Kishan Reddy - Vishvambhara News

కిషన్ రెడ్డి రాజకీయం చేయడం మానుకోని..సర్వీస్ చేయడం నేర్చుకో : జగ్గారెడ్డి
విశ్వంభర , హైదరాబాద్ : కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో  మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై  సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి, జిహెచ్ఎంసి అధికారులను అలెర్ట్ చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. సీఎం అక్కడికి వెళితే సహాయక చర్యలకు ఇబ్బందులు అవుతాయని, అందుకే సీఎం రేవంత్ ఆదేశాలతో డిప్యూటీ సిఎం భట్టి,మంత్రులు పొన్నం,దామోదర రాజనర్సింహ,ఎంపీ అనిల్ యాదవ్,మేయర్ విజయలక్ష్మి ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించారని పేర్కొన్నారు. బాధితులను కాపాడేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ ప్రభుత్వం చేసింది, అయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానేసి.. ఘటనా స్థలంలో కిషన్ రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొనాల్సింది అని సెటైర్ వేశారు.కేంద్ర మంత్రి గా కిషన్ రెడ్డి అవసరం అయితే ప్రధాని మోదీ తో మాట్లాడాలి, లేదంటే సీఎం తో మాట్లాడి పలు సూచనలు చేస్తే బాగుండేది కానీ గల్లీ లీడర్ ల మాట్లాడటం బాధ అనిపించిందని పేర్కొన్నారు.

కేటీఆర్ డైరెక్షన్‌లో కిషన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బాధితులను కాపాడే టెన్షన్‌లో ప్రభుత్వం ఉంటే.. కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి రాజకీయం చేశారని మండిపడ్డారు. ఎక్కడ రాజకీయాలు చేయాలో కూడా కేంద్రమంత్రికి తెలియదా? అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.చర్ల పల్లి రైల్వే స్టేషన్ ఈదురు గాలి కే రేకులు పడిపోలేదా? భారత మాతకు హారతి లో ట్యాంక్ బండ్ లో టపాకాయలు కాల్చితే ముగ్గురు అనుకోకుండా చనిపోతే  సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారా? అని ప్రశ్నించారు.గుజరాత్ లో బ్రిడ్జి కూలిపోతే 140 మంది చనిపోతే రాహుల్ గాంధీ రాజకీయం చేశారా..? కిషన్ రెడ్డి నీవెందుకు అనుకోకుండా జరిగిన ప్రమాదం పై రాజకీయం చేస్తున్నావు అని జగ్గారెడ్డి మండి పడ్డారు.నా సీనియర్ గా నిన్ను గౌరవిస్తా, కానీ కిషన్ రెడ్డి రాజకీయం చేయడం మానుకో, సర్వీస్ చేయడం నేర్చుకో అని హితవు పలికారు.

వచ్చే ఎన్నికల్లోపు రిజర్వేషన్లు, నియోజకవర్గాలు పెరుగుతాయిః కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోపు రిజర్వేషన్లు, నియోజకవర్గాలు పెరుగుతాయని తెలిపారు. ఈ రాబోయే ఐదేండ్లు చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ హయాంలో చాలా కొత్త మార్పులు ప్రజలు చూస్తారని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

నియోజకవర్గాలు మారుతాయని, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లతో మహిళలకు అవకాశాలు బాగా పెరుగుతాయని.. వచ్చేసారి పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు.

ఇక తెలంగాణలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం మాదిరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలాంటి పనులు చేయట్లేదని విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు కిషన్ రెడ్డి. దాంతో ఆయన చేసిన కామెంట్లపై అటు బీఆర్ ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కూడా విమర్శళు గుప్పిస్తున్నాయి.

కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు
కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఢిల్లీకి  బయల్దేరారు. ఇవాళ సాయంత్ర్యం కర్తవ్య పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తూ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. కాసేపటి క్రితం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఒకే కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. వారు ముందుగా ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారు. అనంతరం మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సిట్లను సాధించిన ఎన్టీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

అదే జరిగితే అతడిని సన్మానిస్తాం.. కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ప్రశంసల జల్లు
బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పినందుకు కిషన్ రెడ్డి మాటలు స్వాగతిస్తున్నామని.. అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారు. ఐదేళ్లు సీఎం రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్. ప్రభుత్వాలను పడగొట్టే దాంట్లో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు. తెలంగాణ లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా పడగొట్టే అవకాశం లేదు. బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదని తేలిపోయింది. అందుకే రోజుకో భాషా.. రోజుకో వేషం మారుస్తున్నారు. కిషన్ రెడ్డి చాలా గొప్పవారు. అటల్ బీహార్ వాజ్ పాయ్ దారిలో నడుస్తున్నట్టు కనిపించింది. మంచి పని చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రశంసించే గుణం వాజ్ పాయ్ ది. నిండు పార్లమెంట్ లో ఇందిరాగాంధీని దుర్గ మాతతో పోల్చారు. 25 మంది brs mla లు కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటే.. ఐదు నెలల కాంగ్రెస్ పాలన బాగుందని అర్థం. కాంగ్రెస్.. రాష్ట్రంలో మంచి పాలన ఉందని ప్రశంస మాకు మంచిదే.” అని ఆయన పేర్కొన్నారు.

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బీజేపీ, బీఆర్ఎస్ శత్రువులే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. తెలంగాణలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు జరగలేదన్నారు.

రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయి: కిషన్ రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఇవాళ (గురువారం) ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. వడ్లకు బోనస్ లేదు అని చురకలు అంటించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బందులకు గురిచేశారని... ఇప్పుడు, దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని రేవంత్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని కిషన్ రెడ్డి నిలదీశారు. రైతులకు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతి గింజను కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. రైతుల్లో వ్యతిరేకత మూటగట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు పడితే... కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 నెలలే పట్టిందన్నారు. దొడ్డు రకం వడ్లు వేసిన రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

విజ‌య‌శాంతి సంచలన ట్వీట్‌.. కిషన్ రెడ్డికి కౌంటర్..!
సీనియర్ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. అయితే, దీనిపై విజయశాంతి ట్విట్టర్(X) వేదికగా స్పందించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయం సరైందికాదని సంచలన ట్వీట్ చేశారు.

ప్రాంతీయ భావోద్వేగాలు.. ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని విజయశాంతి పేర్కొన్నారు. ఇది అర్థం కాని వారు.. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్దే, జయలలితల నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ ఇచ్చిన రాజకీయ సమాధానం ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

దక్షిణాది ఆత్మగౌరవం ఉందన్న సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయడంలేదని కిషన్ రెడ్డి మాటల ద్వారా స్పష్టమవుతోందన్నారు. మరోవైపు తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది