Konda Surekha - Vishvambhara News

భ‌క్తుల సంఖ్య అంచ‌నాతో మేడారం జాత‌ర‌ అభివృద్ధి :మంత్రి కొండా సురేఖ
విశ్వంభర,మేడారం : ఆసియా ఖండంలోనే అతి ఆదివాసీ, గిరిజ‌న జాత‌ర మేడారం భ‌క్తుల సంఖ్య అంచ‌నా ఆధారంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారుల‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ప్ర‌స్తుతం చేప‌డుతున్న ప్ర‌తి నిర్మాణంలో ఆదివాసీ, గిరిజ‌న, కోయ ఆచారాలు, ఆథ్యాత్మిక చింత‌న ప్ర‌స్పుటించాల‌ని స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, పంచాయితీరాజ్‌ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌, ఎంపీ బలరాం నాయక్ త‌దిత‌ర అధికారుల‌తో క‌లిసి ఆల‌య సంబంధిత నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని  మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేప‌డుతున్నామ‌న్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న మేర‌కు ఆల‌య నిర్మాణ ప‌నులు నిర్ధేశించిన గ‌డువులోగా పూర్తి చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఆదివాసీ ఇల‌వేల్పులు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. రోడ్డు నిర్మాణ ప‌నులు, డివైడ‌ర్లు, ప్లాంటేష‌న్ త‌దిత‌ర ప‌నులు పూర్తి కావడానికి 24 గంట‌లు నిరంత‌రం ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌ద్దెల ద‌ర్శ‌నం, బంగారం (బెల్లం) స‌మ‌ర్ప‌ణ‌... జంప‌న్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌ధానంగా గుడి ప్రాంగణంలో చేస్తున్న అభివృద్ధి పనులను, జంపన్న వాగు, స్తూపం నుండి బస్టాండ్ వరకు జరిగే రోడ్ల విస్తరణను ఇత‌ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పరిశీలించారు. ఈ  ప‌రిశీలనా కార్య‌క్ర‌మంలో సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌నివాస‌రాజు, ఆర్ అండ్ బి ఈ ఎన్సీ మోహ‌న్ నాయ‌క్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానొత్ రవి చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్, మండల మాజీ అద్యక్షులు జాలపు అనంత రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ సర్కారు : మంత్రి కొండా సురేఖ
విశ్వంభర,హైదరాబాద్ : అటవీ అమరవీరులకు తెలంగాణ సర్కారు తో పాటు ,ఈ శాఖ మంత్రిగా నేను కూడా అండగా నిలుస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. జాతీయ‌ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భముగా హైదరబాద్ బ‌హుదుర్ పుర‌లోని నెహ్రూ జూ పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ  సందర్భముగా  అమరవీరుల స్మారక చిహ్నం కు ఫారెస్టు అధికారులు, సిబ్బంది కలిసి  పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ అట‌వీ సంప‌ద‌ను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాల‌ర్పించి వీర‌మ‌ర‌ణం పొందిన అట‌వీ సిబ్బంది త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారని కొనియాడారు.అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసులదే కీలక పాత్ర అని, విధి నిర్వహ‌ణ‌లో అట‌వీ సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. విధి నిర్వహ‌ణ‌లో 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవ‌డం చాలా బాధక‌రమ‌న్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండ‌గా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అట‌వీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుందని చెప్పారు. అట‌వీ సంప‌ద‌ను ర‌క్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అట‌వీ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి సురేఖ‌ పిలుపునిచ్చారు. ఇక సుమారు 300 ఏళ్ల‌ క్రితం (1,730 సంవ‌త్స‌రంలో) రాజస్థాన్ రాష్ట్రంలోని కేజ్రలీ గ్రామంలోని బిష్ణోయి తెగకు చెందిన 360 మంది కేజ్రలీ చెట్లు కాపాడే క్ర‌మంలో తమ ప్రాణాలు త్యాగం చేశారని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ సంఘటనకు గుర్తుగా, విధి నిర్వహణలో ధైర్య, సాహసాలు ప్రదర్శించి అమరులైన అటవీ శాఖ ఉద్యోగుల త్యాగం చిరస్మరణీయం చేయ‌డానికి, ఏటా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 11న “అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్స‌వాన్ని” జరుపుకుంటున్నామన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది అటవీ అధికారులు విలువైన అటవీ సంపదను కాపాడే క్ర‌మంలో త‌మ ప్రాణాల‌ను సైతం త్యాగం చేశారని వారి త్యాగాన్ని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలోని అటవీ భూములను ర‌క్షించ‌డంలో అటవీ సిబ్బంది విశేష కృషి చేస్తున్నారన్నారు. అడవుల రక్షణ, అట‌వీ సంప‌ద స్మ‌గ్లింగ్ వంటి కార్యకలాపాలను అరికట్టడం కోసం అట‌వీ శాఖ అధికారులు విశేష కృషి చేస్తున్నారు. ఫారెస్టు డిపార్టుమెంటు ప‌రంగా మేము కూడా క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అటవీ శాఖ సిబ్బందికి ఎంతో స‌హ‌కారం అందిస్తున్నామన్నారు. ప్ర‌తి జిల్లాలో వివిధ ర‌కాల అట‌వీ కార్య‌క‌లాపాల‌కు, ఆయా ప్రాంతాల్లో ప‌నులను ప్రోత్స‌హించ‌డానికి ప్ర‌తిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారుల‌కు ఏటా రూ. 10 వేలు న‌గ‌దు పుర‌స్కారం అందిస్తున్నామన్నారు. అడవి సరిహద్దులు సరిచూసుకొని, పలు చర్యలు తీసుకుంటున్నరన్నారు. కలప అక్రమ రవాణాను క‌ట్ట‌డి చేయ‌డానికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకొని ముందుకు వెళుతున్నార‌న్నారు.

అటవీ సంరక్షణ బలోపేతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 2,181 వాహనాలు ఇచ్చామన్నారు. అడవుల్లో గడ్డి భూములు, నీటి వనరులు అభివృద్ది చేయ‌డం ద్వారా పంటపొలాలు, పశువులపై వన్యప్రాణుల దాడులు అరిక‌ట్ట‌గిలిగామ‌న్నారు. క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచామన్నారు. క్రూరమృగాల దాడిలో మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలోనే పచ్చదనం పెంపుదలలో మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నం, తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “వనమహోత్సవం”  ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటి వరకు నాటడం జ‌రిగిందన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలో మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ వనమహోత్సవం (2025) పథ‌కంలో ఇప్పటి వరకు 14,355 నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీలలో 12,707 నర్సరీలు, మున్సిపాలిటీలలో 600 నర్సరీలు ఏర్పాటు చేశామ‌న్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించ‌డానికి, క్షీణించిన అడవులలో అటవీ పునరుద్ధరణ పనులను అన్నీ జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. పీడీ యాక్టుకు తగిన సవరణలు చేసి ఫారెస్టు అధికారులపై దాడి చేసే నేరస్తులపై కఠినమైన శిక్షలు పడేలా చేయడానికి తగు చర్యలు తీసుకుంటార‌న్నారు. పంచాయతీ చట్టం, పురపాలక చట్టం ద్వారా  గ్రామాలలో మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలను  సంరంక్షించ‌డానికి స్పష్టమైన ఆదేశాలను  ఇచ్చామ‌న్నారు. ప్రకృతి పరంగా లభించిన సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చేయ‌డం మన అందరి భాద్యత అన్నారు. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడే ప్రయత్నంలో, విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అటవీ సిబ్బంది అంకిత భావం చిరస్మరణీయం, స్పూర్తిదాయకమ‌న్నారు. ఈ అకుంఠిత కార్యదీక్షలో నిస్వార్థంగా పని చేయటానికి సంపూర్ణ సహకారం అందించిన అమర వీరుల కుటుంబ సభ్యులకు మా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా మన అటవీ శాఖ సోదరుల ధైర్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంపద పరిరక్షణలో పునరంకితమ‌వుదామని ప్రతిజ్ఞ చేద్దామ‌న్నారు. మన రాష్ట్రంలో, దేశంలో అడవుల సంరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అట‌వీ అధికారుల‌ను స్మరించుకుంటూ, వారి ప్రాణ త్యాగాలకు జోహార్లు అర్పిస్తున్నానీ మంత్రి సురేఖ చెప్పారు. పోలీసు విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో, అటవీ అమరవీరులకి కూడా అందాలని సీఎస్ రామకృష్ణరావు, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణలకి మంత్రి సురేఖ తన ప్రసంగం ద్వారా  సూచన చేశారు. తమ అటవీ అధికారుల మీద దాడి జరిగిన ప్రతిసారి తెలంగాణ డీజీపీ జితేందర్ సహకారం తమకు ఉంటుందని, అందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండ సురేఖ
విశ్వంభర, వరంగల్ : వరంగల్  నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖకు సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద గల రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్ పాపను చూసి చలించి పోయారు. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి, సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్ళి ఆ చంటి పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసి పాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. మంత్రి సురేఖ చేసిన పనికి పలువురు అభినందనలు తెలిపారు.

బోనాల జాతరను వైభవంగా నిర్వహిస్తాం : మంత్రి కొండా సురేఖ
విశ్వంభర, జూబ్లిహిల్స్‌: తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగను వైభవంగా జరపాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. శనివారం జూబ్లిహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను జూలై 7 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

సోనియాగాంధీ ప్రసాదించిన తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ఈ జాతరతో ప్రపంచానికి చాటుతామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో నెలకొన్న 3 వేలకు పైగా ఆలయాలకు బోనాల జాతర నిర్వహణ నిమిత్తం రూ.25 కోట్ల గ్రాంట్ ఇన్‌ఎయిడ్‌ను అందించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని, మరో రెండు మూడు రోజుల్లో ఈ నిధులు విడుదలవుతాయన్నారు. బోనాలు ముగిసేదాకా అన్ని శాఖలు అంతర్గత సమావేశాలతో పాటు, ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుకుంటూ, విజయవంతంగా జాతరను ముగించాలని అధికారులను ఆదేశించారు.

బోనాల జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని, మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో ఈ సంఖ్య మరింత పెరగనున్నందున అదనపు బస్సులు కేటాయించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంత్రి సురేఖ కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండ చర్యలు చేపట్టాలని, బస్ స్టాండ్‌లలో తాగునీరు, చిన్న పిల్లలకు ఆహారం, వైద్య సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగు అంబారీపై ఊరేగింపు నిమిత్తం కర్నాటక నుంచి ఏనుగు తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. అగ్నిమాపక శాఖ వాలంటీర్లకు శిక్షణనిచ్చి ఆలయాల వద్ద సేవల్లో వినియోగించుకోవాలని సూచించారు. ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలతో కూడిన క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ఆలయ కమిటీలతో త్వరలోనే మీటింగ్ నిర్వహించి జాతర ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని సురేఖ స్పష్టం చేశారు.