Secunderabad - Vishvambhara News

లాల్‌బజార్ బోనాల జాతరకు భక్తుల వెల్లువ.. నేడు రంగం కార్యక్రమం
Secunderabad Lal Bazar Bonalu: లాల్‌బజార్ శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొనగా, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో కళకళలాడుతున్నాయి.

బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్‌బజార్ ప్రాంతమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం చుట్టూ పండుగ వాతావరణం నెలకొనగా, భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, తాగునీరు, వైద్య సదుపాయాలు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు.

బోనాల ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన రంగం కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వచనాలను వినేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగం కార్యక్రమంతో పాటు ఇతర సంప్రదాయ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సికింద్రాబాద్‌లో ఆగివున్న రైలులో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్‌లో రెండు రైళ్లలో అగ్నిప్రమాదం సంభవించింది. మెట్టుగూడ వద్ద రెండు రైళ్లకు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొంత సమయం వరకూ ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. నిలిచి ఉన్న బోగీల నుంచి మంటలు చెలరేగాయని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు, పొగలను ఆర్పివేసారు. వాషింగ్‌కు వెళ్లి ప్లాట్ ఫాం మీదకి వస్తున్న అదనపు ఏసీ బోగిలో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అధికారులను అరా తీసారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలకు మరోసారి జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు బోగీలో మంటలు అంటుకోవడానికి ముందు క్లీనింగ్ సిబ్బంది ఎవరు ఉన్నారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఓ రైలులో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జి మీద ఆగిన ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. pic.twitter.com/fnoUMxz65e

— Telugu Scribe (@TeluguScribe) June 20, 2024