MLAs - Vishvambhara News

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై స్పందించాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ధిక్కరించారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌తో ఏలేటి పిటిషన్‌ను సుప్రీంకోర్టు జత చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇటీవల ఇచ్చిన 'క్లీన్ చిట్' నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమని విపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, కానీ స్పీకర్ ఆ ఆదేశాలను ఏ మాత్రం పాటించడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానాన్ని గౌరవించకుండా నిర్ణయాన్ని కావాలనే సాగదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారాన్ని ఏలేటి ప్రత్యేకంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని, ఎంపీగా కూడా పోటీ చేశానని దానం స్వయంగా ప్రకటించిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. పార్టీ మారినట్లు ఆయనే ఒప్పుకున్నాక అనర్హత వేటు వేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు.

ఇప్పటికే ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఈ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? లేక మమ్మల్నే తీసుకోమంటారా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రెండు వారాల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పెండింగ్‌లో ఉంది. దీనికి నంబర్ కేటాయించిన తర్వాత విచారణ తేదీ ఖరారు కానుంది. ఒకవేళ సుప్రీంకోర్టు దీనిని ధిక్కరణ కేసుగా పరిగణిస్తే, స్పీకర్ కార్యాలయానికి ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు.

ఇదిలా ఉంటే రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై వారు చర్చించారు.