DSC - Vishvambhara News

డీఎస్సీ అక్రమాలపై వైసీపీ పోరు.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలు కొనసాగనున్నట్లు పార్టీ ప్రకటించింది.

డీఎస్సీ వ్యవహారంపై ఇప్పటికే పలు దశల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ.. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, నిరసన ప్రదర్శనలు, టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపిస్తూ ఇప్పుడు రిలే నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది.

డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షలు ముగిసిన అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని పార్టీ నేతలు వెల్లడించారు.

కేటీఆర్, హరీశ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ... దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షచేయండి
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేయాల్సింది పేద విద్యార్థులు కాదని... దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట చేయాలని సవాల్ చేశారు. మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ... బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను సన్నాసి అంటూ విరుచుకుపడ్డారు.

ఉద్యమం సమయంలో హరీశ్ రావు పెట్రోల్ డ్రామా ఆడితే శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయించాలని చూస్తున్నారని విమర్శించారు. 11 వేలకు పైగా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు వాయిదా వేయాలంటూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా కోసం విపక్షాలు పరీక్షల వాయిదా అంటూ ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరీక్షలు ఒక్క నెల రోజులు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్‌లకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు.

అందుకే, పరీక్షలు వాయిదా అంటున్నారని ధ్వజమెత్తారు. 'బావ, బావమరుదులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు సవాల్ చేస్తున్నాను. సన్నాసుల్లారా.. అమాయక విద్యార్థులను దీక్షకు ఎందుకు కూర్చోబెడుతున్నారు. మీరు కూర్చోండి. మా ప్రాణాలైనా పోవాలి... పరీక్షలైనా వాయిదా పడాలనే నినాదంతో పదిహేను రోజులు దీక్ష చేయండి. ఎవరు ఆపుతారో చూద్దాం. వారు దీక్ష చేయాలని సవాల్ చేస్తున్నాను. పేద పిల్లలు దీక్షలు చేస్తుంటే మీరు తింటూ ఉంటారా? విద్యార్థుల బాధలు తీరాలంటే హరీశ్ రావు, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. పేద పిల్లలు దీక్షకు కూర్చోవద్దు. మీరు కూర్చోండి. మీ వాదనలో నిజం ఉంటే మీరే దీక్ష చేయండి. ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ వదులుకోదు కదా.. మీకు దమ్ముంటే కూర్చోవాలని సవాల్ విసురుతున్నాను' అన్నారు.

విద్యార్థులకు నిజంగానే అన్యాయం జరుగుతుందని భావిస్తే బిల్లా రంగాలు దీక్షకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. రాజకీయంగా పార్టీ చచ్చిపోయినప్పుడల్లా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా? అని ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేస్తే పిల్లల జీవితాలు ఆగమవుతాయన్నారు. పిల్లలకు పరీక్షలు వాయిదా వేస్తే తనకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం రాజకీయ కోణంలో వాయిదా డిమాండ్ చేస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయన్నారు.

డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుందని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం జీవో విడుదల చేశారు.

అయితే, ఇప్పటివరకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం అమలు చేసేది. తాజాగా ప్రభుత్వం ఐదు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో తెలిపిన మార్కుల శాతానికి సవరణలు చేస్తున్నట్లు జీవోలో తెలపింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. దీంతో భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు.