Palnadu - Vishvambhara News

పల్నాడులో వైసీపీ నేత దారుణ హత్య.. గొంతు కోసి హతమార్చిన దుండగులు
Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి (35)ను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన రెంటచింతల మండలంలో కలకలం రేపింది. స్థానికంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతల–రెంటాల ప్రధాన మార్గంలోని పులోళ్ల బావి సమీపంలో నవులూరి చెన్నారెడ్డి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. చెన్నారెడ్డిని గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. వ్యక్తిగత విభేదాలా, రాజకీయ కక్షలా, లేక మరేదైనా కారణమా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనతో రెంటచింతల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నారెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరిస్తూ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

#Draft: Add 'పల్నాడు'- టైటిల్ పోస్టర్ రిలీజ్ Your Title
రోహిత్ వర్మ వర్మ హీరోగా గోవింద రెడ్డి చందా దర్శకత్వంలో క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది.  రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అందించిన మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని రివిల్ చేశారు. ఈ చిత్రానికి 'పల్నాడు' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఎగిరే నిప్పురవ్వల బ్యాక్ డ్రాప్ లో హీరో మండుతున్న కర్రని పట్టుకొని, పవర్‌ఫుల్‌ ఇంటెన్స్‌ గా కనిపించిన టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీ క్రియేట్ చేసింది.ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్ కుమార్, దేవి ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. రవికుమార్.వి డీవోపీ, ఎడిటర్  చోటా కె ప్రసాద్ వర్క్ చేస్తున్నారు.

బస్సు ఎక్కుతుండగా ప్రమాదం.. నుజ్జునుజ్జయిన మహిళ కాళ్లు
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండు కాళ్లను పోగొట్టుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత అనే మహిళ ఆర్మూర్ వెళ్లేందుకు నిజామాబాద్ బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడ బస్సు ఆపమంటూ వెనుక నుంచి ఆ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఆమెను గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు.

ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చి కదులుతున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ కిందపడిపోయింది. బస్సు అలాగే ముందుకు కదలడంతో అదే బస్సు వెనుక చక్రాల కిందపడి సదరు మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాయాలపాలైన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

AP: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు.. పల్నాడుకు కొత్త కలెక్టర్ నియామకం..!
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు నూతన ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి  సాలిలను నియమించినట్లు ప్రకటించింది.

అదేవిధంగా పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్‌ను కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈసీ దీనిపై కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.