thapana Movie OTT telugu movie ott release date videos - Vishvambhara News

విడుదలైన రెండు వారాలకే.. ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’
ఈ మధ్య టాలీవుడ్ సినిమాలు థియేటర్లలో ఒక వారం కంటే ఎక్కువ ఆడటంలేదు. అందులోనూ ఎన్నికల బిజీలో థియేటర్‌కు వెళ్లి ఎవరూ సినిమాలు చూడని పరిస్థితి. ఎన్నికల వేళ వారం రోజుల పాటు థియేటర్లు మూతపడి తిరిగి తెరుచుకున్నారు. ఈ క్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన న్యూ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31న థియేటర్లలోకి వచ్చింది.

అయితే సినిమా టాక్ బాగానే ఉన్నా బాక్సాఫీస్ మాత్రం వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 14న ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సినిమాకు సంగీతం అందించారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా రావడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. అయితే, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా విశ్వక్ సేన్ నటన బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. 90ల్లో గోదావరి జిల్లాలోని ఓ లంక ప్రాంతంలో జరిగే కథగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెరకెక్కించారు. ఒక యువకుడు రాజకీయాలను వాడుకుని ఎలా పైకి ఎదిగాడు అనేది సినిమా కథ.