరాళంగా ఇచ్చి ప్రముఖ దాతల జాబితాలో నిలిచింది. ఈ భారీ నిధుల సమీకరణ బీజేపీకి పార్టీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు, ఎన్నికల వ్యయానికి భారీ ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిధుల సమీకరణలో కనిపిస్తున్న ఈ భారీ వ్యత్యాసం, భవిష్యత్తులో ఎన్నికల ప్రచారాలు, పోటీ తత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిజామాబాద్‌లో హంగ్.. ప్రతిపక్షానికే బీజేపీ పరిమితం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు హంగ్‌కు దారితీయడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమవుతామని సంచలన ప్రకటన చేయగా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

మొత్తం 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. బీజేపీ 28 స్థానాలు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు, ఇతరులు ఒక స్థానం గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యుల (ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్) మద్దతుతో, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ నాయకత్వం మంతనాలు ముమ్మరం చేసింది.

బీజేపీ నిర్ణయం: ప్రతిపక్షంలోనే
నిజామాబాద్‌లో తమకు స్పష్టమైన మెజారిటీ రాలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలోనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. అయితే, మేయర్ పదవీకాలం ముగిసేలోపు నిజామాబాద్ పేరును 'ఇందూరు'గా మార్చే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తామని ఎంపీ అరవింద్ తెలిపారు. ఆర్మూర్ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు.

కాంగ్రెస్ దేశానికి పట్టిన పెద్ద పీడ: కిషన్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మానికి, దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద అవరోధమని, ఆ పార్టీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికలు కేవలం వార్డుల గెలుపు కోసం కాదని, తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి ప్రస్తుతం "పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా" తయారైందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే, ఇప్పుడు ఆ పార్టీ మంత్రులు దోచుకున్నది పంచుకోవడానికి కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అమరవీరుల ఆకాంక్షలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తుంగలో తొక్కాయని, కేవలం బీజేపీతోనే నిజమైన మార్పు సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

అభివృద్ధి విషయంలో కేంద్రం వెనకాడటం లేదని చెబుతూ కిషన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో రూ.3.50 లక్షల కోట్ల నిధులతో హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలను ప్రకటించామని, ఇవి రాష్ట్ర ఆర్థిక రూపురేఖలను మార్చబోతున్నాయని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 'పెద్దరికం' చేస్తోందే తప్ప, అదనంగా ఏమీ చేయడం లేదని విమర్శించారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం ఎంపీ స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య జాతీయ స్థాయిలో రహస్య ఒప్పందం ఉందని, అందుకే విచారణల పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను రక్షించాలంటే కమల దళాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరును విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా అది మూసీలో వేసినట్లే. ఆ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవీకాల్ బంధం" అని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ను కాపాడటమే కిషన్ రెడ్డి ప్రధాన అజెండా అని, అందుకే ఆయన ఇప్పుడు 'కల్వకుంట్ల కిషన్ రావు'గా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని కేసీఆర్ దత్తపుత్రుడిగా అభివర్ణిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

స్మార్ట్ సిటీ ఏది? నిధులు ఏవి?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను రెండుసార్లు గెలిపించినా జిల్లాకు సాధించిందేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ మూడుసార్లు ప్రధాని అయినా నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ మురికికూపంగా మారిందని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వని బీజేపీకి, ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మన వార్డుల్లో మన కార్పొరేటర్లు ఉంటేనే నిధుల ప్రవాహం సాధ్యమవుతుందని, అభివృద్ధికి బాటలు పడతాయని ప్రజలకు వివరించారు. "నేను అందరివాడిని.. నాకు కులం, మతం లేదు.. నా లక్ష్యం కేవలం అభివృద్ధి మాత్రమే" అని చెబుతూ, నిజామాబాద్ ఓటర్లు ఈ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు.

అవినీతిపై ఉక్కుపాదం మోపుతాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర సహ ఇన్‌ఛార్జిలు అశోక్ పర్ణామి, రేఖా శర్మతో కలిసి "వికసిత తెలంగాణ.. బీజేపీ సంకల్ప పత్రం" పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. పట్టణ రూపురేఖలను మారుస్తామని  హామీ ఇచ్చారు.

పెండింగ్‌లో ఉన్న పన్నుల విషయంలో ప్రజలకు భారీ ఊరట కల్పిస్తామని ప్రకటించారు. పట్టణాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని, యువత కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పైసా పొల్లుపోకుండా పారదర్శకంగా ఖర్చు చేస్తామని రామచందర్ రావు వెల్లడించారు. మున్సిపాలిటీల్లో అవినీతికి తావులేకుండా చేస్తామని, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు చురకలు
ఈ సందర్భంగా రామచందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఆ రెండు పార్టీలు వణికిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందని అడుగుతున్నారని, దానికి సమాధానంగా తాము జిల్లాల వారీగా లెక్కలు చెబుతామని, రేవంత్ రెడ్డి కూడా తన పాలనలో జిల్లాలకు ఏం చేశారో చెప్పగలరా అని సవాల్ విసిరారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం..
రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు దిగుతున్నాయని, దీనికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని రామచందర్ రావు ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించడం మానుకోవాలని, దాడులు కొనసాగితే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని ఆయన గుర్తు చేశారు.

పురపోరులో ఒంటరిగానే పోటీ: రాంచందర్ రావు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రణరంగం వేడెక్కింది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పరోక్షంగా చేతులు కలిపాయని రాంచందర్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే దారిలో నడుస్తూ బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, కానీ ప్రజలు వీరికి గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హోం, విద్య, మున్సిపల్ వంటి కీలక శాఖల బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిపాలనను గాలికి వదిలేసి ఆయన విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ప్రశ్నించారు. గులాబీ పార్టీ ఉనికిని కోల్పోతోందని ఎద్దేవా చేస్తూ.. "రాష్ట్రంలో ఇప్పుడు సార్ లేరు.. సర్కార్ లేదు.. కారు లేదు" అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ క్రమంగా కనుమరుగవుతోందని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని అన్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కూడా బీజేపీ పటిష్టంగా ఉందని, ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటుతామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజల కళ్లకు గంతలు కడుతున్నాయని, ఇరు పార్టీలు పరస్పర అవగాహనతో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన ఈ తీవ్రమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

సిట్ నోటీసులు కేవలం కాలయాపనే!

మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసుల పర్వం అంతా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతున్న నాటకమని ఆయన కొట్టిపారేశారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, ప్రధాన నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రజల్లో తాము ఏదో చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎండ్ లేని 'డైలీ సీరియల్'.. అసలు సూత్రధారులు ఎక్కడ?**

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్యాపింగ్ ఇష్యూను ఒక అంతులేని 'డైలీ సీరియల్'లా మార్చేసిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రోజుకో కొత్త లీక్ ఇవ్వడం, సోషల్ మీడియాలో హడావిడి చేయడం తప్ప, గడిచిన రెండేళ్ల కాలంలో ఈ కుట్ర వెనుక ఉన్న అసలైన సూత్రధారులను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం కొందరు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ఆ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రాజకీయ శక్తులను ఎప్పుడు బోనులో నిలబెడతారని ఆయన నిలదీశారు.

బీఆర్ఎస్ - కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం?

ఈ కేసులో జరుగుతున్న జాప్యం చూస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటూ, కేవలం ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజం ఈ మోసపూరిత రాజకీయాలను గమనిస్తోందని, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ నూతన సారథిగా నితిన్ నబీన్
విశ్వంభర, నేషనల్ న్యూస్: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, ఇకపై పూర్తిస్థాయి జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ నేతలు మొత్తం 37 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. గడువు ముగిసే సమయానికి ఆయనకు పోటీగా మరెవ్వరూ నామినేషన్లు వేయకపోవడంతో నితిన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యనేతల సమక్షంలో నామినేషన్
ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. పార్టీలో అందరి ఆమోదంతోనే ఆయనను ఈ కీలక పదవికి ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్.. మంగళవారం (జనవరి 20) ఉదయం 11 గంటలకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై స్పందించాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ధిక్కరించారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌తో ఏలేటి పిటిషన్‌ను సుప్రీంకోర్టు జత చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇటీవల ఇచ్చిన 'క్లీన్ చిట్' నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమని విపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, కానీ స్పీకర్ ఆ ఆదేశాలను ఏ మాత్రం పాటించడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానాన్ని గౌరవించకుండా నిర్ణయాన్ని కావాలనే సాగదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారాన్ని ఏలేటి ప్రత్యేకంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని, ఎంపీగా కూడా పోటీ చేశానని దానం స్వయంగా ప్రకటించిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. పార్టీ మారినట్లు ఆయనే ఒప్పుకున్నాక అనర్హత వేటు వేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు.

ఇప్పటికే ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఈ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? లేక మమ్మల్నే తీసుకోమంటారా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రెండు వారాల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పెండింగ్‌లో ఉంది. దీనికి నంబర్ కేటాయించిన తర్వాత విచారణ తేదీ ఖరారు కానుంది. ఒకవేళ సుప్రీంకోర్టు దీనిని ధిక్కరణ కేసుగా పరిగణిస్తే, స్పీకర్ కార్యాలయానికి ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వికసిత్ భారత్.. వికసిత్ కేరళతోనే సాధ్యం: అమిత్ షా
విశ్వంభర నేషనల్ బ్యూరో: 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) సాధించాలంటే అది 'వికసిత్ కేరళ'తోనే సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన స్థానిక సంస్థల బీజేపీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర సదస్సులో అమిత్ షా పాల్గొని.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం "మిషన్ 2026"ను అధికారికంగా ప్రారంభించారు. త్వరలో బీజేపీకి చెందిన నేత కేరళ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి తిరువనంతపురం కీలక మైలురాయని అభివర్ణించారు. కేరళలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు.

శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల వివాదంపై అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో ఇద్దరు మంత్రులు ప్రజల దృష్టిలో దోషులుగా ఉన్నారని, వారి ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని అన్నారు. "శబరిమల ఆస్తులను కాపాడలేని వారు, మన నమ్మకాలను కాపాడలేరు" అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దేశమంతా ఆందోళనతో ఉందని చెప్పారు. కేరళ ఆర్థిక వ్యవస్థ కేవలం విదేశీ నిధులపైనే ఆధారపడకూడదని, ఇక్కడ సమగ్ర అభివృద్ధి జరగాలని అమిత్ షా సూచించారు. ప్రధాని మోదీ దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించారని, అటువంటి సమతుల్య అభివృద్ధి నమూనా కేరళకు అవసరమని పేర్కొన్నారు.