professor jayashankar - Vishvambhara News

తెలంగాణకు శనిలా మారాడు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్..
KTR: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. తెలంగాణకు రేవంత్ రెడ్డి శనిలా తయారయ్యాడు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ శాశ్వత శత్రువని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారని, అలాంటి కాంగ్రెస్‌ను ప్రజలు అధికారంలోకి తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు.

ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1.60 లక్షల మందికి నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో యువతను రెచ్చగొట్టి ఇప్పుడు వారిని నిరాశపరిచారని విమర్శించారు.

ఇటీవల తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ తప్పుబట్టారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్. విద్యాసాగర్ రావు వంటి మహనీయులను విస్మరించడం తెలంగాణ ఆత్మను అవమానించడమేనని అన్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని గుర్తించే సంస్కారం లేకపోతే ముఖ్యమంత్రి పదవికి అర్థమేంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ పనితీరుపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పాలమూరు, కన్నెపల్లి పంపులను ప్రారంభించడం లేదని, రాష్ట్ర అప్పులపై కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. అలాగే 32 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని, తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా కేంద్రం ఎదుట తలవంచే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ స్వాభిమానం, స్వయం పాలన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చూపిన మార్గమే తమకు ఆదర్శమని, అదే బీఆర్ఎస్ సిద్ధాంతమని కేటీఆర్ స్పష్టం చేశారు.

జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు.. సామాజిక న్యాయ తెలంగాణకు కవిత పిలుపు
Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత, తెలంగాణ సాధన కోసం జయశంకర్ చేసిన త్యాగాలు, కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణపై జరిగిన అన్యాయాలను నిరంతరం ప్రశ్నిస్తూ, స్వాభిమాన తెలంగాణ కోసం ఆయన చేసిన ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ సాధనతోనే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయని, సామాజిక న్యాయం ఆధారంగా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నది ప్రొఫెసర్ జయశంకర్ ఆకాంక్ష అని కవిత గుర్తు చేశారు. ఆ ఆశయాల సాధనే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని, సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అనంతరం నిర్వహించనున్న **'సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ'**కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఈ సభలో కల్వకుంట్ల కవిత సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రసంగం చేయనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రక్షణ సేన నాయకత్వం స్పష్టం చేసింది. జయశంకర్ ఆశయాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే దిశగా పార్టీ కార్యాచరణ కొనసాగుతుందని నాయకులు తెలిపారు.

జోహార్ జయశంకర్ సార్ .. తెలంగాణ దిక్సూచి - తెలంగాణ భవితకు మార్గదర్శి - ప్రో కొత్తపల్లి జయశంకర్ సార్
చైతన్యపురి:విశ్వంభర:  తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 14 వ  వర్ధంతిని  పురస్కరించుకొని  హైద్రాబాద్ లో చైతన్యపురి  వి3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ,రాష్ట్ర అధ్యక్షులు    తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ..
ఈ సందర్బంగా డా . కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం పరితపించి తెలంగాణకీ జరుగుతున్న అన్యాయాన్ని వెలుగేత్తి చాటి మలి దశ ఉద్యమానికి సిద్ధాంత కర్త గా నిలిచి , తెలంగాణ రాష్ట్రానికి  దిక్సూచిల నిరంతరం తెలంగాణ స్వరాష్ట్ర సాధన  కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన మహోన్నతుడు అని, వారు చేసిన సేవలను , త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ జోహార్ జయశంకర్ సార్ అంటూ నివాళులు అర్పించడం జరిగింది.  నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా   తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని జీవితాలను , భవిష్యత్తు ని త్యాగం చేసిన ఉద్యమకారులను ,కుటుంబాలను ఆదుకొని ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులు శ్యామ్ సుందర్ గౌడ్ , బీరెల్లి వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ నాటి తెలంగాణ ఉద్యమం కోసం ప్రో . జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పోరాటం చేయడం జరిగింది .పార్టీలకతీతంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు .

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు కూర రమేష్ , శ్యామ్ సుందర్ గౌడ్ ,  బీరెల్లి వెంకట్ రెడ్డి , పొన్నపల్లి యుగేందర్ శర్మ ,సంతోష్ , డా.యర్రమాద  కృష్ణారెడ్డి ,చెన్నోజు విద్యా సాగర్ , దండు సురేష్ , మేడికొండ పరమేష్ , ఏలే మహేష్ నేత , నరేష్, కొవ్వరు మహేష్ , అఖిల్ తదితరులు పాల్గొన్నారు