movie - Vishvambhara News

రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా
విశ్వంభర, సినిమా బ్యూరో: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ మారింది. తొలుత మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, సాంకేతిక కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఖరారైన కొద్దిసేపటికే ‘పెద్ది’ టీమ్ ఈ ప్రకటన చేయడం విశేషం. మార్చి 26న పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ థియేటర్లలోకి రానుంది. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే మెగా హీరోల సినిమాలు వస్తుండటంతో సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం నెలకొంది.

క్రీడా నేపథ్యంలో భారీ తారాగణం

గ్రామీణ నేపథ్యంతో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్న షాట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. మార్చి నుంచి మే వరకు మెగా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్‌’ డబ్బింగ్‌ షురూ
విశ్వంభర, సినిమా బ్యూరో: పవర్ స్టార్ పవన్ ‌కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రానికి సంబంధించి మేజర్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో వేగం పెంచింది. తాజాగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను ప్రారంభించింది. దర్శకుడు హరీశ్‌ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్న ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ట్యూన్స్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.

మార్చి 26న విడుదల?
ఈ సినిమా విడుదల తేదీపై ఫిల్మ్ నగర్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.  తొలుత మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా వాయిదా పడే సూచనలు ఉండటంతో, అదే స్లాట్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ధురంధర్‌ 2’, ‘టాక్సిక్‌’, ‘ప్యారడైజ్‌’ వంటి భారీ చిత్రాల మధ్య ఈ సినిమా వస్తుందా లేదా అన్న సందిగ్ధతకు ‘పెద్ది’ వాయిదాతో తెరపడింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

హరీశ్ శంకర్ క్రేజీ పోస్ట్
చిత్ర దర్శకుడు హరీశ్‌ శంకర్ తన తాజా ఎక్స్‌ పోస్ట్‌తో అభిమానుల్లో జోష్ నింపారు. "సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి కారు గిఫ్ట్ ఇచ్చారు. ఆ కారు వేసుకొని వస్తే.. అందులో ఉస్తాద్‌లోని 'కొత్త సాంగ్' ప్లే చేసుకుంటూ డ్రైవ్‌కు వెళ్దాం, అదే నా గిఫ్ట్" అంటూ సరదాగా ట్వీట్ చేశారు. దీన్నిబట్టి రెండో పాట విడుదలకు సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది.

‘జన నాయగన్‌’కు మళ్లీ చుక్కెదురు!
విశ్వంభర, సినిమా బ్యూరో: దళపతి విజయ్‌ కథానాయకుడిగా, దర్శకుడు హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘జన నాయగన్‌’ చిత్రానికి సెన్సార్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈ సినిమాకు ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తాజాగా రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని కేసును తిరిగి సింగిల్‌ బెంచ్‌కే రిఫర్‌ చేసింది.

మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలోని అంశాలపై సెన్సార్‌ బోర్డుకు (CBFC) తన వాదనలు వినిపించేందుకు పూర్తిస్థాయిలో న్యాయపరమైన అవకాశం కల్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ చిత్రాన్ని రివైజింగ్‌ కమిటీకి పంపాలన్న నిర్ణయం సరైనదా? కాదా? అనే అంశాన్ని సింగిల్‌ జడ్జి స్వతంత్రంగా, స్వేచ్ఛగా పరిశీలించాలని సూచించింది. ఈ కేసులోని అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని, మరోసారి సమగ్ర విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసే అధికారం సింగిల్‌ బెంచ్‌కు ఉందని స్పష్టం చేసింది.

వివాదం నేపథ్యమిదే
‘జన నాయగన్‌’ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. జనవరి 9న ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేయాలని సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. ఈ తీర్పుపై సెన్సార్ బోర్డు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లి స్టే తెచ్చుకుంది. నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. జనవరి 21న వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌, సోమవారం తీర్పును వెలువరిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను రద్దు చేసింది.

అభిమానుల్లో ఆందోళన
విజయ్ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ‘జన నాయగన్‌’ విడుదలపై ఈ న్యాయపోరాటం నీలి నీడలు కమ్ముకున్నాయి. కోర్టు విచారణలు, సెన్సార్ సర్టిఫికెట్ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో సినిమా విడుదల మరింత వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

మాస్ మహారాజా 'ఇరుముడి'
విశ్వంభర, సినిమా బ్యూరో: ఇటీవలే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో అదిరిపోయే హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ, అదే జోష్‌తో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించారు.  జనవరి 26న రవితేజ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ పూర్తి అయ్యప్ప మాలధారణలో, నుదుటన విభూదితో ఎంతో నిష్ఠగా కనిపిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో ఇది 77వ చిత్రం. ఎప్పుడూ ఎనర్జిటిక్ రోల్స్ చేసే రవితేజ, ఈసారి భక్తి ప్రాధాన్యత కలిగిన ఒక బలమైన ఎమోషనల్ కథతో రాబోతున్నట్లు ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతోంది.

"కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ 'ఇరుముడి'. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ కొత్త ప్రయాణం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని రవితేజ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా..  ఇందులో కథానాయికగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఇరుముడి’ అనే టైటిల్, రవితేజ లుక్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు సీరియస్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల ఇష్టారాజ్యపు పెంపుపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ టికెట్ రేట్లు పెంచడంపై ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "మీకెన్నిసార్లు చెప్పాలి?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ సీవీ ఆనంద్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. గతంలో 'పుష్ప-2' సమయంలోనే టికెట్ ధరలు పెంచవద్దని కోర్టు ఆదేశించినా, సంక్రాంతికి విడుదలైన 'రాజాసాబ్' సినిమాకు భారీగా రేట్లు పెంచడంపై న్యాయస్థానం మండిపడింది.

అనిల్ రావిపూడి - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన 'మనశంకర వరప్రసాద్' సినిమాకు కూడా టికెట్ ధరలు పెంచారని, ఈ విషయాన్ని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఇకపై ఏ సినిమా టికెట్ రేట్ల పెంపు పైనైనా కనీసం 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలి. సినిమా విడుదల సమయంలో హడావిడిగా రేట్లు పెంచే సంస్కృతికి చెక్ పెట్టాల్సిందే అని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

అసలేం జరిగింది?
గత కొంతకాలంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో నిర్మాతలు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు పొంది టికెట్ ధరలను భారీగా పెంచుతున్నారు. దీనివల్ల సామాన్య ప్రేక్షకులపై భారం పడుతోందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ పద్ధతిని తప్పుపట్టింది. పెంపు నిర్ణయం తీసుకునే ముందు ముందస్తు సమాచారం, పారదర్శకత ఉండాలని పేర్కొంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో హోం సెక్రటరీ ఇచ్చే వివరణ ఆధారంగా కోర్టు తదుపరి చర్యలు తీసుకోనుంది.

ప్రభాస్ ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
విశ్వంభర, సినిమా బ్యూరో:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. సంక్రాంతి పండుగ కానుకగా చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రభాస్ అకాడమీ టాపర్ అయిన ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ‘సౌండ్ స్టోరీ’ ఆడియో టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక పోలీసు అధికారి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లడం, అక్కడ జైలర్ ప్రకాష్ రాజ్‌తో జరిగే సంభాషణలు సినిమాలోని డ్రామాను హైలైట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు చూడని ఒక ‘సరికొత్త’ కోపంలో ప్రభాస్‌ను సందీప్ వంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో పోలీసు కథతో పాటు అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యం కూడా ఉండబోతోంది. ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధంలో వచ్చే సీన్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని, ఆ మలుపులే సినిమాకు ప్రాణమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం లుక్ తర్వాత, ఇప్పుడు విడుదల తేదీ కూడా రావడంతో సోషల్ మీడియాలో 'స్పిరిట్' ట్రెండింగ్ మొదలైంది. ప్రభాస్ మార్క్ మాస్ యాక్షన్, సందీప్ వంగా స్టైల్ ఇంటెన్సిటీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

వేసవిలో నవ్వుల విందు.. హవీష్ ‘నేను రెడీ’ టీజర్ విడుదల
విశ్వంభర సినిమా, బ్యూరో: యంగ్ హీరో హవీష్, మాస్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రదర్శిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా కూడా దీనికి విశేష స్పందన లభిస్తోంది.

టీజర్ విషయానికి వస్తే..
ఇదొక సరదా సంసారాల మధ్య జరిగే ‘కల్చర్ క్లాష్’గా కనిపిస్తోంది. ఒక బాధ్యతాయుతమైన మధ్యతరగతి ఆంధ్ర అబ్బాయి (హవీష్), ఒక పక్కా తెలంగాణ అమ్మాయి (కావ్య థాపర్) నిశ్చితార్థం చేసుకుంటారు. పెళ్లి కొడుకు వైపు వారు పక్కా వెజిటేరియన్స్ కాగా, పెళ్లి కూతురు వైపు వారు మాంసాహారం (నాన్-వెజ్) అంటే ప్రాణం ఇచ్చే రకం. ఈ రెండు భిన్నమైన కుటుంబాల మధ్య చోటుచేసుకునే సరదా సంఘటనలు, గొడవలను త్రినాధరావు తనదైన శైలిలో నవ్వులు పూయించేలా రూపొందించారు. చాలా కాలం తర్వాత హవీష్ తన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మధ్యతరగతి యువకుడిగా, బాధ్యత గల కొడుకుగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నిజాం అమ్మాయిగా కావ్య థాపర్ గ్లామర్, నటనతో మెరిసింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, విటివి గణేష్ వంటి దిగ్గజ కామెడీ నటులు ఉండటంతో వినోదానికి లోటు ఉండదని అర్థమవుతోంది. మురళీ శర్మ, గోపరాజు రమణ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ అందించిన నేపథ్య సంగీతం ఉత్సాహంగా ఉండగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా రిచ్‌నెస్‌ను చాటిచెబుతున్నాయి. మొత్తానికి, 2026 వేసవి విడుదలకు సిద్ధమవుతున్న ‘నేను రెడీ’ బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం కురిపించేలా కనిపిస్తోంది.

'ఓ..! సుకుమారి' నుంచి ఐశ్వర్య రాజేష్ లుక్ విడుదల
విశ్వంభర సినిమా: ప్రముఖ నటి ఐశ్వర్యా రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'ఓ..! సుకుమారి' నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న 'దామిని' పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ సినిమాలో ఒక పక్కా పల్లెటూరి పిల్లగా కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఐశ్వర్య హాఫ్ శారీ కట్టుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని తరుముతున్న గ్రామస్తుల నుంచి తప్పించుకుని పరిగెడుతూ కనిపిస్తోంది. ఆమె ముఖంలోని పట్టుదల, అదే సమయంలో కనిపిస్తున్న చిలిపిదనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక మొండి పట్టుదల కలిగిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఐశ్వర్య తన నటనతో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

'ప్రీ వెడ్డింగ్ షో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న సినిమా ఇది. 'శివం భజే' వంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ ఈ చిత్రాన్ని ఒక ఫుల్ లెంగ్త్ విలేజ్ ఎంటర్‌టైనర్‌గా, హాస్యం, భావోద్వేగాల కలయికతో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు అద్భుతమైన స్వరాలను అందిస్తున్నారు. 'రజాకార్', 'పొలిమేర' ఫేమ్ సి.హెచ్. కుషేందర్ విజువల్స్ అందిస్తున్నారు.'క' సినిమా ఎడిటర్ శ్రీ వరప్రసాద్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. 'బలగం' ఫేమ్ తిరుమల ఎం.తిరుపతి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

'కల్కి' సినిమా టికెట్ ధరల పెంపు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్
ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది.

ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 'కల్కి 2898 ఏడీ' చిత్ర టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.