JanaSenaParty - Vishvambhara News

నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. కాగా, తాజాగా పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

కాగా, పవన్ కల్యాణ్ షేర్ చేసిన వీడియోలో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి తన ఛాంబర్‌కు వచ్చి పూజలు నిర్వహించడం, పలు ఫైల్స్మీద సంతకాలు చేయడంతో పాటు పలువురు అధికారులకు ఆయన అభివాదం చేయడం చూపించారు. ప్రస్తుతం ఈ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అదేవిధంగా పవన్ కల్యాణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను' అని పవన్ వీడియోలో పేర్కొన్నారు.

పవన్ అనే నేను.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మొదటిసారే మంత్రికాబోతున్నారు. దాంతో జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్‌ స్టేజి మీద ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఫ్యాన్స్ అరుపులతో ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.

అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. అయితే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినా.. మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇక పవన్ కల్యాణ్‌ తో పాటు జనసేన నుంచి మరో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్‌ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ లు ప్రమాణ స్వీకారం చేశారు.