Khammam - Vishvambhara News

భట్టి అనుచరుల వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్యాయత్నం
Telangana News: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతు జొన్నలగడ్డ మల్లికార్జునరావు తన భూమి విషయంలో కొంతకాలంగా వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు. తన భూమిని రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటామని చెబుతూ, ఇతర భూములను వదిలి తన భూమినే లక్ష్యంగా చేసుకుంటున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు తనను వేధిస్తున్నారని రైతు ఆరోపించారు. తనపై దాడి చేయడంతో పాటు, ఈ విషయంపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. “మా వెనక భట్టి విక్రమార్క ఉన్నాడు.. ఏం పీక్కుంటావో పీక్కో” అంటూ తనను బెదిరించినట్లు రైతు ఆరోపించారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తన భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

తన భూమిని రక్షించాలని, తనపై వేధింపులు, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతు కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. భూ వివాదాన్ని అధికారులు నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను తేల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రైతు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకుల స్పందన తెలియాల్సి ఉంది. భూ సమస్య కారణంగా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

ఖమ్మంలో 'క్యాంపు' రాజకీయం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గెలిచిన అభ్యర్థులు తమ పార్టీని వీడిపోకుండా ఉండేందుకు, ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు 'క్యాంపు రాజకీయాలకు' తెరలేపాయి. ముఖ్యంగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో అధికార పీఠం దక్కించుకునేందుకు ఈ తరహా వ్యూహాలు పన్నుతున్నారు.

సత్తుపల్లిలో కాంగ్రెస్ వ్యూహం
సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగే వరకు అభ్యర్థులను సురక్షితంగా ఉంచాలని నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా, గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను ప్రత్యేక వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా విశాఖపట్నం వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.

కల్లూరుపై ప్రత్యేక ఫోకస్
కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టకుండా ఉండేందుకు, వారిని రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయానికి వీరిని నేరుగా కల్లూరుకు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

చైర్మన్ అభ్యర్థి కోసం ఉత్కంఠ
సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనే దానిపై పార్టీల లోపల తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను బట్టి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అప్పటివరకు కౌన్సిలర్లందరినీ ఐకమత్యంగా ఉంచడం కోసం ఈ క్యాంపు రాజకీయాలు అనివార్యమయ్యాయని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.

ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.