Political News - Vishvambhara News

మేడిగడ్డను సందర్శించిన మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
విశ్వంభర జూలై 26 : -కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే..

రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా.. ఇంత నిర్లక్ష్యమా..

ఇప్పుడు నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయటపడతదనే భయపడుతున్నరు..

ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని వాళ్ళు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని పంటలు ఎండపెట్టిండ్రు..

ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది..

గతంలో 28 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రావడం జరిగింది..

అంత ప్రవాహం ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కుచెదరలేదు..

ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందింది..

దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఇంజనీర్లే చెపుతున్నారు..

ఇప్పుడు కూడా నీళ్లు ఇచ్చేందుకు ఎలాంటి సమస్యలేదంటున్నరు..

అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అబాసుపలువుతామని బయపడుతున్నరు..

అసలు మనకు నీళ్లొచ్చే కన్నెపల్లి పంప్ హౌజ్ కాలేశ్వరానికి 20 కి.మీ పైన ఉన్నది.. అది ఎప్పటికీ లిఫ్ట్ చేస్తనే ఉంటది..

సుందిళ్ళ, అన్నారంలో కొత్తగా ఏమైనా ఇబ్బందజేలొస్తాయనే ప్రచారంతో తప్పుదోవపట్టించారు..

కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు.. మనకు నీళ్లిచ్చే కన్నెపల్లి కు ఎత్తిపోయడానికి సంబంధమే లేదు..

సంబంధం లేని సాకులతో కాంగ్రెస్  రైతాంగాన్ని మోసం చేస్తుంది..

కాళేశ్వరం పై చేసిన దుష్ప్రచారానికి కాంగ్రెస్ రైతగానికి క్షమాపణ చెప్పి నీళ్లను అందించాలి..

వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్‌కింద పడి ఇద్దరు దుర్మరణం
ఆర్టీసీ బస్ కిందపడి వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. ఆర్టీసీ బస్‌కింద పడి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్‌ పరిధి యూసుఫ్ గూడా బస్టాండ్‌ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్ గూడాలోని మాస్టర్స్ కాలేజీలో మెహరీన్ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.

శుక్రవారం ఉదయం బస్సు నిండా ప్రయాణికులతో నిండిపోగా బస్సు ముందు భాగంలో ఫుట్‌బోర్డుపై నిలబడింది. ఈ క్రమంలో బస్సు దిగడానికి ప్రయత్నించడంతో మూలమలుపు వద్ద విద్యార్థిని అదుపుతప్పి కిందపడిపోయింది. బస్సు వేగంగా వెళ్తుండటంతో డ్రైవర్ గమనించేలోపే ఘోరం జరిగింది. ఫుట్ బోర్డు పైనుంచి జారిపడగా బస్సు చక్రాల కిందపడి మెహరీన్‌ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది.

సీసీటీవీ ఫుటేజ్

మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం.

యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి pic.twitter.com/wkiW7kmEla

— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024

ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మరో ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రుద్రంగి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్‌. మరో యువకుడు అభికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం
సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం.

బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పార్టీ వారీగా బీఆర్ఎస్ 763, కాంగ్రెస్, 652, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలయ్యాయి.

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు. అనంతరం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 28వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు మిన్నంటాయి.

కాగా, తాజాగా ఎమ్మెల్సీ స్థానం గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపు తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు శ్రమించిన బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై వారు చర్చించారు.