singareni - Vishvambhara News

నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైలు.. సింగరేణికి భట్టి విక్రమార్క అభినందనలు
Bhatti Vikramarka Singareni News: సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్‌టీపీపీ) కోసం కేటాయించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి రైల్వే రేక్ ద్వారా బొగ్గు తెలంగాణకు చేరుకోవడం సింగరేణి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం అని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సోదరులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయంతో సింగరేణి స్వయం సమృద్ధి దిశగా మరో కీలక అడుగు వేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. నాణ్యమైన బొగ్గు సరఫరా ద్వారా విద్యుత్ ఉత్పత్తి మరింత సమర్థవంతంగా సాగుతుందని, దీనివల్ల రాష్ట్ర ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. నైనీ కోల్ బ్లాక్ నుంచి బొగ్గు రవాణా ప్రారంభం కావడం సింగరేణి సంస్థ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణిని అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సింగరేణి మరింత అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని హామీ ఇచ్చారు.

ప్రపంచంలోని ప్రముఖ మైనింగ్ సంస్థలతో పోటీపడే స్థాయికి సింగరేణిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. ఉత్పాదకత, సాంకేతికత, పారదర్శకత, కార్మిక సంక్షేమం వంటి అన్ని రంగాల్లో సింగరేణిని ఆదర్శ సంస్థగా నిలపాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంస్థ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాల కుట్ర: కొత్తకాపు లక్ష్మారెడ్డి
Peddapalli News: సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నాయని బీఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయకుండా ఆర్థికంగా బలహీనపరుస్తూ నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని విశ్వహిందూ పరిషత్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కేవలం ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సంస్థ అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణిని ప్రజల సంస్థగా కాకుండా జేబు సంస్థగా ఉపయోగించుకున్నాయని లక్ష్మారెడ్డి ఆరోపించారు. సంస్థ ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లిస్తూ, సింగరేణి అభివృద్ధి, ఆధునికీకరణ, కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రభుత్వాల తీరుతో సంస్థపై ఆర్థిక భారం పెరిగి, భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సింగరేణి అధికారులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. సింగరేణి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను రాజకీయ కోణంలో కాకుండా సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని సూచించారు.

సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సింగరేణిని కోల్ ఇండియాలో విలీనం చేయడమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైన పరిష్కారమని లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. దీనివల్ల సంస్థకు ఆర్థిక భరోసాతో పాటు బొగ్గు గనుల అభివృద్ధికి మరింత అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే నష్టాల బాట పట్టిన సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల బ్లాక్-2 బొగ్గు గనిని కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమని పేర్కొన్నారు.

సింగరేణి అభివృద్ధిలో దశాబ్దాల పాటు శ్రమించిన రిటైర్డ్ కార్మికులకు కనీసం నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 23 నుంచి 31 వరకు సభలు, సమ్మేళనాలు నిర్వహించి కార్మికులను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. సింగరేణి పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సింగరేణిలో సోలార్‌ సెగ: హరీశ్ రావు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ వేదికగా భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ (MSME)లు పాల్గొనకుండా మూడు ప్లాంట్లను కలిపి ఒకే టెండర్‌గా పిలిచారని, నచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఈ నిర్ణయమని విమర్శించారు.

దేశవ్యాప్తంగా మెగావాట్ సోలార్ ఉత్పత్తికి రూ. 3 కోట్లు ఖర్చవుతుంటే, రాష్ట్రంలో మాత్రం రూ. 5.04 కోట్లుకట్టబెట్టారని.. తద్వారా సింగరేణికి రూ. 214 కోట్ల అదనపు భారం పడిందని హరీశ్ రావు ఆరోపించారు. అధిక ధర చెల్లించడమే కాకుండా, సింగరేణికి చెందిన విలువైన భూములను కూడా అప్పనంగా ఇచ్చేశారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులపై హరీశ్‌ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెండర్లు వేసిన వారితో సీఎం బావమరిది హోటళ్లలో సమావేశమవుతున్నారని, అందుకే బిడ్ల ప్రక్రియ ఐదారుసార్లు వాయిదా పడుతోందని ఆరోపించారు. సింగరేణిలో కేవలం సోలార్ మాత్రమే కాకుండా, పేలుడు పదార్థాల సరఫరాలోనూ అవినీతి జరిగిందన్నారు. కుంభకోణం ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రెండేళ్లు దాటినా ఇంకా లీక్ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని హరీశ్‌ రావు తెలిపారు.

'సింగరేణి'ని బీఆర్‌ఎస్ ముంచేసింది: కిషన్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కాలరీస్ సంస్థను నాశనం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి దుస్థితికి గత పాలకుల అవినీతి, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి బోర్డు కేవలం నామమాత్రంగానే ఉండేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. వారి హయాంలోనే ఆ సంస్థ అప్పులు భారీగా పెరిగాయని ఎద్దేవా చేశారు. టెండర్ల కేటాయింపు నుంచి కాంట్రాక్టుల వరకు అన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులే పర్యవేక్షించేవారని తెలిపారు. బోర్డు సమావేశ వివరాలు కూడా కనీసం తన దృష్టికి రాకుండా గోప్యత పాటించేవారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆనాటి సీఎండీని మరో నాలుగేళ్లు అదనంగా కొనసాగించి, సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

పేరుకుపోయిన అప్పులు.. అస్తవ్యస్తంగా నిధులు
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కిషన్‌రెడ్డి పలు కీలక గణాంకాలను బయటపెట్టారు. గత పదేళ్లలో సింగరేణి అప్పులు రూ.32,000 కోట్లకు పైగా పెరిగాయన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలు సింగరేణి విద్యుత్‌ను వాడుకుని డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కార్మికులకు, సంస్థకు సుమారు రూ.47,000 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. నిధుల కొరత సాకుతో జిల్లాలకు అందాల్సిన రూ.1,500 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) కూడా నిలిపివేశారని పేర్కొన్నారు. సంస్థ సామాజిక బాధ్యత (CSR) నిధులను కూడా బీఆర్ఎస్ నేతలు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ప్రైవేటు శక్తులకు పెద్దపీట
కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తోందంటూ గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. "సింగరేణిపై కేంద్రం అజమాయిషీ ఎప్పుడూ లేదు. కానీ, బీఆర్ఎస్ హయాంలోనే ప్రైవేటు కంపెనీలకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టారు. అప్పుడు లేని ప్రైవేటీకరణ భయం ఇప్పుడెందుకు?" అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ సీఎండీతో కాలం గడుపుతుండటం సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "తెలంగాణ జీవనాడి అయిన సింగరేణిని గత ప్రభుత్వం ఒక రాజకీయ ఏటీఎంలా వాడుకుంది. నిధుల మళ్లింపు, కుటుంబ సభ్యుల జోక్యంతో సంస్థను సంక్షోభంలోకి నెట్టారు." కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్.. సింగరేణిపై ట్వీట్ వార్
ఇప్పుడు తెలంగాణలో ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ నడుస్తోంది. ఇరువురు గారు అంటూ ట్వీట్ వార్ కు తెరలేపారు. కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

అప్పుడు రేవంత్ రెడ్డి ట్వీట్ ను ఇప్పుడు కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన మీరు.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత వేలం పాటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపించడం ఏంటని మండిపడ్డారు. అసలు మీలో ఈ మార్పుకు గల కారణాలు ఏంటో తెలియాలంటూ ప్రశ్నించారు.

అయితే ఇదే కేటీఆర్ ట్వీట్ ను సీఎం రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేస్తూ పోస్టు చేశారు. అందులో కేటీఆర్ గారూ.. అని సంబోధిస్తూ పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణ, సింగరేణి బొగ్గు గనుల వేలం పాట వేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చూస్తే.. అడుగడుగునా అడ్డు పడింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ తెలిపారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ ప్రభుత్వంలోనే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని, రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందన్నారు. అప్పుడు అరబింద, అవంతిక కంపెనీలకు అప్పగించినప్పుడు భట్టి విక్రమార్కనే వ్యతిరేకించారని.. ఆయన రాసిన లేఖను పోస్టు చేశారు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ ఆస్తులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని తెలిపారు రేవంత్.