Jr. NTR Approached High Court - Vishvambhara News

హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్.. కారణం ఏంటంటే?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద ఒక ప్లాట్ కొన్నారు. అయితే, ఆ ప్లాట్‌పై ఆమె అప్పటికే లోన్ తీసుకున్న విషయాన్ని దాచిపెట్టారు. దీంతో ప్లాట్‌ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆయనకు వ్యతిరేకంగా డీఆర్‌టీ రావడంతో ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే, ఆ భూమిని ఎన్టీఆర్‌కు అమ్మిన వ్యక్తులు 1996లోనే దాన్ని తమ వద్ద తనఖా పెట్టి రుణం పొందారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి.

దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు తనకు స్థలాన్ని విక్రయించిన గీతపై పోలీస్ స్టేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమెపై కేసు నమోదయింది. అయితే, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తారక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో తమకు సమయం కావాలని తారక్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో జూన్ 6కు తదుపరి విచారణను వాయిదా వేసింది.