letter - Vishvambhara News

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. రానున్న 2026-27 బడ్జెట్‌లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నిధులు కేటాయించకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల అమలుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రెండు బడ్జెట్లలో హామీల అమలుకు నిధులు కేటాయించని ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయించాలని నాలుగు కోట్ల ప్రజల పక్షాన కోరుతున్నానన్నారు.

మహిళలు, రైతులు, యువతకు ద్రోహం
ఆరు గ్యారెంటీలలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. అలాగే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు నిధులు కేటాయించాలన్నారు. రెండు సంవత్సరాలుగా బకాయిపడ్డ హామీలకు, నిధులకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని మాటిచ్చి మోసం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా క్షమాపణ చెప్పాలని, ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలన్నారు.

ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం - హెచ్చరించిన కేటీఆర్
పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని కేటీఆర్ అన్నారు. నాటి గ్యారంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై కాంగ్రెస్ పాపాలను ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. "ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తాం" అని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మాపై పన్నులు బాదండి.. కుబేరుల వింత డిమాండ్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: సాధారణంగా పన్నులు తగ్గిస్తే బాగుంటుందని కార్పొరేట్ దిగ్గజాలు కోరుకోవడం చూస్తుంటాం. కానీ, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా దీనికి భిన్నమైన, వినూత్నమైన డిమాండ్ వినిపించింది. "మాపై భారీగా పన్నులు విధించండి" అంటూ 24 దేశాలకు చెందిన సుమారు 400 మంది అత్యంత సంపన్నులు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాము ప్రభుత్వాలను స్వాధీనం చేసుకున్నామని..  ఆవిష్కరణలపై పట్టు బిగించామని తెలిపారు. ఇది వ్యవస్థకు మంచిది కాదని.. మార్పు రావాలంటే చట్టసభలు తమపై పన్నుల భారాన్ని పెంచాలని తెలిపారు.

'టైమ్ టు విన్'
సంపన్నులు, సామాన్యుల మధ్య పెరుగుతున్న అగాధాన్ని రూపుమాపాలని కోరుతూ "టైమ్ టు విన్" పేరుతో వీరు సంతకాలు చేసిన లేఖను విడుదల చేశారు. భారీ సంపద కలిగిన కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వాలను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారని సంపన్నులు ఆవేదన వ్యక్తం చేశారు. సంపద ప్రభావంతో మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని, ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని హెచ్చరించారు. తమపై అధిక పన్నులు విధించడం వల్ల తమ జీవన ప్రమాణాలు ఏమాత్రం తగ్గవని.. కానీ, ఆ నిధులతో ఆరోగ్యం, విద్య వంటి ప్రజా సేవలకు భారీగా నిధులు అందుతాయని పేర్కొన్నారు.

అసమానతల అంతానికి అస్త్రం అదే!
ధనవంతులపై 'ప్రగతిశీల సంపద పన్ను'విధించడం ద్వారానే అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలను తిరిగి నిర్మించుకోగలమని ఈ బృందం స్పష్టం చేసింది. రాజకీయ వ్యవస్థలపై సంపన్నుల గుత్తాధిపత్యాన్ని తగ్గించాలంటే పన్నుల విధానంలో మార్పులు తప్పవని వారు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో కూడా ఆదాయ అసమానతలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ (క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ రచయిత) గతంలోనే భారత్‌లో పెరిగిపోతున్న ఆర్థిక వ్యత్యాసాలపై హెచ్చరించారు. దేశంలోని 'సూపర్ రిచ్' వ్యక్తులపై అదనపు పన్నులు విధించడం ద్వారానే సామాజిక సమతుల్యత సాధ్యమవుతుందని సూచించారు.

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీలతో లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. తమ హయాంలో కరెంట్ విషయంలో గణనీయ మార్పు చూపించామని.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈరోజుతో గడువు ముగియనుండటంతో కేసీఆర్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని.. విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణకు స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో నోటీసులు అందాయి. జస్టిస్ నర్సింహా రెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఈ నెల 15లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.