AP - Vishvambhara News

సాగర తీరాన నౌకాదళ పరాక్రమం
విశ్వంభర, ఏపీ బ్యూరో: భారత నౌకాదళ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం విశాఖపట్నం తీరంలో ఆవిష్కృతమైంది. భారత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026)' భారత నావికాదళ పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఐఎన్ఎస్ సుమేధను 'ప్రెసిడెన్షియల్ యాట్'గా మలిచి, అందులో రాష్ట్రపతి ప్రయాణిస్తూ తీరంలో లంగరు వేసిన యుద్ధనౌకలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 45 భారతీయ నౌకలతో పాటు, 19 విదేశీ యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ నౌకలు పాల్గొని సాగర తీరాన్ని రక్షణ కవచంలా మార్చేశాయి. సముద్ర అలలపై నౌకలు, జలాంతర్గాములు చేసిన కవాతు, ఆకాశంలో నౌకాదళ విమానాలు చేసిన ఫ్లైపాస్ట్ వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

సాహస విన్యాసాలతో హోరెత్తిన సాగరం
ఈ సమీక్షలో భాగంగా భారత నేవీ అత్యున్నత శిక్షణకు నిదర్శనంగా నిలిచే పలు ప్రదర్శనలు జరిగాయి. మార్కోస్ కమాండోలు అత్యంత వేగంగా నిర్వహించిన పోరాట విన్యాసాలు, హెలికాప్టర్ల ద్వారా చేపట్టిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు ఉత్కంఠను రేకెత్తించాయి. 'యునైటెడ్ త్రూ ఓషన్స్' (సముద్రాల ద్వారా ఏకత్వం) అనే నినాదంతో సాగిన ఈ ఉత్సవం, అంతర్జాతీయ జలాల్లో శాంతిని, సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సాగింది. సముద్రం ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నామనే సందేశాన్ని ఇస్తూ, వివిధ దేశాల జెండాలతో యుద్ధనౌకలు బారులు తీరిన దృశ్యం ప్రపంచ దేశాల మధ్య ఉన్న మైత్రికి చిహ్నంగా నిలిచింది. ఈ చారిత్రక ఘట్టానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సాక్ష్యంగా నిలిచారు.

'మహాసాగర్' విజన్.. ప్రపంచానికే మార్గదర్శి
సమీక్ష అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. భారతదేశం ఎప్పుడూ 'వసుధైవ కుటుంబకం' స్ఫూర్తిని నమ్ముతుందని, సముద్ర భద్రతలో ప్రపంచ దేశాలన్నీ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమైన 'మహాసాగర్' విజన్‌ను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది కేవలం రక్షణకే పరిమితం కాకుండా, అందరి అభివృద్ధి, భద్రతను కోరుకుంటుందని స్పష్టం చేశారు. విపత్తు సమయాల్లో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. మిత్ర దేశాల నౌకాదళాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పరస్పర విశ్వాసానికి నిదర్శనమని రాష్ట్రపతి పేర్కొన్నారు.

గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు ఉక్కుపాదం
విశ్వంభ, ఏపీ బ్యూరో: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్షల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, వాస్తవాలను వెలికితీయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ విచారణ అత్యంత పారదర్శకంగా జరగాలని కోర్టు స్పష్టం చేసింది.

ఫోరెన్సిక్ నిపుణులతో 'ట్యాంపరింగ్' గుట్టుమట్లు!

ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న 'జవాబు పత్రాల మార్పిడి' ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎంపికైన అభ్యర్థుల పేపర్లు భద్రంగా ఉన్నాయా? లేదా వాటిలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగాయా? అన్నది తేల్చడానికి రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. విజయవాడలో జరిగిన మూల్యాంకన ప్రక్రియలో వాడిన బార్‌కోడ్‌లు, అసలు ఓఎంఆర్ షీట్లలోని డేటా సరిపోలుతున్నాయో లేదో శాస్త్రీయంగా తనిఖీ చేయాలని ఆదేశించి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

ఉద్యోగులకు షాక్..

దర్యాప్తు నిష్పాక్షికంగా సాగాలంటే, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎంపికైన అభ్యర్థులు అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయకుండా చూడాలని కోర్టు భావించింది. ఈ క్రమంలో, గ్రూప్-1 ద్వారా ఎంపికై ప్రస్తుతం వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అభ్యర్థులందరినీ వెంటనే అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు వారు దర్యాప్తును ప్రభావితం చేసే ఏ స్థానంలోనూ ఉండకూడదని కోర్టు తేల్చి చెప్పింది.

మార్చి 16 గడువు..
ఈ మొత్తం వ్యవహారంపై సిట్ తన సమగ్ర నివేదికను మార్చి 16వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు గడువు విధించింది. ప్రధాన వ్యాజ్యాలపై విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలు రాసిన తమకు, ఈ తీర్పుతో న్యాయం జరుగుతుందని వేలాది మంది నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే దిశగా హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విశాఖ జూలో డిప్యూటీ సీఎం పవన్ సందడి
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించి తన ఉదారతను చాటుకున్నారు. తన తల్లి అంజనా దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని జూపార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాది కాలం పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆ రెండు జిరాఫీల పోషణకు, సంరక్షణకు అయ్యే పూర్తి ఖర్చును తానే స్వయంగా భరిస్తానని వెల్లడించారు. కేవలం ప్రభుత్వమే కాకుండా, కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి జంతువుల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించిన పవన్..

ఈ పర్యటనలో భాగంగా జూ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం జూలోని వివిధ ప్రాంతాలను కలియతిరుగుతూ నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్లను సందర్శించి, వాటికి స్వయంగా ఆహారాన్ని అందించారు. జంతువుల పట్ల ఉన్న ఆసక్తితో వాటి పేర్లను, అలవాట్లను జూ క్యురేటర్‌ను అడిగి తెలుసుకున్న ఆయన, ఏనుగులు,జిరాఫీల శాలలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.

జూ పర్యటన ముగించుకున్న అనంతరం కంబాలకొండ ఎకో పార్కుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి, అక్కడ నగరవనాన్ని ప్రారంభించారు. ఎకో పార్కులోని సహజసిద్ధమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అక్కడి చెక్క వంతెనపై నడక సాగించారు. వనంలోని మొక్కల వివరాలు, వాటి పెరుగుదల గురించి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంక్షేమం పట్ల ఆయన చూపిన ఈ చొరవ స్థానికులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది.

19న శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల
విశ్వంభర, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తుల సౌకర్యార్థం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్ల కోటాను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ-టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. టికెట్లు మంజూరవుతాయి. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా, సాలకట్ల తెప్పోత్సవాలు,  సాలకట్ల వసంతోత్సవాల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటాను విడుదల చేస్తారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

టికెట్ల బుకింగ్ కోసం భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే సందర్శించాలని అధికారులు కోరారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు
విశ్వంభర, ఏపీ బ్యూరో: పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో 'ఏఎం గ్రీన్ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు.

రాష్ట్ర అభివృద్ధిలో ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024’ ఒక గేమ్ ఛేంజర్ అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చిందని, తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. ప్రధాని మోదీ సహకారం, చంద్రబాబు నాయకత్వంలో ఏపీని గ్రీన్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామన్నారు.

ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి లభించనుందని పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.  నిర్మాణ దశలో 8,000 మందికి, నిర్వహణ దశలో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అనుబంధ రంగాల ద్వారా మరో కొన్ని వేల మందికి దీర్ఘకాలిక ఉపాధి లభించనుంది. బలమైన సంకల్పంతో ఈ స్థాయికి ఎదిగిన గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్, మహేష్‌లను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి, స్వరాష్ట్రంలో ఇలాంటి భారీ ప్రాజెక్టును చేపట్టడం గర్వకారణమని కొనియాడారు.

ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ విశేషాలు
కాకినాడలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో అత్యంత కీలకం కానుంది. 495 ఎకరాల విస్తీర్ణంలో, ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది. రూ.15,600 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మొదలై, భవిష్యత్తులో 8 బిలియన్ డాలర్ల వరకు విస్తరించనుంది. 2027 చివరి నాటికి తొలి దశ కమిషనింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దావోస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం'-2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం ఆదివారం బయలుదేరి వెళ్లనుంది. పారిశ్రామిక దిగ్గజాలను కలిసేందుకు, రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో సిద్ధమయ్యారు.

సదస్సులో బాబు-లోకేష్ జోరు
ఈ అంతర్జాతీయ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం మూడు కీలక సెషన్లలో ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా 'ట్రిలియన్ డాలర్ల ఏఐ ఎకానమీ' మరియు 'పునరుత్పాదక ఆహార వ్యవస్థలు' అనే అంశాలపై ఆయన ప్రసంగం సాగనుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెండు సెషన్లలో ప్రసంగించనున్నారు. 'పీ4' (పబ్లిక్ ప్రైవేట్ పీపూల్ పార్టనర్‌షిప్) మోడల్, రాష్ట్రంలో సాగుతున్న డిజిటల్ విప్లవం గురించి  వివరించనున్నారు.

నాలుగు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి దాదాపు 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ఏపీ మోలర్ మేర్క్స్ సీఈవో విన్సెంట్ క్లెర్క్‌లతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో వారి పెట్టుబడుల విస్తరణపై చర్చించనున్నారు.  స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి, యూఏఈ వాణిజ్య ప్రతినిధులు, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిరన్ బర్కత్ వంటి కీలక నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దావోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీ లాంజ్ వేదికగా 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్' వంటి వినూత్న కార్యక్రమాలపై అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రధానంగా మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నెల 19 నుంచి 22 వరకు అత్యంత బిజీగా గడపనున్న సీఎం బృందం, 23న పర్యటన ముగించుకుని నేరుగా అమరావతికి చేరుకుంటుంది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి కనీసం రూ.50 వేల నుంచి రూ.1 లక్ష కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ హబ్
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి వేదికగా 'ఏపీ ఫస్ట్' (ఫ్యూచరిస్టిక్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) పేరుతో ఒక భారీ అంతర్జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలోని యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు తెలిపారు.

ఈ రీసెర్చ్ సెంటర్ కేవలం ఒక కార్యాలయంలా కాకుండా, విజ్ఞాన గనిలా పని చేయనుంది. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీ-తిరుపతి, ఐసర్‌ భాగస్వామ్యంతో దీనిని నిర్మించనున్నారు. ఈ రీసెర్చ్ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతికపై పరిశోధనలు చేయనున్నారు. కొత్త రకమైన స్టార్టప్‌లకు, ఆవిష్కరణలకు ఊతమివ్వనుంది. కేవలం పరిశోధనలే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు నేర్పించనుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "రాష్ట్ర భవిష్యత్తు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. తిరుపతిలో ఏర్పాటు చేయబోయే ఈ సెంటర్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుంది. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో మన యువతే దిక్సూచి కావాలి" అని వెల్లడించారు. ఈ కేంద్రం ఏర్పాటుతో చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగానే కాకుండా, దక్షిణ భారతదేశపు 'నాలెడ్జ్ హబ్'గా కూడా అవతరించబోతోంది.

వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్‌
విశ్వంభర, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు తీరుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు (ట్రయల్ కోర్టు) ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు.

సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆదేశించింది. జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం ఈ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించింది. అయితే, ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని పాక్షికంగా ఆదేశాలు ఇవ్వడాన్ని సునీత తప్పుబట్టారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, తాము లేవనెత్తిన కీలక అంశాలను విస్మరించిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హత్య వెనుక ఉన్న అసలు కుట్ర కోణాన్ని ఛేదించాలంటే పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని, కేవలం ఇద్దరికే విచారణను పరిమితం చేయడం వల్ల అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉందనిపేర్కొన్నారు. సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ తాజా దరఖాస్తుతో పాటు ఈ కేసులో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురు నిందితులు జైలులో ఉండగా, హత్య వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్న దానిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో దర్యాప్తును కేవలం ఇద్దరికే పరిమితం చేస్తే, కేసులో ఉన్న ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల పాత్ర బయటకు రాదని బాధితులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సునీతారెడ్డి సీబీఐకి పూర్తిస్థాయి విచారణాధికారం ఇవ్వాలని కోరుతున్నారు.

పోలవరంపై తెలంగాణ ‘యూ-టర్న్’!
విశ్వంభర, బ్యూరో: పోలవరం ప్రాజెక్టుతో పాటు నల్లమలసాగర్‌కు సంబంధించిన అంశాలపై గతంలో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దరఖాస్తుకు న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుపై  సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఆర్టికల్‌ 131, సివిల్‌ సూట్‌ రూపంలో మళ్లీ రావాలని సీజేఐ సూచించారని, ఆయన సూచన మేరకు పిటిషన్‌ను ఉపసం హరించుకున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, బ్యాక్ వాటర్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని గతంలో తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని, దీనిని వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని తెలంగాణ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతినిస్తూ కేసును ముగించింది.

ఎందుకీ నిర్ణయం..?
పోలవరం బ్యాక్ వాటర్ అంశంపై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలతో చర్చలు జరుగుతుండటం, అలాగే అపెక్స్ కౌన్సిల్ పరిధిలో ఈ వివాదాలు పరిశీలనలో ఉండటంతో.. న్యాయపోరాటం కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నల్లమలసాగర్‌కు సంబంధించి కూడా నీటి కేటాయింపులు, ప్రాజెక్టు డిజైన్లపై గతంలో అభ్యంతరాలు ఉండేవి. అయితే ప్రస్తుతం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) పరిధిలోకి ప్రాజెక్టుల నిర్వహణ వెళ్తున్న తరుణంలో, బోర్డు ద్వారానే సమస్యలను తేల్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం
విశ్వంభర నేషనల్, బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-సీ62 (PSL V-C62) సాంకేతిక కారణాల వల్ల అంతరాయం ఏర్పడింది. శ్రీహరికోట నుంచి సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ మిషన్‌లో మూడో దశ తర్వాత అంతరాయం ఏర్పడినట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ధృవీకరించారు. ప్రయోగంలో తలెత్తిన లోపాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ అంతరాయానికి గల కారణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో వెల్లడిస్తామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.

రక్షణ రంగానికి కీలకమైన ‘ఈఓఎస్‌-ఎన్‌1’ (అన్వేష్) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్‌తో పాటు యూకే, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం మూడో దశ వరకు ప్రణాళిక ప్రకారం విజయవంతంగా సాగింది. అయితే, ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే కీలక సమయంలో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఇది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌ (NSIL) చేపట్టిన 9వ పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగం.

'ఈఓఎస్‌-ఎన్‌1' ప్రత్యేకత ఏమిటి?
ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కోసం ప్రత్యేకంగా రూపొందించిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం. దేశ రక్షణలో భాగంగా సరిహద్దు కదలికలను గమనిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు సమాచారం అందిస్తోంది. భూగర్భ వనరులు, పంటల స్థితిగతులను అంచనా వేస్తోంది.

సంక్రాంతి సందడి: రయ్.. రయ్.. పట్నం నుంచి పల్లెకు..
విశ్వంభర, బ్యూరో: తెలుగువారి అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచే మొదలైన ఈ వాహనాల తాకిడి ఆదివారం ఉదయానికి మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద పరిస్థితి అత్యంత రద్దీగా ఉంది. టోల్‌గేట్ దాటడానికి కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి.

రద్దీని దృష్టిలో ఉంచుకుని టోల్ యాజమాన్యం అన్ని కౌంటర్లను (10+ కౌంటర్లు) కేవలం విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసమే కేటాయించినప్పటికీ, రద్దీ తగ్గడం లేదు. కొన్ని వాహనాలకు ఫాస్టాగ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టోల్ ప్లాజా వద్ద ఆలస్యం జరుగుతోంది. మరోవైపు కొర్రెముల, బీబీనగర్, నార్కెట్‌పల్లి జంక్షన్ల వద్ద కూడా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు, కార్లు వేల సంఖ్యలో రోడ్డెక్కడంతో హైవే అంతా వాహనమయంగా మారింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి రాచకొండ,  నల్గొండ పోలీసులు ప్రత్యేక బలగాలతో మోహరించారు. రైళ్లు, బస్సుల్లో టికెట్లు దొరకని వారు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుండగా, డిమాండ్‌ను బట్టి నిర్వాహకులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు ప్రయాణికులు వాహనాలను అతివేగంతో నడపవద్దని, సీట్ బెల్ట్ ధరించాలని, హైవేపై నిలిపిన వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైవే పెట్రోలింగ్ పోలీసులు సూచిస్తున్నారు.

ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌)
ఎగ్జామ్స్ గతంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం (జూన్‌ 27) విడుదలయ్యాయి.

ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ మేరకు ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది ఎడ్ సెట్ ను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్‌ 8వ తేదీన ఎడ్‌సెట్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. ఈ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగానే కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.