RTC BUS - Vishvambhara News

శివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ ధమాకా!
విశ్వంభర,తెలంగాణ బ్యూరో: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు టీజీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు అందించింది. శివయ్య దర్శనం కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది ప్రయాణికుల కోసం ఏకంగా 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ స్పెషల్ ఆపరేషన్ కొనసాగనుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 208 బస్సులను కేటాయించడం విశేషం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా అసౌకర్యం కలగకుండా సంస్థ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి ఉన్నతాధికారులతో కలిసి భారీ ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలం నుంచి కీసర దాకా..

రాష్ట్రంలోని 43 ప్రధాన శైవక్షేత్రాలను అనుసంధానిస్తూ ఈ బస్సులను నడపనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని మల్లికార్జున స్వామి సన్నిధి (శ్రీశైలం)కి వెళ్లే భక్తుల కోసం అత్యధికంగా 781 బస్సులను కేటాయించారు. అలాగే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు 416, మెదక్ జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ఏడుపాయలకు 249, హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్టకు 326 బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని కొమురవెల్లి, కాళేశ్వరం, రామప్ప, ఉమామహేశ్వరం వంటి ఆలయాలకు కూడా ప్రత్యేక సర్వీసులు నిరంతరం నడవనున్నాయి.

మహిళలకు శుభవార్త..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఈ ప్రత్యేక బస్సుల్లోనూ వర్తించనుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు తమ ప్రాంతం నుంచి శైవక్షేత్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, ప్రయాణ సమయంలో మహిళలు విధిగా ‘జీరో టికెట్’ తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. దూరప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం శ్రీశైలం బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా తమ సీట్లను ముందే బుక్ చేసుకోవచ్చు.

చార్జీల సవరణ.. స్పెషల్ సర్వీసులకు మాత్రమే

ప్రభుత్వ జీవో ప్రకారం, పండుగ రద్దీని తట్టుకునేందుకు నడిపే ప్రత్యేక బస్సుల్లో చార్జీలను కొంతమేర సవరించారు. రెగ్యులర్ సర్వీసుల్లో సాధారణ చార్జీలే ఉండగా, ఈ మూడు రోజులు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రం 1.5 రెట్లు (ఒకటిన్నర రెట్లు)అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. ఏడుపాయల జాతర దృష్ట్యా అక్కడికి వెళ్లే బస్సుల్లో 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. భక్తులకు ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసేందుకు 040-69440000, 040-23450033 కాల్ సెంటర్ నంబర్లను నిరంతరం అందుబాటులో ఉంచారు.

క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా..

ప్రతి బస్సు ముందు భాగంలో భక్తులకు స్పష్టంగా కనిపించేలా డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. అవసరమైతే మరిన్ని బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని రీజినల్ మేనేజర్లకు ఎండీ నాగిరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్‌కింద పడి ఇద్దరు దుర్మరణం
ఆర్టీసీ బస్ కిందపడి వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. ఆర్టీసీ బస్‌కింద పడి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్‌ పరిధి యూసుఫ్ గూడా బస్టాండ్‌ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్ గూడాలోని మాస్టర్స్ కాలేజీలో మెహరీన్ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.

శుక్రవారం ఉదయం బస్సు నిండా ప్రయాణికులతో నిండిపోగా బస్సు ముందు భాగంలో ఫుట్‌బోర్డుపై నిలబడింది. ఈ క్రమంలో బస్సు దిగడానికి ప్రయత్నించడంతో మూలమలుపు వద్ద విద్యార్థిని అదుపుతప్పి కిందపడిపోయింది. బస్సు వేగంగా వెళ్తుండటంతో డ్రైవర్ గమనించేలోపే ఘోరం జరిగింది. ఫుట్ బోర్డు పైనుంచి జారిపడగా బస్సు చక్రాల కిందపడి మెహరీన్‌ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది.

సీసీటీవీ ఫుటేజ్

మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం.

యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి pic.twitter.com/wkiW7kmEla

— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024

ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మరో ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రుద్రంగి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్‌. మరో యువకుడు అభికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ఆపలేదని రోడ్డుకు అడ్డంగా కూర్చుని మహిళ నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రధాన్యత కల్పిస్తూ కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కాంగ్రెస్ అధినేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఆర్టీసీ అధికారులు సైతం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని ఎంతో సజావుగా నిర్వహిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు.

చేయి ఎత్తి బస్సు ఎక్కడ ఆపినా మహిళలకు ఎక్కించుకోవాలని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా ఎక్కడో ఒక చోట మహిళలు బస్సు ఆపితే ఆపకుండా వెళ్లిపోతున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. దీంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వరంగల్‌లో జరిగింది. బస్సు ఆపలేదని ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎక్కింది. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగింది. అయితే బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. ఆర్టీసీ అధికారులు ఇకనైనా ఆర్టీసీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.