Politics - Vishvambhara News

ఖమ్మంలో 'క్యాంపు' రాజకీయం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గెలిచిన అభ్యర్థులు తమ పార్టీని వీడిపోకుండా ఉండేందుకు, ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు 'క్యాంపు రాజకీయాలకు' తెరలేపాయి. ముఖ్యంగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో అధికార పీఠం దక్కించుకునేందుకు ఈ తరహా వ్యూహాలు పన్నుతున్నారు.

సత్తుపల్లిలో కాంగ్రెస్ వ్యూహం
సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగే వరకు అభ్యర్థులను సురక్షితంగా ఉంచాలని నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా, గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను ప్రత్యేక వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా విశాఖపట్నం వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.

కల్లూరుపై ప్రత్యేక ఫోకస్
కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టకుండా ఉండేందుకు, వారిని రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయానికి వీరిని నేరుగా కల్లూరుకు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

చైర్మన్ అభ్యర్థి కోసం ఉత్కంఠ
సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనే దానిపై పార్టీల లోపల తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను బట్టి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అప్పటివరకు కౌన్సిలర్లందరినీ ఐకమత్యంగా ఉంచడం కోసం ఈ క్యాంపు రాజకీయాలు అనివార్యమయ్యాయని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.

వికసిత్ భారత్.. వికసిత్ కేరళతోనే సాధ్యం: అమిత్ షా
విశ్వంభర నేషనల్ బ్యూరో: 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) సాధించాలంటే అది 'వికసిత్ కేరళ'తోనే సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన స్థానిక సంస్థల బీజేపీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర సదస్సులో అమిత్ షా పాల్గొని.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం "మిషన్ 2026"ను అధికారికంగా ప్రారంభించారు. త్వరలో బీజేపీకి చెందిన నేత కేరళ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి తిరువనంతపురం కీలక మైలురాయని అభివర్ణించారు. కేరళలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు.

శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల వివాదంపై అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో ఇద్దరు మంత్రులు ప్రజల దృష్టిలో దోషులుగా ఉన్నారని, వారి ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని అన్నారు. "శబరిమల ఆస్తులను కాపాడలేని వారు, మన నమ్మకాలను కాపాడలేరు" అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దేశమంతా ఆందోళనతో ఉందని చెప్పారు. కేరళ ఆర్థిక వ్యవస్థ కేవలం విదేశీ నిధులపైనే ఆధారపడకూడదని, ఇక్కడ సమగ్ర అభివృద్ధి జరగాలని అమిత్ షా సూచించారు. ప్రధాని మోదీ దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించారని, అటువంటి సమతుల్య అభివృద్ధి నమూనా కేరళకు అవసరమని పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దపీట వేయండి
విశ్వంభర బ్యూరో: దేశ రాజధానిలో జరిగిన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర గళాన్ని బలంగా వినిపించారు. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ, తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత 200 బిలియన్ డాలర్ల నుండి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని భట్టి వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5.1 శాతం నుండి 10 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు కేంద్ర సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

భారీ ప్రాజెక్టులకు నిధులు
తెలంగాణ జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం భట్టి విక్రమార్క కీలక ప్రాజెక్టుల జాబితాను కేంద్రం ముందు ఉంచారు. ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేసి నిధులు కేటాయించాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం రూ.14,100 కోట్లు, మురుగునీటి పారుదల పనులకు రూ.17,212 కోట్లు మంజూరు చేయాలని తెలిపారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్‌లో IIM ఏర్పాటుతో పాటు, అన్ని జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలను నెలకొల్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు విజ్ఞప్తి చేశారు.

ద్రవ్యలోటు పరిమితిని పెంచాలి
రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితిని కనీసం 4 శాతానికి పెంచాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సెస్‌లు, సర్‌ఛార్జీలను పన్నుల్లో కలిపి రాష్ట్రాలకు 41% వాటా దక్కేలా చూడాలని కోరారు. విద్య & ఆరోగ్యం ఈ రంగాల ఖర్చును FRBM పరిమితుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చి, సాయాన్ని రెట్టింపు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేంద్రం తన మొత్తం వ్యయంలో 20 శాతానికి పైగా రాష్ట్ర జాబితా అంశాలపై ఖర్చు చేస్తోందని, అందులో కొంత తగ్గించి సుమారు రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని భట్టి సూచించారు. బడ్జెట్ తయారీలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవడం 'వికసిత్ భారత్' లక్ష్య సాధనకు నాంది అని ఆయన కొనియాడారు.

మంత్రుల వ్యక్తిగత జీవితాల దుష్ప్రచారంపై టీపీసీసీ చీఫ్ అసహనం
విశ్వంభర, బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రైవేట్ జీవితాల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి నిరాధారమైన వార్తలను ప్రచురించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ విమర్శలు విధానాల పరంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రేటింగ్‌ల కోసం, వ్యూస్ కోసం మంత్రుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలను అల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది.. కానీ అది ఇతరుల ప్రైవేట్ జీవితాల్లోకి తొంగిచూసేలా ఉండకూడదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉండాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనవసరమైన గాసిప్స్‌కు ప్రాధాన్యత ఇవ్వొద్దని ఆయన సూచించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం వైపు మీడియా అడుగులు వేయాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.

ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న
నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులోమల్లన్నకు 14 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఇంకా లెక్కించాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లే 1.44 లక్షలు ఉన్నాయి. అందులో చెల్లనిఓట్లు వేరుచేయాల్సి ఉంది.

ఇప్పటి వరకు మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 9,019 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 34,575, బీఆర్ఎస్ అభ్యర్థికి 27,573, బీజేపీ అభ్యర్థికి 12,841, స్వతంత్ర అభ్యర్థికి 11,018ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇప్పటి వరకు 70,785 ఓట్లు పోల్ అయ్యాయి.

బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొత్తంగా 56,113 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 20,037 ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు 14,672 మెజారిటీని సాధించారు. మొత్తం పోల్ అయిన ఓట్లు 3,36,013 కాగా ఒక్కో రౌండ్‌కు 96వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత కోసం నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు.

ఇప్పటి వరకు రెండు రౌండ్లు కలిపి లక్షా 92వేల ఓట్లు లెక్కింపును పూర్తి చేశారు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా లక్షా 44వేల ఓట్లు మిగిలి ఉన్నాయి. ఇవాళ(గురువారం) సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రెండో ప్రాధాన్యత కోసం 52మంది అభ్యర్థుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.

ఒబామా ఇంట్లో తీవ్ర విషాదం.. మిచెల్‌ తల్లి కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఫస్ట్‌లేడీ, ఒబామా సతీమణి మిచెల్‌ ఒబామా తల్లి మరియన్‌ రాబిన్సన్‌ శుక్రవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86. ఈ విషయాన్ని బరాక్‌, మరియన్‌ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుమార్తె, అల్లుడితో కలిసి మరియన్‌ శ్వేత సౌధంలోనే ఉన్నారు.

ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషా సంరక్షణను ఆమె చూసుకున్నారు. మరియన్‌ను కుటుంబ సభ్యులు ముద్దుగా ‘మొదటి బామ్మ’ అని పిలుచుకుంటారు. మరియన్‌ మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మరియన్‌ మృతికి సంతాపం తెలుపుతున్నారు. షికాగోలో 1937లో జన్మించిన రాబిన్సన్ ఆ ఇంట్లో ఏడుగురు పిల్లలలో ఒకరు.

ఆమె యుక్తవయసులో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. న‌ల్ల జాతీయులు కావ‌డంతో యునైటెడ్ స్టేట్స్‌లో జాతి వివక్ష ఎదుర్కొన్నారు. ఆమె తండ్రి చర్మం రంగు కారణంగా యూనియన్‌లో చేరడానికి, పెద్ద నిర్మాణ సంస్థలలో పని చేయడానికి అనుమతించబడలేదు. అయినప్పటికీ  బరాక్ ఒబామా మొదటి నల్లజాతి అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఆమె త‌న‌ కుమార్తె, అల్లుడితో క‌లిసి శ్వేత‌సౌధం చేరుకున్నారు. రాబిన్సన్ 1960లో వివాహం చేసుకున్నారు. ఆమెకు మిచెల్ ఒబామా సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా, కార్యదర్శిగా కూడా పనిచేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై వారు చర్చించారు.

మై డియర్ ఫ్రెండ్: సీఎం రేవంత్ రెడ్డిపై రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కలిశాడు. దర్శకుల బృందం వెళ్లి ఈనెల 19న జరిగే డైరెక్టర్స్‌ డే కార్యక్రమానికి రావాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్విట్టర్(X) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు.

మై డియర్ ఫ్రెండ్, ఫైర్ క్రాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానంటూ సీఎంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. అయితే వర్మ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, కేవలం ఆర్జీవీ కాకుండా అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆర్జీవీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటాడు. దీంతో తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తాడన్న విషయం తెలిసిందే.