America - Vishvambhara News

మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న భారీ ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామం అటు అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువులకు ఊపిరి పోయడంతో పాటు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ట్రంప్ 'ట్రూత్' సోషల్ వేదికగా సంచలన ప్రకటన
ప్రధాని మోదీతో సంభాషణ అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. "నా స్నేహితుడు మోదీ ఒక శక్తిమంతమైన నాయకుడు. ఆయన విజ్ఞప్తిని గౌరవిస్తూ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసి, అమెరికా, వెనిజులా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది" అని ట్రంప్ పేర్కొన్నారు.

సుంకాల లెక్కలివే
ఇప్పటివరకు భారతీయ ఉత్పత్తులపై అమెరికా దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తోంది. ఇందులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షాత్మకంగా విధించిన 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. తాజా ఒప్పందంతో మొత్తం సుంకం 18 శాతానికి తగ్గించింది. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు సున్నా స్థాయికి చేర్చింది. దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ, వ్యవసాయం, ఇంధన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోనుంది.

ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై మోదీ స్పందిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. "రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచ శాంతికి, సుస్థిరతకు మార్గం సుగమమవుతుంది. అమెరికా సుంకాల తగ్గింపు ఎంతో సంతోషకరం. ట్రంప్ నాయకత్వంలో మా భాగస్వామ్యం అత్యున్నత స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను" అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

జైశంకర్ పర్యటన వేళ కీలక మలుపు
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటన ప్రారంభమైన రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు, ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగాలకు భారీ ఊరట కలగనుంది. 'మోదీ-ట్రంప్' ద్వయం ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

WHOకు అమెరికా ‘గుడ్‌బై’
విశ్వంభర బ్యూరో:  ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రంలో ఒక భారీ మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెన్నుముకగా నిలిచిన అమెరికా.. ఆ సంస్థ నుండి అధికారికంగా నిష్క్రమించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తొలిరోజే జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశం ప్రకారం, ఏడాది గడువు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో, ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో WHO విఫలమైందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. WHO స్వతంత్రంగా కాకుండా, కొన్ని దేశాల రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని ఆరోపించింది. సంస్థలో పారదర్శకత కోసం అమెరికా సూచించిన కీలక సంస్కరణలను అమలు చేయడంలో WHO విముఖత చూపిందని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

తక్షణమే అమల్లోకి వచ్చిన చర్యలు
అమెరికా కేవలం మాటలకే పరిమితం కాకుండా కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెళ్లే అన్ని రకాల వార్షిక విరాళాలను, ప్రాజెక్ట్ నిధులను అమెరికా తక్షణమే నిలిపివేసింది. జెనీవా ప్రధాన కార్యాలయంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న WHO ఆఫీసుల్లో పనిచేస్తున్న అమెరికా ప్రతినిధులు, టెక్నికల్ నిపుణులను వెనక్కి పిలిపించింది. టెక్నికల్ కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుండి అమెరికా శాశ్వతంగా తప్పుకుంది.

బ్లూమ్‌బెర్గ్ సంచలన నివేదిక
అమెరికా నిష్క్రమణ పక్కాగా ఉన్నా, ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. నిష్క్రమించే సమయానికి అమెరికా WHOకు సుమారు 260 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,382 కోట్లు) బకాయి పడింది. నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లిస్తేనే నిష్క్రమణ పూర్తయినట్లు భావిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. బకాయిలు చెల్లించే ప్రసక్తే లేదని, ఇప్పటికే అమెరికా భారీగా నష్టపోయిందని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఇకపై కేవలం సాంకేతిక పరంగా, అత్యంత పరిమిత పరిధిలోనే ఆ సంస్థతో సంబంధాలు ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది.

ప్రపంచంపై ప్రభావం ఏంటి?
WHO మొత్తం బడ్జెట్‌లో అమెరికా వాటా సుమారు 18% నుండి 20% వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ నిధులు ఆగిపోవడంతో ఆఫ్రికా వంటి పేద దేశాల్లో సాగే పోలియో నిర్మూలన, టీకాల పంపిణీ, అత్యవసర వైద్య కార్యక్రమాలు కుంటుపడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌ దిశగా అమెరికా సైన్యం
విశ్వంభర బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌ పాలకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ చుట్టూ ఇప్పటికే అమెరికా తన భారీ నౌకాదళాన్ని మోహరించిందని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని హెచ్చరించారు. శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరాన్ తాజా పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వందలాది మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షల అంశంపై ట్రంప్‌ స్పందించారు. "నేను రంగంలోకి దిగకపోయి ఉంటే ఇప్పటికే 800 మందికి పైగా నిరసనకారులను ఇరాన్ ఉరితీసేది. వారిని ఉరితీస్తే అమెరికా నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను హెచ్చరించడంతోనే ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది" అని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్‌కు నష్టం జరగకూడదని తాను భావిస్తున్నప్పటికీ, పరిస్థితులు చేయి దాటితే చర్యలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు.

పశ్చిమాసియాకు అమెరికా అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ సహా పలు యుద్ధనౌకలు చేరుకుంటున్నాయి. దాడులను తిప్పికొట్టేందుకు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా వైట్‌హౌస్ ఆ ప్రాంతానికి పంపిస్తోంది. ఇరాన్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ భారీ మోహరింపు జరుగుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

గ్రీన్‌లాండ్‌పై అమెరికా గురి
విశ్వంభర బ్యూరో:  ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలనే పాత ఆలోచనను అమెరికా మళ్లీ తెరపైకి తెస్తోంది. కేవలం కొనుగోలు ప్రతిపాదనలతోనే కాకుండా, ఇప్పుడు రక్షణ పరంగా ఆ ద్వీపంపై తన పట్టును బిగించేందుకు 'డైరెక్ట్ యాక్షన్' మొదలుపెట్టింది. గ్రీన్‌లాండ్‌లోని అత్యంత కీలకమైన సైనిక స్థావరం వద్ద యుద్ధ విమానాలను మోహరించేందుకు అమెరికా సిద్ధమవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.

నార్డ్ ప్రకటనతో మొదలైన కలకలం
నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (NORAD) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌లాండ్‌లోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న పిటుఫిక్ (గతంలో తూలే) స్పేస్ బేస్‌కు త్వరలోనే తమ శక్తివంతమైన యుద్ధ విమానాలు చేరుకుంటాయని అమెరికా సైన్యం ప్రకటించింది. ఉత్తర అమెరికా ఖండ రక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, ఆర్కిటిక్ ప్రాంతంలో శత్రు దేశాల కదలికలను నిశితంగా గమనించడమే ఈ మోహరింపు ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ఈ మోహరింపు వ్యవహారంపై అమెరికా సైన్యం ఒక ఆసక్తికర వివరణ ఇచ్చింది. డెన్మార్క్ రాజ్యంతో సమన్వయం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, గ్రీన్‌లాండ్ ప్రభుత్వానికి కూడా ముందస్తు సమాచారం అందించామని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఈ కీలక పరిణామంపై డెన్మార్క్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.గ్రీన్‌లాండ్‌పై పూర్తి నియంత్రణ సాధించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తాయని డెన్మార్క్‌లోని కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గ్రీన్‌లాండ్ ఎందుకు ముఖ్యం?
ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రభావం పెరుగుతున్న తరుణంలో అమెరికా గ్రీన్‌లాండ్‌ను ఒక 'సహజసిద్ధమైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్'గా భావిస్తోంది. ఖనిజ సంపదతో పాటు, రష్యా క్షిపణులను పసిగట్టడానికి ఇక్కడి రాడార్ వ్యవస్థలు అమెరికాకు అత్యంత కీలకం. తాజాగా యుద్ధ విమానాలను మోహరించడం ద్వారా ఈ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని వాషింగ్టన్ గట్టిగా భావిస్తోంది.

ఏడాదిలో లక్ష అమెరికా వీసాల రద్దు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంలో అమెరికా విదేశాంగ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. జాతీయ భద్రత, చట్టాల ఉల్లంఘన సాకుతో ఏకంగా లక్ష వీసాలను రద్దు చేసినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇది అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయి రద్దు అని అధికారులు వెల్లడించారు.

మొత్తం రద్దు అయిన లక్ష వీసాల్లో 8,000 విద్యార్థి(F, J కేటగిరి), 2,500 ప్రత్యేక(ఉద్యోగ, ఇతర నిపుణులు) వీసాలున్నాయి. 2024తో పోలిస్తే రద్దుల సంఖ్య 150 శాతం పెరిగింది. కేవలం అనుమానంతో కాకుండా, నిర్దిష్టమైన చట్ట ఉల్లంఘనల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రద్దుకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని పేర్కొంది. గడువు దాటిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడటం, గొడవలకు పాల్పడటం లేదా ఇతరులపై దాడులు చేయడం, క్రైమ్ రికార్డు ఉన్న వారిని తక్షణమే దేశం నుంచి పంపించి వేయడం వంటి కారణాలు ఉన్నాయి.

సోషల్ మీడియాపై నిఘా!
వీసా ఉన్న వారందరిపై ఇప్పుడు ప్రభుత్వం 'సోషల్ మీడియా వెట్టింగ్' ప్రక్రియను వేగవంతం చేసింది. భద్రతా బలగాలతో తలపడిన వారు, అమెరికా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు సోషల్ మీడియా ద్వారా తేలితే వారి వీసాలు అక్కడికక్కడే రద్దు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 'కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్' ద్వారా వీసా హోల్డర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అమెరికా పౌరుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని.. చట్టాలను అతిక్రమించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.

అమెరికాలో తొలి తెలుగు జ‌డ్జిగా జ‌య బాదిగ‌ నియామకం
తెలుగు మ‌హిళ జ‌య బాదిగ‌కు అమెరికాలో అరుదైన గౌర‌వం ద‌క్కింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా ఆమె నియ‌మితుల‌య్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జ‌డ్జిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి మ‌హిళగా నిలిచారు.

కాగా, 2022 నుంచి ఇదే కోర్టులో ఆమె క‌మీష‌న‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన జ‌య... హైద‌రాబాద్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. అనంత‌రం అమెరికా వెళ్లిన ఆమె బోస్ట‌న్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. ఆ తర్వాత‌ శాంటా క్లారా విశ్వ‌విద్యాల‌యం నుంచి లా ప‌ట్టా పొందారు.

2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేశారు. 10 ఏళ్ల‌కు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో లాభాపేక్ష లేకుండా ప‌లు కేసుల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదించారు. అదేవిధంగా మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగానూ జ‌య బాదిగ‌ ప‌ని చేశారు.

భారత్ పై అమెరికా ప్రశంసల జల్లు
విశ్వంభర, వెబ్ డెస్క్ : భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై అమెరికా ప్రశంసల వర్షం కురిపించింది. వైట్ హౌస్ జాతీమ భద్రతా సమాచారం సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్ ను కొనియాడారు. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని తెలిపింది.

భారతీయులు ఓటు వేయడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రశంసనీయమని అన్నారు. "భారతదేశంలో 96 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియ లో పాల్గొని 2660 గుర్తింపు పొందిన పార్టీల నుంచి అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. వేలాది మంది పోటీదారుల నుంచి 545 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోబోతున్నారు". అని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికాలో భారీ వర్షాలు... నలుగురు దుర్మరణం
విశ్వంభర, వెబ్ డెస్క్ : అమెరికా హ్యూస్టన్ నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండంతో... ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్టు పెద్ద సంఖ్యలో విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి జరిగిన ప్రమాదాల్లో మొత్తం నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లు, వ్యాపార కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హ్యూస్టన్ నగర వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.