Pawan kalyan - Vishvambhara News

పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దొరకడనే జనసేనలో చేరా: నాదెండ్ల మనోహర్
Nadendla Manohar: పవన్ కళ్యాణ్ నాయకత్వంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దొరకడం కష్టమనే భావనతోనే తాను జనసేన పార్టీలో చేరానని తెలిపారు. అలాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్‌కు అండగా నిలవడంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని అన్నారు. నాయకుడికి అండగా లేకపోతే మన కాంట్రిబ్యూషన్ జీరో అవుతుందని, అందుకే తాను జనసేనలోకి వచ్చానని చెప్పారు.

పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై సూచనలు చేయడంలో తప్పు లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే చాలామందికి పూర్తి సమాచారం తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏదైనా సూచన లేదా అభిప్రాయం ఉంటే దానిని సరైన వేదికపై చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన నాయకత్వంపై విశ్వాసంతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడేటప్పుడు సరైన వేదికను ఉపయోగించుకోవాలని సూచించారు.

పదవుల కోసం కాదు.. సమాజం, దేశం కోసం జనసైనికుల ప్రయాణం: నాదెండ్ల
Nadendla Manohar: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై జనసైనికులకు ఉన్న అభిమానాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వివరించారు. తాను రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో బైక్‌లపై వచ్చే యువకులు పలకరించి జనసేనకు సంబంధించిన సంకేతాలు చూపిస్తారని చెప్పారు. ఆ తర్వాత షర్ట్‌ తీసి పవన్‌ కల్యాణ్‌, జనసేన పేరుతో వేయించుకున్న టాటూలను చూపిస్తుంటారని తెలిపారు.

అలాంటి సందర్భాల్లో తాను వాహనం అద్దం దించి ‘బాబు కాస్త జాగ్రత్తగా తోలండి’ అని చెబితే.. వారు ‘మా అన్నయ్యను జాగ్రత్తగా చూసుకో అన్నా’ అని సమాధానం ఇస్తారని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. పవన్‌ కల్యాణ్‌పై జనసైనికులకు ఉన్న అభిమానానికి, ఆప్యాయతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వారి మాటల్లో పవన్‌ పట్ల ఉన్న గౌరవం, ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా భావించే అనుబంధం కనిపిస్తుందని అన్నారు.

జనసైనికులు పదవుల కోసం ఈ ప్రయాణం చేయడం లేదని, నాయకత్వం కోసం మాత్రమే ముందుకు సాగడం లేదని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సమాజం, దేశం కోసం పనిచేయాలనే ఆలోచనతోనే వారు పార్టీతో కలిసి ప్రయాణిస్తున్నారని చెప్పారు. జనసేన బాగుండాలని, పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కార్యకర్తలు ఎంతో తపనతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

రాఖీ పండుగకు పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ కానుక.. 2,300 మంది చెల్లెమ్మలకు చీరలు
Pawan Kalyan: రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేనాని, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ తన నియోజకవర్గంలోని 2,300 మంది చెల్లెమ్మలకు ఆత్మీయ కానుక అందించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలకు చీరలను అందించి “అన్నగా నేను ఉన్నాను” అనే భరోసాను కల్పించారు. పండుగ సందర్భంగా చెల్లెమ్మల పట్ల తనకున్న ఆప్యాయతను చాటుతూ ఈ ప్రత్యేక కానుకను అందించారు.

రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, అనుబంధం, నమ్మకం, రక్షణకు ప్రతీక. సోదరి తన అన్నయ్య లేదా తమ్ముడికి రాఖీ కట్టి, అతడు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటే.. అన్న కూడా తన సోదరికి ఎల్లప్పుడూ అండగా ఉంటాననే భరోసా ఇస్తాడు. ఇదే ఆత్మీయతను ప్రతిబింబించేలా పిఠాపురం నియోజకవర్గంలోని 2,300 మంది చెల్లెమ్మలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చీరలను అందించారు.

ఈ సందర్భంగా అందించిన చీరలు కేవలం పండుగ కానుక మాత్రమే కాకుండా.. ప్రేమ, గౌరవం, ఆప్యాయతతో అందించిన అన్నయ్య కానుకగా నిలిచాయని జనసేన శ్రేణులు పేర్కొన్నాయి. ప్రజాప్రతినిధిగా పిఠాపురం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని మరింత బలపరిచే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా 2,300 మంది మహిళలకు చీరలు అందించడం పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. పండుగ వేళ తమను గుర్తు చేసుకుని ఆత్మీయంగా కానుక అందించడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా.. అన్నగా తమకు అండగా ఉంటాననే భరోసాను పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా చాటారని జనసేన శ్రేణులు తెలిపారు.

రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం చెల్లెమ్మలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అందించిన ఈ కానుక నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిలిచింది. “అది కేవలం చీర కాదు.. ప్రేమ, గౌరవం, ఆత్మీయతతో అందించిన అన్నయ్య కానుక” అంటూ జనసేన శ్రేణులు పేర్కొన్నారు.

క్రోచెట్ కళాకారులకు పవన్ కళ్యాణ్ చేయూత.. ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న చిన్న అల్లికలను గంటల తరబడి చూస్తూ పని చేసే క్రోచెట్ లేస్ కళాకారుల కంటి సమస్యలను గుర్తించి వారికి అండగా నిలిచారు. వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, దృష్టి లోపాలతో బాధపడుతున్న 141 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు అందించే ఏర్పాట్లు చేశారు. కళాకారుల వృత్తి కొనసాగేందుకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

గత నెల విజయవాడలో నిర్వహించిన హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్, హస్తకళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి మహాలక్ష్మి తమ వృత్తి కారణంగా చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఆమె వినతిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఆ ఆదేశాల మేరకు నరసాపురంలో నిర్వహించిన తొలి నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్న కళాకారులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించగా, వారందరికీ నాణ్యమైన కళ్లజోళ్లు సిద్ధం చేసి అందజేస్తున్నారు. దీంతో అల్లిక పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గి, తమ వృత్తిని మరింత సౌకర్యంగా కొనసాగించగలమని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడితో ఆగకుండా పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలి ప్రాంతాల్లో కూడా మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో మరో 350 మంది కళాకారులకు దృష్టి లోపాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి కూడా కళ్లజోళ్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే 20 మందికి పైగా కంటిశుక్లం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.

హస్తకళాకారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆచంట, నరసాపురం ప్రాంతాల్లో మరిన్ని ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా క్రోచెట్ లేస్ కళాకారులకు అవసరమైన వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'తో చేతులు కలిపిన విషయం విదితమే. ఈ రెండు సంస్థలు కలిసి గొప్ప చిత్రాలను ప్రేక్షకులను అందించడానికి సిద్ధమవుతున్నాయి. గతంలోనే ఈ సంస్థల మధ్య కథలకు సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిసి రాబోయే ప్రాజెక్టులపై చర్చించారు. పవన్ కళ్యాణ్, టీజీ విశ్వప్రసాద్ భేటీ గురించి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' స్పందిస్తూ.. "భోగి శుభ సందర్భంగా కొత్త ఆరంభాల స్ఫూర్తిని సూచిస్తూ, రాబోయే ప్రాజెక్టులపై గతంలో జరిగిన చర్చలను కొనసాగిస్తూ, పవన్ కళ్యాణ్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ని కలిసి మరింత విస్తృతంగా చర్చించారు." అని తెలిపింది. 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' ట్వీట్ కి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బదులిస్తూ.. "కథలపై చర్చించడానికి మాకు అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్‌కు  హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది మాకు ఎంతో విలువైనది. ప్రేక్షకులకు బలమైన, అర్థవంతమైన, ప్రభావవంతమైన కంటెంట్‌ను అందించేందుకు 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్'తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాము. ఈ కలయిక మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ అద్భుత ప్రయాణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము." అని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

జులై 1 నుంచి కాకినాడలో పవన్ కల్యాణ్‌ పర్యటన
విశ్వంభర, అమరావతిః ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ జులై నెలలో కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జులై 1వ తేదీన ఆయన కాకినాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత అదే రోజున పిటాపురం జనసేన నేతలతో సమావేశం అవుతారు. తన గెలుపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు.

ఆ తర్వాత రోజున అంటే జులై 2న ఆయన కాకినాడ కలెక్టరేట్ లో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, అటవీ శాఖ అధికారులతో సమావేశం అవుతారు. ఆయా శాఖలలో ఎలాంటి పనులు జరుగుతున్నాయనే వాటిపై ఆయన కూలంకుశంగా చర్చించి ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత జులై 3న పిఠాపురంలో వారిహి కృతజ్ఞతా సభను నిర్వహిస్తారు. ఇందులో తనను గెలిపించినందుకు పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమంలో అటు టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

కొండగట్టులో పవన్ కల్యాన్ ప్రత్యేక పూజలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన పవన్ కల్యాణ్‌ కు ఈవోతో పాటు ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి మరీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

పవన్ కల్యాణ్‌ వచ్చాడని తెలుసుకుని ఆయన అభిమానులు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. కొండగట్టు నిండా పవన్ కల్యాణ్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అభిమానులు. దాంతో కొండగట్టులో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏపీలో పార్టీ గెలుపుతో పవన్ కల్యాణ్‌ కొండగట్టుకు వచ్చారు.

గతంలో తన వారాహి వాహనాన్ని కూడా ఇక్కడే పూజలు చేయించారు. తనకు మొదటి నుంచి కొండగట్టు బాగా కలిసి వచ్చిందని పవన్ కల్యాణ్‌ చెబుతుంటారు. అందుకే తనకు కలిసి వచ్చిన కొండగట్టుకు డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు పవన్ కల్యాన్.

పాలనలో ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్.. సలహాలు ఇవ్వాలంటూ క్యూ ఆర్ కోడ్ రిలీజ్
పవన్ కల్యాణ్‌ ఇన్ని రోజులు సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక తన దైన మార్క్ పాలన అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటికే తన శాఖ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. జనసేన ఆఫీసులోనే జనతా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు కేటాయించిన శాఖలపై సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ ప్రజల కోసం క్యూ ఆర్ కోడ్ ను విడుదల చేశారు. దాన్ని స్కాన్ చేస్తే గూగుల్ లో ఫామ్ ను ఫిల్ చేసేలా ఏర్పాటు చేశారు. అందులో ప్రజలు తమదైన సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు.

జనసేనలో పవన్ కల్యాణ్‌ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు, పౌరసరఫరాశాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్‌, సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రిగా కందుల దుర్గేష్‌ బాధ్యతలు చేపట్టారు. కాబట్టి ఈ శాఖలపై పవన్ కల్యాణ్‌ సూచనలు తీసుకోవడం అంటూ ప్రశంసనీయమే అంటున్నారు పలువురు నెటిజన్లు.

రేపు పవన్ ను కలవనున్న సినీ నిర్మాతలు.. సమస్యలపై చర్చలు
పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం పవన్ వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కాబట్టి.. తమకు అడ్వాంటేజ్ గా ఉంటుందని వారు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా సినిమా నిర్మాతలు సోమవారం రోజున పవన్ కల్యాణ్‌ ను కలవబోతున్నారు. ఇందులో వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వినీ దత్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు (సూర్యదేవర నాగవంశీ), మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సూర్యదేవర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, ఆ సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్లతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, బడా ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు ఉన్నారు.

వీరంతా కూడా పవన్ ను కలిసి మరీ ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్లను చాలా వరకు తగ్గించిన విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మళ్లీ టికెట్ రేట్లను పెంచమని వారు కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ వాటిపై సానుకూలంగా స్పందిస్తాడని వారు భావిస్తున్నారు.

అధికారులను నిలదీసిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పదేండ్లు అధికారం కోసం ఎదురుచూశారు. ఇప్పుడు తన చేతికి అధికారం రాగానే అసలు పాలన అంటే ఎలా ఉంటుందో చూపించాలని అనుకుంటున్నారు కాబోలు. అందుకే ఇప్పుడు తన పవర్ చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా, ఐదు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు.

తాజాగా ఆయన 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎఫ్‌ ఎమ్ ఎస్ ఖాతాకు ఎన్ని స్థానికసంస్థల, ఆర్థిక సంఘం నిధులను మళ్లించారో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు పవన్ కల్యాన్‌.

ఇంకోవైపు సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఇలా పవన్ కల్యాణ్‌ తన శాఖలకు సంబంధించిన అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తు పరుగులుపెట్టిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు.

ఇదిలా ఉంటే రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.

మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ
ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పవన్, జనసేన అభిమానులు దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని తిట్టించే బదులు మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాం.. అందరినీ చంపేయండి..’’ అని అన్నారు.

‘‘మేము అనాథలం ఎవరు అడ్డుకోరు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి.. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను.. నా సవాల్‌కు కట్టుబడి నా పేరు మార్చుకున్నా. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వెంటనే వారిని ఆపాలి. నేను చేతకాని వాడిని. అసమర్థుడిని కాబట్టి పవన్ కళ్యాణ్‌ను ఉద్యమం చేయాలని కోరాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కల్యాణ్ చేతుల్లో ఉన్నందున. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి’’ అంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు.