controversy - Vishvambhara News

ఈ సారి ఎంతకాలం జైలులో ఉంటానో తెలియదు...నా తల్లిదండ్రలు జాగ్రత్త : కేజ్రీవాల్
విశ్వంభర, ఢిల్లీ : మరో రెండు రోజుల్లో జైలుకు వెళుతున్నానని, ఈ సారి జైళ్లో ఎంతకాలం ఉంచుతారో తెలియదు. కానీ నేను వచ్చే వరకు పథకాలన్ని కొనసాగుతాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు నాకు 21 రోజుల సమయం ఇచ్చిందని, అది ముగియడంతో ఎల్లుండి నేను తిరిగి తీహార్ జైలుకు వెళ్తాను అని చెప్పారు. ఈసారి నన్ను ఈసారి ఎంతకాలం జైలులో ఉంచుతారో నాకు తెలియదు. కానీ నియంతృత్వం నుండి దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళుతున్నందుకు గర్విస్తున్నానన్నారు.

నేను జైలులో ఉన్నప్పుడు వారు నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. నన్ను జైళ్లో ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని, నా మెడిసిన్ కూడా నిలిపివేశారని, వారు ఎందుకు అలా చేశారో.. వారికి ఏం కావాలో నాకు అర్ధం కాలేదన్నారు. నేను జైలుకు వెళ్లినప్పుడు నా బరువు 70 కిలోలు ఉండగా.. ఇప్పడు 64 కిలోలకు వచ్చిందని, ఈ వ్యక్తులు ఏమి చేశారో నాకు తెలియదు కానీ నేను జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి బరువు పెరగడం లేదని తెలిపారు. డాక్టర్లు పలు రకాల టెస్టులు చేసి.. ఇది శరీరంలో ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతంగా ఉందని తెలిపారని అన్నారు.

ఈ సారి నేను లొంగిపోవడానికి దాదాపు 3 గంటలకు నా ఇంటి నుండి బయలుదేరతానని, ఈసారి వారు నన్ను ఇంకా ఎక్కువగా హింసించవచ్చు, కానీ నేను తలవంచను అని తేల్చి చెప్పారు. నేను ఎక్కడ ఉన్నా.. మీ ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, చికిత్స, 24 గంటల కరెంటు మరియు అనేక ఇతర విషయాలు కొనసాగుతాయని, అలాగే నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రతీ తల్లి, సోదరికి ప్రతి నెల రూ 1000 ఇవ్వడం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఇక ఈ రోజు నేను నా కుటుంబం కోసం మీ నుండి ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని, నా తల్లిదండ్రులు చాలా పెద్దవారు. మా అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. జైలులో ఉన్నా కూడా ఆమె గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నానని, నా తర్వాత నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారి కోసం ప్రార్థించాలని ప్రజలను కేజ్రీవాల్ కోరారు.

మై డియర్ ఫ్రెండ్: సీఎం రేవంత్ రెడ్డిపై రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కలిశాడు. దర్శకుల బృందం వెళ్లి ఈనెల 19న జరిగే డైరెక్టర్స్‌ డే కార్యక్రమానికి రావాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్విట్టర్(X) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు.

మై డియర్ ఫ్రెండ్, ఫైర్ క్రాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానంటూ సీఎంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. అయితే వర్మ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, కేవలం ఆర్జీవీ కాకుండా అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆర్జీవీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటాడు. దీంతో తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తాడన్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ ప్లాట్ కొనుగోలు వివాదంలో ట్విస్ట్..!
ప్లాట్ కొనుగోలు వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు వస్తున్న వార్తలపై ఆయన టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రాపర్టీని ఎన్టీఆర్ 2013లోనే విక్రయించారని తెలిపింది. ఇక నుంచి ఆ ప్రాపర్టీకి సంబంధించిన వార్తల్లో ఆయన పేరును ఉపయోగించకూడదని సూచించింది.

కాగా, హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించినట్లు ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక ల్యాండ్‌కు  సంబంధించిన వివాదంలో హైకోర్టును తారక్ ఆశ్రయించాడని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. అయితే, ఆ భూమిని ఎన్టీఆర్‌కు అమ్మిన వ్యక్తులు 1996లోనే దాన్ని తమ వద్ద తాకట్టు పెట్టి రుణం పొందారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి.

దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు తనకు స్థలాన్ని విక్రయించిన గీతపై పోలీస్ స్టేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమెపై కేసు నమోదైంది. అయితే, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తారక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో తమకు సమయం కావాలని తారక్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో జూన్ 6కు తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ టీమ్ తాజాగా స్పందించింది. ఎన్టీఆర్‌కు సంబంధించి ఇవాళ వచ్చిన వార్తలకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపింది. ఆ ప్రాపర్టీని ఎన్టీఆర్ 2013లోనే విక్రయించారని వెల్లడించింది. ఇక నుంచి ఆ ప్రాపర్టీకి సంబంధించిన వార్తల్లో ఆయన పేరును ఉపయోగించకూడదని సూచించింది.