tdp - Vishvambhara News

మూడు గంటల కరెంటంటూ తప్పుడు ప్రచారం సరికాదు: ముత్యాలప్ప
Palacherla Muthyalappa: రాప్తాడు రైతుల కోసం ధర్నాలు చేస్తున్నానంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు.

ప్రకాష్‌రెడ్డి సొంత గ్రామమైన తోపుదుర్తిలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారని ముత్యాలప్ప తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లోనూ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో రైతుల కోసం ఇలాంటి సబ్‌స్టేషన్లు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో ప్రకాష్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

రైతులకు కేవలం మూడు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ ప్రకాష్‌రెడ్డి చేస్తున్న ప్రచారం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందని ముత్యాలప్ప అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు లేదా తాత్కాలిక అంతరాయాలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. సమస్యను పరిష్కరించకుండా రైతుల్లో అపోహలు కలిగించేలా ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు.

రైతు ప్రయోజనమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముత్యాలప్ప స్పష్టం చేశారు. వ్యవసాయ సీజన్‌లో రైతులకు అవసరమైన విద్యుత్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతుల సమస్యలను రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని, ధర్నాల పేరుతో రాజకీయ ప్రచారం చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని హితవు పలికారు. అమరావతి సహా ఇతర అభివృద్ధి అంశాలను రైతుల విద్యుత్ సమస్యలతో ముడిపెట్టి రాజకీయాలు చేయడం సరికాదని ముత్యాలప్ప పేర్కొన్నారు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన చిన్న శ్రీను
Chinna Sreenu: విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో చిన్న శ్రీను తన అనుచరులతో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు.

చిన్న శ్రీను టీడీపీలో చేరుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీనుతో పాటు ఆయన వెంట వచ్చిన పలువురు అనుచరులు కూడా టీడీపీలో చేరారు.

ఈ చేరిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వారి సమక్షంలో చిన్న శ్రీను టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వచ్చిన అనుచరులు సైతం టీడీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతో విజయనగరం రాజకీయాల్లో ఈ చేరికకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇటీవల కాలంలో విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిన్న శ్రీను టీడీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు టీడీపీలోకి రావడం పార్టీకి స్థానికంగా బలాన్ని చేకూర్చే అంశంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంతో చిన్న శ్రీను టీడీపీలో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు కుమార్తె సిరి సహస్ర చేరికతో విజయనగరం రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, చేనేత రంగం, మౌలిక సదుపాయాల విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను అత్యధిక శ్రద్ధ చూపిన వర్గం చేనేత కార్మికులేనని, చేనేతలకు టీడీపీ తప్ప మరో గుర్తు తెలియదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎక్కడా గుంతలు లేని రహదారులను నిర్మిస్తున్నామా లేదా అని నిరంతరం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

శారీరక శ్రమ కంటే సాంకేతిక పరిజ్ఞానం, తెలివితేటలతో పనిచేస్తే సులభంగా ఆదాయం సంపాదించవచ్చని యువతకు సూచించారు. రాష్ట్రంలోని బీచ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చీరాల సమీపంలో చిన్న విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సూర్యలంక బీచ్‌కు వస్తున్నారని, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు.

కాకినాడకు భారీ పెట్టుబడులు
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ప్రముఖ ఇంధన సంస్థ ‘ఏఎం గ్రీన్’ కాకినాడలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్వయంగా వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్ నుంచి దేశంలోనే తొలిసారిగా గ్రీన్ అమ్మోనియాను అంతర్జాతీయ విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు.జర్మనీ, సింగపూర్, జపాన్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సుమారు 8,000 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

2030 నాటికి ఉత్పత్తి ప్రారంభం
పర్యావరణ హితమైన ఇంధన వనరుల తయారీలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలిపేందుకు ఈ ప్లాంట్ దోహదపడనుంది. ఈ ప్రాజెక్టును సత్వరం పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేశ్ తెలిపారు. 2030 నాటికి ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తాం" అని లోకేశ్ తన పోస్టులో ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని గ్లోబల్ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని సూచించారు.

టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?
విశ్వంభర, జూబ్లీహిల్స్  : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన సంఘటన జరిగింది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్ అవుతున్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చినట్లు తెలుస్తోంది.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అడుగు పెట్టడం.. సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లి టీడీపీ శ్రేణులతో మీటింగ్ పెట్టారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం తెస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. పార్టీ నుంచి నాయకులు మాత్రమే బయటకు వెళ్లారని.. కేడర్ బలంగా ఉందని తెలిపారు. చంద్రబాబు ఈ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు వెళ్లి కలిసి రావడం రాష్ట్ర రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేశాయి.  అయితే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పామని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. వీరంతా సైకిల్ ఎక్కేందుకే రెడీ అయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ నేతల పేర్లు పార్టీ మారతారనే వారి జాబితాలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ అధినేతను కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

త్వరలో ఒకే వేదిక మీదకు చంద్రబాబు, రేవంత్
రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్ గురు, శిష్యులు అని మనందరికీ తెలిసిందే. టీడీపీలోనే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. చంద్రబాబు అండదండలతోనే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగారని అంటుంటారు. ఇక ఇప్పుడు ఇద్దరు గురు, శిష్యులు తెలంగాణ, ఏపీకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

అయితే మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారని అనుకున్నా.. అది జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. ప్రపంచ కమ్మ మహాసభను హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నారు.

ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు. అంటే చంద్రబాబు, రేవంత్ మొదటిసారి సీఎం హోదాల్లో పలకరించుకుంటారన్నమాట.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
విశ్వంభర, అమరావతిః మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల అదనపు జీతం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర సీఈవో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే అమరావతి, పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అటు సచివాలయంతో పాటు హెచ్ వోడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది.

ఇక ఈ ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా డ్యూటీలు చేయాలని తెలిపింది ప్రభుత్వం. ఇలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల గురించి తీసుకుంటున్న నిర్ణయాలు వారికి బాగానే లాభం చేస్తున్నాయి.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకృష్ణదేవరాయలు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందారు.

ఈ ఏడాది జనవరి 23న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి మరోసారి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంచి గౌరవం దక్కిందని, నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తన కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ రుణపడి ఉంటానన్నారు.

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని అన్న వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 21కి 21 స్థానాల్లో గెలిచి పవన్ కళ్యాణ్ గట్టి సమాధానం చెప్పారని అన్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు.

ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని, నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయని చంద్రబాబు అన్నారు.  ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని వ్యాఖ్యనించారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారు. వైకాపా వైనాట్ 175 అని చెప్పి 11 సీట్లు తెచ్చుకున్న పరిస్థితిని చూశాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసన సభ. 15వ శాసనసభను కౌరవసభగా మనం భావించాం అన్నారు. ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు అత్యున్నత, గౌరవ ప్రదమైన సభగా దీనిని తీర్చిదిద్దాలని సభ్యులకు సూచించారు.

రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ డుమ్మా
ఆంధ్రప్రదేశ్‌లో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఆయన స్పీకర్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది.

గతంలో స్పీకర్‌ను అధికార, విపక్ష పార్టీలు కలిసి చైర్‌లో కూర్చోబెట్టేవి. స్పీకర్‌ ఎన్నికకు అందరూ తప్పకుండా పాల్గొనాల్సిన సంప్రదాయానికి వైసీసీ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అయితే, ఇవాళ మాజీ సీఎం, పార్టీ చీఫ్ జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.

16 సీట్లతో టీడీపీ విశాఖ ఉక్కును కాపాడింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో బీఆర్ ఎస్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేస్తారని చాలా మంది అన్నారని.. కానీ అదే టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఇప్పుడు కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉందని చెప్పారు కేటీఆర్. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తేనే కేంద్రంలో ఇప్పుడు వారు చెప్పినట్టు వినే పరిస్థితులు వచ్చాయని స్పష్టం చేశారు. 16 సీట్లతోనే టీడీపీ ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుందని చెప్పారు.

బీఆర్ ఎస్ కు కూడా 16 సీట్లు ఇచ్చి ఉంటే ఈ రోజు తెలంగాణకు ఎంతో మేలు జరిగి ఉండదన్నారు కేటీఆర్. తెలంగాణలో ఇప్పుడు సింగరేణి గనులను కాంగ్రెస్, బీజేపీలు ఖతం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాయని మండిపడ్డారు. 8 స్థానాలు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు గనుల యాక్షన్ ను అడ్డుకోవట్లేదని మండిపడ్డారు.

రేవంత్ కు కేసుల భయం ఉందని.. అందుకే ఆపట్లేదన్నారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే సీఎం రేవంత్ ఆ కత్తికి సాన పడుతున్నారని  ఎద్దేవా చేశారు. కేసుల భయంతోనే రేవంత్ నోరు మెదపట్లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. సింగరేణిపై బీఆర్ ఎస్ యాక్షన్ ప్లాన్ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు కేటీఆర్.

‘ముద్రగడ’ పేరు మార్పు.. ప్రభుత్వ గెజిట్ విడుదల
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని చెప్పిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన వినతిని సమర్పించారు. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

గత మార్చి 27వ తేదీన ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. అంతకుముందు ఆయన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆయన చేరిక ఆగిపోయింది. చివరకు ముద్రగడ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆవెంటనే టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేసి చెప్పినట్లే పేరు మార్చేసుకున్నారు.