movies - Vishvambhara News

ఇళయరాజాకు 'పద్మపాణి' పురస్కారం
విశ్వంభర, సినిమా బ్యూరో: ప్రముఖ సంగీత జ్ఞాని, 'ఇసైజ్ఞాని' ఇళయరాజాను ప్రతిష్ఠాత్మక పద్మపాణి పురస్కారం వరించింది. ఈ విషయాన్ని అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (AIFF) నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు వారు వెల్లడించారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరగనున్న చలనచిత్రోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పురస్కారంతో పాటు రూ.2 లక్షల నగదు బహుమతి, పద్మపాణి జ్ఞాపికతో పాటు గౌరవ పత్రం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ ప్రియులు హాజరుకానున్నారు.

గత విజేతలు..
గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న వారి జాబితాలో ప్రముఖ గీత రచయిత జావేద్‌ అక్తర్, దర్శక-రచయిత్రి సాయి పరంజ్‌పే, దివంగత నటుడు ఓం పురి వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇళయరాజా చేరడం పట్ల సంగీత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌లోకి మనస్విని అరంగేట్రం!
విశ్వంభర, సినిమా బ్యూరో: టాలీవుడ్‌లోకి మరో ప్రతిభావంతురాలైన తెలుగమ్మాయి అడుగుపెడుతోంది. థియేటర్ ఆర్ట్స్, శాస్త్రీయ నృత్యం, సంగీతంలో అపారమైన అనుభవం ఉన్న మనస్విని బాలబొమ్మల, త్వరలో విడుదల కానున్న “కొక్కోరోకో” చిత్రంతో వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర స్పెషల్ పోస్టర్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. “Our Bangarraju Family wishes you a Happy Sankranthi” అంటూ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌లో మనస్విని లుక్ చాలా పద్ధతిగా, తెలుగమ్మాయి కళతో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఆమెతో పాటు సీనియర్ నటుడు సముద్రఖని, ఇతర తారాగణం కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

మనస్విని కేవలం నటి మాత్రమే కాదు, కళల పట్ల ఆమెకు సహజసిద్ధమైన అవగాహన ఉంది. గతంలో ‘లిటిల్ ఉమెన్’ నాటకంలో ‘జో’ గా, ‘మచ్ అడూ అబౌట్ నథింగ్’లో ‘బియాట్రిస్’గా ప్రధాన పాత్రలు పోషించి స్టేజ్ మీద తన సత్తా చాటారు. తెలంగాణ గర్వించదగ్గ ‘పేరిణి శివతాండవం’లో ఆమె ప్రత్యేక శిక్షణ పొందారు. అలాగే కర్ణాటక సంగీతంలోనూ ప్రవేశం ఉంది. గ్లెండేల్ అకాడమీలో పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసిన అనుభవం ఆమెకు చక్కని స్టేజ్ ప్రెజెన్స్‌ను ఇచ్చింది.

ఆసక్తికరంగా ‘కొక్కోరోకో’
ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ తన సొంత బ్యానర్ ‘ఆర్వీ ఫిల్మ్ హౌస్’పై నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. కోడిపందేల నేపథ్యంలో ఐదు విభిన్న పాత్రల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస్ వసంతల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సంకీర్తన్ సంగీతం అందిస్తున్నారు. ఆకాశ్ ఆర్ జోషి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కా లోకల్ టాలెంట్‌తో వస్తున్న మనస్విని టాలీవుడ్‌లో బలమైన ముద్ర వేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

“మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సక్సెస్.. మెగా విక్టరీ సెలబ్రేషన్స్
విశ్వంభర, సినిమా బ్యూరో: సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మెగాస్టార్ నివాసంలో గ్రాండ్ సక్సెస్ మీట్, సంక్రాంతి వేడుకలను నిర్వహించింది.

ఈ సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సక్సెస్ సంబరాల్లో భాగంగా  మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి కేక్ కట్ చేశారు. సినిమా ఘన విజయం సాధించినందుకు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు పలువురు సన్నిహితులు హాజరయ్యారు.

సంక్రాంతి పండుగకు కావాల్సిన పూర్తిస్థాయి వినోదం ఈ సినిమాలో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చిరంజీవి మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి మేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వెంకటేష్ కీలక పాత్రలో మెరవడం ప్రేక్షకులకు డబుల్ ధమాకాగా మారింది. పండగ సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

సినిమా టికెట్లపై 'కోమటిరెడ్డి' యూ-టర్న్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఈ విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట మార్చారు. తాను సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడమే మానేశానని టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఇవాళ అందుకు భిన్నంగా మాట్లాడారు. టికెట్ ధరల పెంపు నిర్ణయం ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్నదేనని వెల్లడించారు.

షరతులతో కూడిన పెంపు
ఈ సందర్భంగా మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పుష్ప-2 ఘటన తర్వాత ధరల పెంపు ఉండదని ప్రకటించినప్పటికీ, పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని సవరించుకున్నట్లు తెలిపారు. అయితే, పెంచిన ధరలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమ నిధికి కేటాయించాలనే కఠినమైన షరతును విధించినట్లు పేర్కొన్నారు. ఇటీవల కొన్ని సినిమాల విషయంలో కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సమయంలో తాను నగరంలో లేనందువల్ల పూర్తి సమాచారం అందలేదని వివరణ ఇచ్చారు.

మాకు పని ఉంది.. మీకు లేదు
మంత్రికి తెలియకుండానే జీవోలు ఎలా వస్తాయని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయిన వారికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బొక్కాబొర్లా పడిందన్నారు. బీఆర్ఎస్ నేతలకు పనిపాట లేదు కాబట్టే ప్రతి విషయంలోనూ బురదజల్లుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం చేయాల్సిన పని చాలా ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోరని వైఎస్ఆర్ మాదిరిగా అందరిని కలుపుకుపోతారని చెప్పారు.

ఆయా శాఖల విషయంలో ముఖ్యమంత్రి జోక్యంపై వస్తున్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ శాఖలోనూ అనవసరంగా తలదూర్చరని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా మంత్రులకు పూర్తి 'ఫ్రీ హ్యాండ్' ఇస్తారని కొనియాడారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల తన నిర్ణయాలను మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. మొదట తాను ఆ శాఖను పట్టించుకోవడం మానేశాను అని చెప్పి, ఇప్పుడు అంతా కూర్చుని చర్చించాం అనడం చర్చనీయాంశమైంది.

సర్కారా.. సర్కస్ కంపెనీనా?
విశ్వంభర, బ్యూరో: తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉందనే అనుమానం ప్రజలకు కలుగుతోందని మండిపడ్డారు.  సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియకుండానే టికెట్ల ధరల పెంపు ఫైళ్లు కదులుతున్నాయా ప్రశ్నించారు. "నా ప్రమేయం లేదు.. నా దగ్గరకు ఫైల్ రాలేదు" అని మంత్రి అనడం హాస్యాస్పదమన్నారు. క్యాబినెట్ మంత్రికి తెలియకుండా జీవోలు రావడం ప్రజా పాలననా? లేక పాపిష్టి పాలననా? అని నిలదీశారు. ఓడిపోయిన ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా మారి, సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, ఒక్కో సినిమాకు కోట్ల రూపాయిల కమీషన్ల దందా సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. తాను సీట్లో ఉన్నంత కాలం రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు అని మైకు పట్టుకుని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రాత్రికి రాత్రే మూడు సినిమాలకు రేట్లు ఎలా పెంచారు?" అని నిలదీశారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఐటీ మంత్రిని నేనే.. సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని, టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పినందుకు ఒక హీరోపై, పేరు మర్చిపోయినందుకు మరో హీరోపై కక్ష కడుతున్నారని, నచ్చిన వాళ్లకు మాత్రం రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తూ రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో  సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడటం వల్లే తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరిందని గుర్తు చేశారు. ఈ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ 'టికెట్ రేట్ల కమిషన్ల దందా'పై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ చీకటి ఒప్పందాల వివరాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.

చిరు సినిమా క్లైమాక్స్‌పై క్రేజీ అప్‌డేట్
విశ్వంభర, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' రేపు (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే, సినిమా విడుదలకు ముందే క్లైమాక్స్ సీక్వెన్స్‌పై ఒక ఆసక్తికరమైన అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా, క్లైమాక్స్‌లో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విలన్లు టార్గెట్ చేస్తారట. వేరు వేరు ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో చిరంజీవికి తోడుగా విక్టరీ వెంకటేష్ సడెన్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి శత్రువుల పని పట్టే సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని ఇండస్ట్రీ టాక్. ఈ 'మెగా-విక్టరీ' కాంబో ఫ్యాన్స్‌కు అసలైన పండగ ట్రీట్ అని చెప్పాలి.

ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ.. "ఇది ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్. కథ విన్నప్పుడే నాకు బాగా నచ్చింది, ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని ధీమా వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు చిరు వింటేజ్ స్వాగ్ కలగలిపి ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండబోతున్నాయని అభిమానులు అంటున్నారు.

ఘట్టమనేని వారసుడి 'పవర్ ఫుల్' ఎంట్రీ
విశ్వంభర సినిమా: టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఘట్టమనేని కుటుంబం నుంచి మరో నవతరం హీరో వెండితెరపై మెరవడానికి సిద్దమయ్యారు. కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, తన అన్న కొడుకుకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. మా అబ్బాయి జయ కృష్ణను పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అజయ్ భూపతి విజన్, అశ్విని దత్ సపోర్ట్‌తో ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దుమ్ము ధూళి ఎగసిపడుతున్న రగ్గడ్ బ్యాక్‌డ్రాప్‌లో, జయ కృష్ణ హై-స్పీడ్ బైక్‌పై దూసుకు వస్తూ కనిపించారు. ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని, మరో చేత్తో గన్ గురిపెట్టిన తీరు సినిమాలోని ఇంటెన్సిటీని చాటిచెబుతోంది. జయ కృష్ణ కళ్లలోని తీక్షణత, మోషన్ బ్లర్ ఎఫెక్ట్ సినిమా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని స్పష్టం చేస్తోంది. చిత్ర బృందం ఈ సినిమాను “డెబ్యూ ఆఫ్ ది ఇయర్ 2026” గా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఘట్టమనేని అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా.. సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రేజీ కాంబినేషన్ - అగ్ర నిర్మాణ సంస్థలు
'RX 100', 'మంగళవారం' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌లో ఎందరో స్టార్లను పరిచయం చేసిన అగ్ర నిర్మాత  అశ్విని దత్ (వైజయంతి మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా,  బాలీవుడ్ బ్యూటీ  రాషా తడాని ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్ కుమార్,   టెక్నీషియన్స్ గా జయకృష్ణ, మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటింగ్, రియల్ సతీష్ యాక్షన్ లో పని చేస్తున్నారు.

కేంద్రమంత్రిపై మనసు పారేసుకున్న నటి.. ప్రేమిస్తున్నానంటూ పోస్టు
ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ పేరు బాగా వైరల్ అవుతోంది. అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన పేరే హైలెట్ అవుతోంది. ఎందుకంటే చార్మింగ్ గా, స్టైలిష్‌ గా ఉండే ఆయనపై యువతులు మనసు పారేసుకుంటున్నారు. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇక ఈ లిస్టులో తాజాగా భోజ్ పురి నటి నిషా దూబే చేరిపోయారు. ఆమె ఏకంగా కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ ను ప్రేమిస్తున్నానంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది. దాంతో అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నిషా దూబే వయస్సు 25 ఏండ్లయితే, చిరాగ్ పాశ్వాన్‌కు 45 యేండ్లు. అంత పెద్ద వయసు వ్యక్తిపై మనసు పారేసుకోవడం ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర మంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో క్లిప్ ను ఆమె ఇన్ స్టాలో పోస్టు చేస్తూ.. నిత్యం నవ్వుతూ ఉండే ఆయన ముఖాన్ని చూస్తే ఎవ్వరైనా మనసు పారేసుకుంటారని.. నేను కూడా మనసు పడ్డానని తెలిపింది. అయితే ఆమె వ్యాఖ్యలపై నవాజ్ సిద్దిఖి స్పందిస్తూ.. ‘ఒక మహిళ ఏమైనా కోరుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.