Fire accident - Vishvambhara News

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మూడు అంతస్తుల భవనంలో మంటలు
Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫతే దర్వాజా వద్ద ఉన్న ఓ మూడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా భవనం మొత్తం వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

భవనం నుంచి భారీగా పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. అగ్నిప్రమాదంతో భవనంలోని కొంత సామగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. భవనంలో జరిగిన ఆస్తి నష్టం ఎంత? మంటలు ఎలా మొదలయ్యాయి? అనే వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సిరిసిల్లలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షాపులో కార్మికుడు సజీవ దహనం
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరులో మంగళవారం ఉదయం మహాలక్ష్మి ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు దుకాణం మొత్తం వ్యాపించడంతో ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దుకాణంలో పనిచేస్తున్న ముజామిల్ (21) అనే కార్మికుడు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే మంటల తీవ్రతకు దుకాణంలోని ఫర్నిచర్, ఇతర సామగ్రి భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

దుకాణంలో సుమారు రూ.40 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు యజమాని తెలిపినట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మంటల్లో చిక్కుకుని కార్మికుడు మృతి చెందిన ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో జరిగిన మొత్తం ఆస్తి నష్టం, ఇతర వివరాలు అధికారుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

రైల్లో అగ్ని ప్రమాదమంటూ దూకి.. ముగ్గురు మృతి
జార్ఖండ్‌లో దారుణ ఘటన జరిగింది. రైలు బోగీలో మంటలు వ్యాపించాయన్న వదంతి ముగ్గురు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. అగ్నిప్రమాద భయంతో ససారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ నుంచి బయటకు దూకిన ప్రయాణికుల్లో ముగ్గురు.. అదే సమయంలో పక్క పట్టాలపై వస్తున్న గూడ్స్‌ రైలు కింద పడి మృతిచెందారు.

అయితే, రైలులో అగ్నిప్రమాదం జరిగినట్టు గుర్తు తెలియన వ్యక్తి నుంచి కుమందిహ్‌ స్టేషన్‌కు ఫోన్‌ వచ్చిందని ధన్‌బాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ తెలిపారు. దీంతో రైలును ఆపి తనిఖీ చేయగా ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం వదంతి మాత్రమేని తెలిసిందన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏరియా కావడంతో.. దీని వెనుక ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అన్న విషయాన్ని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రాంచీ-ససారం ఎక్స్‌ప్రెస్‌ ధన్‌బాద్‌ డివిజన్‌లోని కుమందిహ్‌ రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్న సమయంలో రైలులో అగ్నిప్రమాదం జరిగిందని కొందరు వ్యక్తులు పుకార్లు సృష్టించారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రయాణికులు ప్రాణభయంతో నడుస్తున్న రైలు నుంచి కిందకు దూకేశారు. అదే సమయంలో పక్కనున్న పట్టాలపై గూడ్స్‌ రైలు వస్తుండటంతో దారుణ ఘటన జరిగింది.