investments - Vishvambhara News

ఫ్యూచర్ సిటీకి 'ఏఐ' కళ
విశ్వంభర బ్యూరో: తెలంగాణను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముచ్చర్లలో నిర్మిస్తున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో రూ.5,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ 'యూపీసీ వోల్ట్' (UPC Volt) ముందుకొచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సందర్భంగా యూపీసీ వోల్ట్ సీఈవో హాన్‌ డీ గ్రూట్‌, కో-ఫౌండర్ స్టీవెన్ జ్వాన్, ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌లతో కూడిన ప్రతినిధి బృందం గురువారం మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో సమావేశమైంది. ఈ సందర్భంగా డేటా సెంటర్ స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశారు.

ప్రాజెక్టు విశేషాలివే..
ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ సాంకేతికతకు అనుకూలమైన డేటా సెంటర్‌ను నెలకొల్పుతారు. వచ్చే ఐదేళ్ల కాలంలో విడతల వారీగా రూ.5,000 కోట్లు వెచ్చించనున్నారు. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ కోసం 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్‌ను కూడా సంస్థే ఏర్పాటు చేయనుంది. నిర్మాణ దశలోనే సుమారు 3,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరో 800 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

టెక్ సెంటర్‌గా ఫ్యూచర్ సిటీ
ఈ ఒప్పందంపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. "ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి ఈ పెట్టుబడి ఒక నిదర్శనం. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణ హితమైన విద్యుత్ వినియోగం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత" అని పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఈ పెట్టుబడి ద్వారా మరోసారి నిరూపితమైందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీర్ల సంస్థ భారీ పెట్టుబడి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్ (AB InBev) తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం, ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్‍తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ యూనిట్‌ను విస్తరించేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్, తాజా విస్తరణ ద్వారా మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురానుంది.

ఇప్పటికే ఈ సంస్థ ద్వారా దాదాపు 600 మందికి ఉపాధి లభిస్తుండగా, విస్తరణతో మరిన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి. కేవలం పరిశ్రమలే కాకుండా.. సర్క్యులర్ వాటర్ వినియోగం, మహిళా సాధికారత, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కంపెనీ ఆసక్తి చూపింది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ విజన్ అని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి ఆదాయ వృద్ధి, మౌలిక వసతుల కల్పన కీలకమని తాము భావిస్తున్నామని చెప్పారు. ఏబీ ఇన్‌బెవ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం శుభపరిణామని రేవంత్ రెడ్డి తెలిపారు.

పెట్టుబడిదారుల నమ్మకం
తెలంగాణలో ఉన్న విధాన స్థిరత్వం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు వ్యాపార సౌలభ్యం కారణంగానే అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఏబీ ఇన్‌బెవ్ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. అటువంటి దిగ్గజ సంస్థ తెలంగాణలో తన సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించనుంది.

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా; నారా లోకేష్
తాను ఇంకా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు గానీ.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తానని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటి సారి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇంకా టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని.. వాటిని వైసీపీ మూకలే చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారి ఆదేశం ప్రకారం తాము ఇంకా నోరు మెదపట్లేదని.. ఆయన వల్లే కంట్రోల్ లో ఉన్నామని నారా లోకేష్ తెలిపారు. ఇక, రెడ్‌ బుక్‌ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు.

మంగళగిరిలో పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు తాను మంత్రి పార్థసారథిని కలిసి విన్నవించినట్టు తెలిపారు మంత్రి లోకేష్. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ తెలిపారు మంత్రి లోకేష్. త్వరలోనే వైసీపీ దాడుల్లో గాయపడిని వారిని పరామర్శిస్తానంటూ తెలిపారు లోకేష్.