Meeting - Vishvambhara News

విజయ్ ప్రచార సభలో విషాదం.. గుండెపోటుతో మహారాష్ట్ర వ్యక్తి మృతి
విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో విషాదం చోటుచేసుకుంది. సేలంలో నిర్వహించిన ర్యాలీలో మహారాష్ట్రకు చెందిన 37 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తి హఠాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందాడు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జనసమూహంలో నుండి ఒక్కసారిగా కిందపడిపోవడంతో స్థానికులు, పోలీసులు అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతికి కారణం గుండెపోటు అని వైద్యులు పేర్కొన్నారు. ఉపాధి కోసం కుటుంబంతో సహా సేలానికి వలస వచ్చిన సూరజ్, కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనుమతికి మించి తరలిన జనం
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కానీ, నిర్వాహకులు అనుమతి పొందిన సంఖ్య కంటే ఎక్కువ మందిని సభకు అనుమతించడంతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 5వేల మందికి మాత్రమే అనుమతి ఉంది. అయితే దాదాపు 7 వేల మంది జనం రావడంతో తోపులాట వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పూర్తి విచారణ జరిపి నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

రేపు జూబ్లీహిల్స్‌లో పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలనా పగ్గాలను వేగంగా అందుకున్నారు. విదేశాల్లో పెట్టుబడుల వేట ముగియగానే, ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు, అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ కొత్త సారథి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు. వీరితో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకున్న ఇంచార్జ్ మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.

ఈ సమావేశం కేవలం సాధారణ భేటీ కాదని, రాష్ట్రంలో రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక దిశానిర్దేశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రులకు వారి పరిధిలోని అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన గడువులను విధించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి? జిల్లాల వారీగా అమలులో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? అనే అంశాలపై సీఎం నివేదికలు కోరనున్నారు. రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల బలోపేతం దిశగా పార్టీ క్యాడర్‌ను ఎలా సమాయత్తం చేయాలనే దానిపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి సీఎం చర్చించనున్నారు.

తన పర్యటనలో భాగంగా విదేశీ పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల గురించి కూడా సీఎం ఈ భేటీలో ప్రస్తావించనున్నారు. పాలనలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి, దానికి అనుగుణంగా మంత్రులను, పార్టీని ఎలా ముందుకు నడిపించాలనే దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

కేరళ కాంగ్రెస్‌లో ‘థరూర్’ కలకలం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటకొచ్చాయి. ఎన్నికల వ్యూహరచన కోసం ఢిల్లీలో నిర్వహించిన అత్యంత కీలకమైన సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటిస్తున్న సమయంలోనే, థరూర్ ఢిల్లీ భేటీకి వెళ్లకుండా కేరళలోనే ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాహుల్‌తో పెరిగిన దూరం?
ఇటీవల కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రవర్తనపై థరూర్ అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ తనతో సరిగా వ్యవహరించలేదని, ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని భావిస్తున్న థరూర్.. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన తన పట్ల రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర కలత చెందారని సమాచారం.

గతంలో పలుమార్లు ప్రధాని మోదీ పనితీరును థరూర్ ప్రశంసించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి మింగుడుపడటం లేదు. కేరళ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు పిలిచిన భేటీని ఆయన దాటవేయడంపై చర్చ సాగుతోంది. అయితే, ఈ విమర్శలపై శశిథరూర్ కార్యాలయం స్పందించింది. రాజకీయ కారణాల వల్ల భేటీకి దూరం కాలేదని స్పష్టం చేసింది. కొలికోడ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ లిటరేచర్ ఫెస్ట్ లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉన్నందున ఆయన కేరళలోనే ఉన్నారని వివరణ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేతల మధ్య సమన్వయం లోపిస్తే అది పార్టీ విజయవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

సీఎం రేవంత్ తో మూడు పార్టీల నేతల భేటీ
విశ్వంభర, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్. వీరయ్య, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వే నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై వారు చర్చించారు.