PM Modi - Vishvambhara News

అస్సాం ప్రగతి పథంలో మరో మైలురాయి
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అస్సాంలో భారీ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. నాగావ్ జిల్లాలోని కలియాబోర్ వేదికగా సుమారు రూ.6,950 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఈ జాతీయ రహదారి ప్రాజెక్టు మొత్తం పొడవు 86 కిలోమీటర్లు ఉండనుంది. ఇందులో 35 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్ ఉంటుంది. ఇది కజిరంగా నేషనల్ పార్క్ మీదుగా సాగుతుంది.  ఈ ప్రాజెక్టు నాగావ్, కర్బీ ఆంగ్లాంగ్, గోలాఘాట్ జిల్లాల గుండా వెళుతూ.. ఎగువ అస్సాంలోని డిబ్రూగఢ్, తిన్సుకియా ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలివేటెడ్ కారిడార్ వల్ల వన్యప్రాణుల సంచారానికి ఆటంకం కలగదు, తద్వారా మానవ-వన్యప్రాణి సంఘర్షణలు తగ్గుతాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కజిరంగా కేవలం ఒక నేషనల్ పార్క్ మాత్రమే కాదని, అది అస్సాం ఆత్మ అని కొనియాడారు. యునెస్కో గుర్తించిన ఈ ప్రపంచ వారసత్వ సంపదను కాపాడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో దేశంలో అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారం కింద ఇప్పటివరకు రూ.260 కోట్ల మొక్కలు నాటారని ఆయన తెలిపారు. ప్రకృతి, అభివృద్ధి కలిసి సాగగలవని భారత్ ప్రపంచానికి చాటిచెబుతోందని అన్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటును అడ్డుకోవడంలో, అడవులను, సాంస్కృతిక ప్రదేశాలను ఆక్రమణల నుండి విడిపించడంలో చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. దేశ ప్రజలందరికీ బీజేపీ మొదటి ప్రాధాన్యతగా మారిందని, ఇటీవలి బీహార్ ఎన్నికలు, మహారాష్ట్రలోని BMC ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అస్సాం అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. కామాఖ్య - రోహ్‌తక్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, డిబ్రూగఢ్ - లక్నో (గోమ్తీ నగర్) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా అస్సాం భవిష్యత్ తరాలకు గొప్ప అవకాశాలను కల్పిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు.

ప్రకృతి సంరక్షణే మన జీవన విధానం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: జాతి నిర్మాణంలో రైతులు అత్యంత బలమైన భాగస్వాములని, వారి నిరంతర శ్రమ 'ఆత్మనిర్భర్ భారత్' (స్వావలంబన భారత్) లక్ష్యాన్ని బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. రైతుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ నివాసంలో నిర్వహించిన 'పొంగల్' వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల ప్రాముఖ్యతను, భారతీయ సంస్కృతిని కొనియాడారు. దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కీలక ప్రసంగం చేశారు.

తమిళ సంస్కృతి.. మానవాళి వారసత్వం
తమిళ సంస్కృతి యొక్క ప్రాచీనతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది కేవలం భారతదేశానికే కాకుండా మొత్తం మానవాళికి ఉమ్మడి వారసత్వమని అన్నారు. తమిళ సంస్కృతిలో రైతును 'జీవితానికి పునాది'గా భావిస్తారని, ఆ స్ఫూర్తితోనే భారతదేశం తన మూలాల నుండి బలాన్ని పొందుతూ కొత్త అవకాశాల వైపు దూసుకుపోతోందని మోదీ వ్యాఖ్యానించారు.

ఏక్ భారత్ -శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి
దేశంలోని వైవిధ్యాన్ని, ఐక్యతను పండుగలు ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పొంగల్ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ పండుగగా మారిందని, ఇది మన రైతుల కృషికి దక్కిన గౌరవమని అన్నారు. ఒకవైపు పొంగల్ జరుపుకుంటుంటే.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు పండుగలు 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని చాటుతున్నాయని మోదీ వివరించారు. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో పొంగల్ మనకు నేర్పుతుందని మోదీ చెప్పారు.

ప్రకృతి సంరక్షణే మన జీవన విధానం
ప్రకృతి పట్ల కృతజ్ఞత కేవలం మాటల్లోనే కాకుండా, అది మన జీవనశైలిలో భాగం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టానికి ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు. నేలతల్లికి, సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప సందర్భమని అన్నారు. నేల తల్లి మనకు ఎన్నో వనరులను అందించిందన్నారు. ఆ వనరులను భవిష్యత్తు తరాల కోసం కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటం, నీటి సంరక్షణ మన తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ వంటి కార్యక్రమాలు పర్యావరణ స్పృహను పెంపొందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

విమానంలో ట్రోఫీతో ఆట‌గాళ్ల సెల‌బ్రేష‌న్స్ ...వీడియోను పంచుకున్న బీసీసీఐ
13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఐసీసీ ట్రోఫీ గెల‌వ‌డంతో టీమిండియా ఆట‌గాళ్ల ఆనందానికి అవ‌ధుల్లేవు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత మైదానంలో ఓ రేంజ్‌లో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ఇక బెరిల్ తుపాను కార‌ణంగా గ‌త శనివారం నుంచి  బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భార‌త జ‌ట్టు ఎట్ట‌కేల‌కు స్వ‌దేశానికి చేరుకుంది. ఇవాళ ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ఎయిరిండియా విమానంలో ఆట‌గాళ్లు, వారి కుటుంబ స‌భ్యులు, సిబ్బంది, మీడియా ప్ర‌తినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆట‌గాళ్ల‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అయితే, విమానంలో టీమిండియా ప్లేయ‌ర్లు చేసిన సెల‌బ్రేష‌న్స్ తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్‌తో వీడియో మొద‌లైంది. విమానంలో రోహిత్ చేష్టలు చాలా ఫ‌న్నీగా ఉన్నాయి. ఆ త‌ర్వాత ట్రోఫీతో విరాట్ కోహ్లీ, జ‌స్ప్రీత్ బుమ్రా, రిష‌భ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్, సూర్య‌కుమార్ దంప‌తులు క‌నిపించారు.

ఈ క్ర‌మంలో పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ట్రోఫీని చేతిలో ప‌ట్టుకుని మాట్లాడాడు. "చాలా ఆనందంగా ఉంది. ఇది (వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీ) చేతిలోకి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఎన్నో రోజులు వేచి చూశాం. ఎట్ట‌కేల‌కు దీన్ని సాధించాం. ఈ ఆనందం మాటల్లో చెప్ప‌లేను" అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాగా, భార‌త జ‌ట్టు స‌భ్యులు మొద‌ట ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక విమానంలో ముంబైకి బ‌య‌ల్దేరుతారు. ముంబైలో విక్ట‌రీ ర్యాలీ త‌ర్వాత వాంఖ‌డే స్టేడియంలో ఆట‌గాళ్ల‌ను బీసీసీఐ ప్ర‌త్యేకంగా స‌న్మానించ‌నుంది.

Jubilation in the air 🥳

The #T20WorldCup Champions have arrived in New Delhi! 🛬

Presenting raw emotions of Captain @ImRo45 -led #TeamIndia's arrival filled with celebrations 👏👏 pic.twitter.com/EYrpJehjzj
— BCCI (@BCCI) July 4, 2024

అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ
ఆదివారం నాడు మన్ కీ బాత్ లో ప్రసంగించిన మోడీ.. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రస్తావించారు. ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారి మన్ కీ బాత్ లో మాట్లాడారు. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు.

అదో అద్భుతం అని.. రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది అంటూ తెలిపారు. స్థానికంగా ఉన్న కొండదొరలు అరకు కాఫీలోని ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటున్నారో కూడా వివరించారు. వాళ్ల సంస్కృతి, ఆచారాలను వదులుకోకుండా అలా జీవించడం చాలా గొప్ప విషయమని అన్నారు.

వారు తమ అరకు కాఫీ తోటలను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. వారు పోరాడిన తీరును ఆయన పొగిడారు. అంతే కాకుండా వారి ఆచార, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటున్నారని.. అలా జీవించడం గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.

2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: ప్రధాని మోడీ
2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శ్రీనగర్‌లోని డాల్ సరస్సు సమీపంలో ఇవాళ(శుక్రవారం) నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు గుర్తుచేశారు.

యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు ప్రధాని తెలిపారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ యోగాపై అవగాహన కల్పించడానికి తన జీవితాన్ని ధారపోసిందని ప్రశంసించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయని మోడీ ఉద్ఘాటించారు.

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తాయి.  దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్- ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు.

బీహార్ లో నలంద యూనివర్సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ
విశ్వంభర, బీహార్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ  బీహార్ లో నూతనంగా నిర్మించిన నలంద యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 17 దేశాల రాయబారులతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్​ కూడా హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి ముందు నలంద విశ్వవిద్యాలయానికి చెందిన పురాతన శిథిలాలను ప్రధాని మోదీ సందర్శించారు. భారత వారసత్వ సంపద లో ఒకటిగా గుర్తించబడిన ఆ ప్రదేశంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే ప్రతిపాదనను తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఆమోదించాయి.

ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ... నలంద విశ్వవిద్యాలయం భారతీయ ఆత్మ వంటిదని నలంద అంటే జ్ఞానాన్ని అందించే విద్యా కేంద్రం అని అన్నారు. నాడు ప్రపంచలోనే ఓ ప్రముఖ విద్యాకేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం విరాజిల్లిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఒకప్పుడు విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకున్నారని తెలిపారు.

ఆ రోజునే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్..
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నియామకం అయ్యారు. దాంతో ఆమె మీద చాలా రకాల ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఆమె తన బడ్జెట్ తో సమాధానం చెబుతుందని అంతా అనుకుంటున్నారు. ఇక మోడీ 3.0 ప్రభుత్వం వంద రోజుల షెడ్యూల్ ను రచిస్తోంది.

దానికి అనుగుణంగానే జూలై 22న కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మోడీ 3.O అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్పించిన మొదటి సమగ్ర బడ్జెట్ ఇదే. వాస్తవానికి ఎన్నికలకు ముందే మధ్యంతర బడ్జెట్ ను ఆగమేఘాల మీద ప్రవేశ పెట్టారు. కానీ పూర్తి స్థాయిలో దాన్ని అప్పుడు ఎన్నికల కోడ్ వల్ల పెట్టలేకపోయారు.

అయితే ఇప్పుడు ఎన్నికలు ముగసిన తర్వాత వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం దేశంలో సాగు రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగాల కల్పన, మూలధన వ్యయాలు, ద్రవ్యోల్పణం, ఆర్థిక ఏకీకరణ లాంటి వాటికి పెద్ద పీట వేయనున్నట్టు తెలుస్తోంది న్ను సమ్మతి భారాన్ని తగ్గించడం కూడా ప్రభుత్వ ఎజెండాలో భాగమని భావిస్తున్నారు. ఇక మోడీ చెప్పిన 100 రోజుల ప్రణాళికలోని అంశాలను పొందుపరిచే అవకాశం ఉంది.

ముగిసిన ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
ఇటలీలో జీ7 దేశాల అవుట్ రీచ్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇటలీ పర్యటనను ముగించుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. జీ7 సదస్సులో వివిధ దేశాధినేతలతో సమావేశమైన మోడీ వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తనకు ఇటలీలో ఘనమైన ఆతిథ్యం లభించిందని వెల్లడించారు.

దీన్నిబట్టి మోడీ ఇటలీ పర్యటన విజయవంతమైనట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తదితరులతో మోడీ అనేక విషయాలపై చర్చించారు. దేశంలో ఎన్డీయే కూటమి మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోడీ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

జీ7 సదస్సులో ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీని ప్రపంచ దేశాల నేతలు అభినందనలు తెలిపారు. ఇటలీ పర్యటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. జీ7 సదస్సు కేంద్రబిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని చెప్పారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించే దిశగా నేతలందరూ ప్రతిన బూనారని తెలిపారు. ఘనమైన ఆతిథ్యం అందించిన ఇటలీ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తెలుగు ఎంపీలు..!
ఈ సారి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరగా.. బీజేపీ పార్టీ తన మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు వరించాయి.

దాంతో నేడు వారంతా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కూడా బాధ్యతలు తీసుకున్నారు.

ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దాంతో వారికి అధికారులు, ఇటు రాజకీయ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దేశంలోనే అతిచిన్న వయస్కుడైన కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు.

అరుణాచల్ సీఎంగా మూడోసారి పెమా ఖండూ ప్రమాణ స్వీకారం
అరుణాచల్‌ప్రదేశ్‌లో మరోసారి బీజేపీ సర్కార్ అధికారాన్ని చేపట్టింది. సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్ ఇవాళ (గురువారం) పెమా ఖండూతో ప్రమాణం చేయించారు. ఈటానగర్‌లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. పెమా ఖండూ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.

వారిలో సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ కూడా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ దివంగత మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడే పెమా ఖండూ. దోర్జీ ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మరణం తర్వాత పెమా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. మొదట కాంగ్రెస్లో పని చేసిన పెమా ఖండూ నబమ్‌ తుకి కేబినెట్‌లో(కాంగ్రెస్‌)లో మంత్రిగా ఉన్నారు.

కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానించనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరమని అభిప్రాయపడ్డారు. అనంతరం చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

మరోవైపు జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌ను ఏక్రగీవంగా ఎన్నకున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ శాసనసభా పక్ష ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. అధిష్టానం ప్రకటనకు కట్టుబడి ఉండాలని సూచించారు. శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొని అభిప్రాయాలను వివరిస్తామని వెల్లడించారు.

ఎన్డీఏ కూటమి తరపున ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పేరును బలపర్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. pic.twitter.com/qdi3BvZTwP

— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024

ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఎక్కడికంటే..?
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా,ప్రధాని మోడీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. గురువారం నుంచి మూడు రోజులు ఆయన ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడీ ఇటలీలో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరవుతారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ సదస్సులో భాగంగా అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, అబుధాబి రాజు షేక్‌ మోహమ్మద్‌ బిన్‌ జాయద్‌, మరి కొందరు అరబ్‌ రాజకుటుంబీకులను మోడీ కలవనున్నారు. మోడీ పర్యటన, సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇటలీలోని భారత రాయబారి ఎస్‌.వాణి రావు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ప్రధానిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన మోడీకి వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు చెప్పనున్నారు. అదేవిధంగా ప్రధానిలో త్వరలోనే బిమ్స్‌టెక్‌, జీ–20, ఆసియన్‌– ఈస్ట్‌ ఆసియా సదస్సులకు హాజరుకానున్నట్లు సమాచారం.