ys jagan mohan reddy - Vishvambhara News

ఆగస్టు 5న దేవరపల్లిలో జగన్ పర్యటన.. పొగాకు రైతులతో ముఖాముఖి
YS Jagan Mohan Reddy: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగస్టు 5న పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్ తెలిపారు. ఈ సందర్భంగా పొగాకు రైతులను నేరుగా కలిసి వారి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను తెలుసుకోనున్నారని చెప్పారు. పొగాకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, వారి తరఫున ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకే జగన్ పర్యటన చేపడుతున్నారని పేర్కొన్నారు.

గుడివాడ అమర్ మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర రూ.450 వరకు పలికేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో అదే కిలో పొగాకు రూ.170కే పరిమితమైందని విమర్శించారు. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకపోగా, ప్రతి కిలోపై రూ.100 నుంచి రూ.150 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో కర్ణాటకలో పొగాకు సీజన్ ప్రారంభమవుతుందని, వ్యాపారులు అటువైపు మళ్లిపోయే ప్రమాదం ఉందని గుడివాడ అమర్ హెచ్చరించారు. అలా జరిగితే ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, పొగాకు కొనుగోళ్లకు అనుకూల పరిస్థితులు కల్పించాలని ఆయన కోరారు.

Viral Video: ‘జగనన్నను సీఎం చేయాలి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటా’
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే జగన్ ఓటమిని ఆ పార్టీ నేతలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో  ఓ యువకుడు జగన్ ఓటమిపై విచారణ జరపాలని, జగన్‌ను మళ్లీ సీఎంను చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తన భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు.

ఆ యువకుడి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు యువకుడు ఇలా మాట్లాడాడు ‘నా లాంటి పేదలకు జగనన్న ఎంతో మేలు చేశాడు. ఎంతోమందికి ఉపకారం చేసిన వ్యక్తి ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటీ? ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, మరొకటని.. ఇలా ఏవేవో అంటున్నారు. ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ మాకు న్యాయం జరగాలి. జగనన్న మళ్లీ సీఎం కావాలి.  లేదంటే భార్యా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటా. అలా కాకుండా తమను కాపాడేందుకు ఎవరైనా బ్రిడ్జిపైకి వస్తే గోదావరిలో దూకేస్తా. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ఎన్నికల ఫలితాలపై విచారణ జరిపించి న్యాయం చేయాలి. ఈ వీడియో జగనన్న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పెద్దలందరికీ చేరాలి’ అంటూ కోరాడు. సదరు వ్యక్తిది బ్రాహ్మణగూడెం అని, అతడు జగన్‌కు వీరాభిమాని అని సమాచారం.

జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా

కొవ్వూరు - అసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి… pic.twitter.com/jJvrbr3j48

— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024