vikarabad - Vishvambhara News

ఐదుగురు వచ్చారు.. దృష్టి మళ్లించారు.. బంగారు గొలుసుతో ఉడాయించారు
Vikarabad Gold Chain Theft: వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ నగల దుకాణంలో చోరీ ఘటన కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు సిబ్బంది దృష్టి మరల్చి 10 గ్రాముల బంగారు గొలుసును అత్యంత చాకచక్యంగా అపహరించారు. క్షణాల్లోనే దొంగతనానికి పాల్పడి అక్కడి నుంచి పరారవడంతో దుకాణ యజమాని, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సమాచారం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు సాధారణ కస్టమర్ల మాదిరిగా నగల దుకాణంలోకి ప్రవేశించారు. నగలు చూపించాలని కోరుతూ సిబ్బందిని మాటల్లో పెట్టారు. ఇదే సమయంలో వారిలో ఒకరు సిబ్బంది దృష్టి మరల్చగా, మరో వ్యక్తి అవకాశం చూసుకుని 10 గ్రాముల బంగారు గొలుసును చాకచక్యంగా కాజేశాడు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొంతసేపటి తర్వాత నగలు పరిశీలించిన దుకాణ సిబ్బందికి బంగారు గొలుసు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే దుకాణంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా, కస్టమర్ల వేషంలో వచ్చిన వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన విషయం బయటపడింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఘటనపై దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాపారులు దుకాణాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

కష్టపడే వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని, వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినయోగం చేయవద్దని సూచించారు. వారసత్వంగా ఎవరికీ అవకాశాలు రావని, మనం పడే కష్టం, శ్రమ ఎప్పటికీ వృథా పోవని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణను శిక్షగా భావించవద్దని కోరారు.

డీసీసీలుగా ఎన్నికైనంత మాత్రాన ఆ జిల్లాలపై తమదే ఆధిపత్యమని, తామే అధిపతులమని భావిస్తే అది పెద్ద తప్పిదమని రేవంత్ హెచ్చరించారు. డీసీసీ పోస్టు అనేది కేవలం అధికారం మాత్రమే కాదని, అది ఒక కుటుంబ పెద్దలాంటి బాధ్యత అని గుర్తు చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారు ఉంటారని, ఇది మహాత్మా గాంధీ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమని పేర్కొన్నారు. భిన్న స్వరాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలే తప్ప, వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తే అది పార్టీకి కీడు చేసినట్లవుతుందని హితవు పలికారు.

తాను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, సొంత పార్టీలోనే కొందరి నుంచి వ్యతిరేకత ఎదురైందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ నేతలందరి ఇళ్లకు వెళ్లి వారిని కలిసినట్లు వివరించారు. వయసులో, అనుభవంలో చిన్నవాడినైనా పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, సహకరించాలని కోరి అందరినీ ఒప్పించినట్లు చెప్పారు. అందరం సమిష్టిగా కృషి చేయడం వల్లే పార్టీ ఓటింగ్ శాతం 2.5 నుండి 40 శాతానికి చేరిందని విశ్లేషించారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని, అక్కడ అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ పదవులు కల్పించామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.

వికారాబాద్‌లో చిరుత కలకలం.. వ్యక్తికి తీవ్రగాయాలు
చిరుతదాడిలో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో  గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చౌడాపూర్ మండలంలోని కొత్తపలిల గ్రామ సమీపంలో బాత్రూం వెళ్లిన శేఖర్‌పై చిరుత దాడి చేసింది. దాని బారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతడి చేయికి తీవ్రగాయాలయ్యాయి.

ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, శేఖర్‌కు ప్రాణాపాయం తప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. చిరుత అడవిలోకి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత ఆనవాళ్లను గుర్తించి బోన్‌లో బంధించి తీసుకువెళ్లాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.