accident - Vishvambhara News

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న విద్యా కేంద్రం అమీర్‌పేటలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవించింది. మైత్రీవనం సమీపంలోని ప్రముఖ వాణిజ్య సముదాయం 'నీలగిరి బ్లాక్' భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలతో ఉలిక్కిపడింది. భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్‌లో ప్రమాదం సంభవించగా, నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ భవనం మొత్తాన్ని కమ్మేసింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో వందలాది మంది విద్యార్థులు భవనం లోపల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

కొనసాగిన సహాయక చర్యలు
కోచింగ్ సెంటర్‌కు వెళ్లే ప్రధాన ద్వారాలు పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బయటకు వచ్చే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది భారీ నిచ్చెనల సహాయంతో భవనం బాల్కనీల ద్వారా విద్యార్థులను కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. భవనం కింద ఉన్న వ్యాపార సముదాయాలు, బిల్డింగ్ చుట్టూ ఉన్న భారీ హోర్డింగ్‌లు అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లేందుకు అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో ఎవరైనా భయంతో కిందకు దూకినా లేదా ప్రమాదవశాత్తూ పడినా గాయాలు కాకుండా ఉండేందుకు భవనం చుట్టూ సేఫ్టీ నెట్లను ఏర్పాటు చేశారు.

విషాదం.. 10 మంది జవాన్ల మరణం!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత సైన్యానికి చెందిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ హృదయవిదారక ఘటనలో 10 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే వీరజవాన్ల మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. భదేర్వా-చంబా రహదారిలోని 'ఖన్నీ' పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 9 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సైనికులతో వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక శిఖరం పైభాగానికి చేరుకున్న సమయంలో మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం ఒక్కసారిగా 200 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందిన వెంటనే సైన్యం, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిన వాహనం నుంచి జవాన్లను వెలికితీయడం క్లిష్టతరంగా మారింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
ప్రమాద స్థలంలోనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారిని అత్యవసరంగా హెలికాప్టర్ల ద్వారా ఉధంపుర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఆరుగురు జవాన్లు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 11 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రముఖుల నివాళులు
ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో మన సైనికులను కోల్పోవడం అత్యంత బాధాకరమని అమిత్ షా పేర్కొన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా జవాన్ల మృతికి సంతాపం ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని వారు పేర్కొన్నారు.

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..
విశ్వంభర, బ్యూరో:  స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ హైస్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు తప్పడమే కాకుండా, పక్కనే ఉన్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో 20 మంది మరణించగా, సుమారు 73 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం అందిన సమాచారం మేరకు, హైస్పీడ్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. పట్టాలు తప్పిన వేగంలో ఆ రైలు పక్కనే ఉన్న మరో రైలును ఢీకొట్టడంతో బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రతకు బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కి భీతావహ దృశ్యం కనిపించింది.

సహాయక చర్యలు ముమ్మరం..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది. గాయపడిన 73 మందిని అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని.. సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పెయిన్ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఉపాధ్యాయ లోకంలో తీరని విషాదం: విధులకు వెళ్తుండగా ఇద్దరు టీచర్ల మృతి
విశ్వంభర, క్రైం న్యూస్: సంక్రాంతి సెలవులు ముగించుకుని, కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టిన ఆ ఉపాధ్యాయులను విధి వంచించింది. పాఠశాల గడప తొక్కకముందే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కబళించింది. నల్లగొండ జిల్లా కేంద్రం నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి విధులకు హాజరయ్యేందుకు వస్తున్న నలుగురు ప్రధానోపాధ్యాయుల కారు జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి) వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

శనివారం ఉదయం నల్లగొండ నుంచి తుంగతుర్తి మండలానికి టీచర్లు తమ కారులో బయలుదేరారు. జాజిరెడ్డిగూడెం సమీపంలోకి రాగానే ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు తుంగతుర్తి కేజీబీవీ (KGBV) స్పెషల్ ఆఫీసర్ మామిడాల కల్పన  అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రావులపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు గీతారెడ్డి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు.

ఒకే కుటుంబంలో ఇద్దరికి గాయాలు

ఈ ప్రమాదంలో తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అల్వాల ప్రవీణ్ కుమార్, అన్నారం జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అల్వాల సునీత  తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ స్వయానా అక్కాతమ్ముడు. ప్రస్తుతం వీరు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే ప్రమాదంలో అక్కాతమ్ముడు గాయపడటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరణించిన గీతారెడ్డి, తుంగతుర్తి ఆర్ఐ రవీందర్ రెడ్డికి దగ్గరి బంధువు అని తెలిసింది.

కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థులు

సెలవుల తర్వాత తమ పాఠశాలకు వస్తున్న సార్లకు ప్రమాదం జరిగిందని తెలియగానే విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారం రోజుల క్రితం తమతో కలిసి నవ్వుతూ గడిపిన వారు ఇప్పుడు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తుంగతుర్తి మండలంలోని నాలుగు పాఠశాలల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అధికారుల పరామర్శ..
ఈ విషయం తెలియగానే జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) అశోక్, సెక్టోరియల్ అధికారులు రాంబాబు, శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కదులుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
విశ్వంభర ఇంటర్నేషనల్ బ్యూరో: థాయ్‌లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని సిఖియో జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం పనులు జరుగుతున్న సమయంలో, ఒక భారీ క్రేన్ అదుపుతప్పి పక్కనే ఉన్న పట్టాలపైకి జారిపడింది. ఆ సమయంలో పట్టాలపై వెళ్తున్న ప్రయాణికుల రైలుపై ఆ క్రేన్ పడటంతో ఒక్కసారిగా బోగీలు పట్టాలు తప్పాయి.

ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్రేన్ పడిన ధాటికి కొన్ని బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే థాయ్ పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో బోగీలను తొలగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు పనుల్లో భద్రతా లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

విజయవాడ హైవేపై లారీ బీభత్సం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని బాటసింగారం వద్ద ఓ లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ ఘటనతో విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి ఇనామ్‌గూడ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్తుండటంతో, ఈ ప్రమాదం ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

రంగంలోకి పోలీసులు
సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో బోల్తా పడిన లారీని పక్కకు తొలగించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని లేదా ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

బస్సు ఎక్కుతుండగా ప్రమాదం.. నుజ్జునుజ్జయిన మహిళ కాళ్లు
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండు కాళ్లను పోగొట్టుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత అనే మహిళ ఆర్మూర్ వెళ్లేందుకు నిజామాబాద్ బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడ బస్సు ఆపమంటూ వెనుక నుంచి ఆ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఆమెను గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు.

ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చి కదులుతున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ కిందపడిపోయింది. బస్సు అలాగే ముందుకు కదలడంతో అదే బస్సు వెనుక చక్రాల కిందపడి సదరు మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాయాలపాలైన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.