Rohithsharma - Vishvambhara News

విమానంలో ట్రోఫీతో ఆట‌గాళ్ల సెల‌బ్రేష‌న్స్ ...వీడియోను పంచుకున్న బీసీసీఐ
13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఐసీసీ ట్రోఫీ గెల‌వ‌డంతో టీమిండియా ఆట‌గాళ్ల ఆనందానికి అవ‌ధుల్లేవు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత మైదానంలో ఓ రేంజ్‌లో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ఇక బెరిల్ తుపాను కార‌ణంగా గ‌త శనివారం నుంచి  బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భార‌త జ‌ట్టు ఎట్ట‌కేల‌కు స్వ‌దేశానికి చేరుకుంది. ఇవాళ ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ఎయిరిండియా విమానంలో ఆట‌గాళ్లు, వారి కుటుంబ స‌భ్యులు, సిబ్బంది, మీడియా ప్ర‌తినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆట‌గాళ్ల‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అయితే, విమానంలో టీమిండియా ప్లేయ‌ర్లు చేసిన సెల‌బ్రేష‌న్స్ తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్‌తో వీడియో మొద‌లైంది. విమానంలో రోహిత్ చేష్టలు చాలా ఫ‌న్నీగా ఉన్నాయి. ఆ త‌ర్వాత ట్రోఫీతో విరాట్ కోహ్లీ, జ‌స్ప్రీత్ బుమ్రా, రిష‌భ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్, సూర్య‌కుమార్ దంప‌తులు క‌నిపించారు.

ఈ క్ర‌మంలో పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ట్రోఫీని చేతిలో ప‌ట్టుకుని మాట్లాడాడు. "చాలా ఆనందంగా ఉంది. ఇది (వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీ) చేతిలోకి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఎన్నో రోజులు వేచి చూశాం. ఎట్ట‌కేల‌కు దీన్ని సాధించాం. ఈ ఆనందం మాటల్లో చెప్ప‌లేను" అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాగా, భార‌త జ‌ట్టు స‌భ్యులు మొద‌ట ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక విమానంలో ముంబైకి బ‌య‌ల్దేరుతారు. ముంబైలో విక్ట‌రీ ర్యాలీ త‌ర్వాత వాంఖ‌డే స్టేడియంలో ఆట‌గాళ్ల‌ను బీసీసీఐ ప్ర‌త్యేకంగా స‌న్మానించ‌నుంది.

Jubilation in the air 🥳

The #T20WorldCup Champions have arrived in New Delhi! 🛬

Presenting raw emotions of Captain @ImRo45 -led #TeamIndia's arrival filled with celebrations 👏👏 pic.twitter.com/EYrpJehjzj
— BCCI (@BCCI) July 4, 2024

టీ20ల్లో గెలవాలంటే 50, 100లు అక్కర్లేదు: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్ దిశగా దూసుకెళ్తోంది. సూపర్-8లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలకు మరింత దగ్గరగా వెళ్లింది. బంగ్లాదేశ్‌ను 50 పరుగుల తేడాతో చిత్తు చేసి గ్రూప్-1లో అగ్రస్థానంలోకి నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిక్యంతో బంగ్లాను చిత్తు చేసింది. అయితే, ఈ విజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘బ్యాటింగ్ చేసేటప్పుడు దూకుడు ప్రదర్శించడంపై ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ఇలా ఆడాల్సి ఉంటుంది. జట్టులో ప్రతీఒక్కరు అద్భుతంగా ఆడారు. పరిస్థితులకు త్వరగా అలవాటుపడి మంచి ప్రదర్శనను చూపారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉంది.  బ్యాటింగ్, బౌలింగ్‌లో స్మార్ట్‌గా ఆలోచించాం. ఎనిమిది మంది బ్యాటర్లు బరిలోకి దిగడం కూడా కలిసొచ్చింది. అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు.

జట్టులో ఒకరు హాఫ్ సెంచరీ చేయడంతో బంగ్లా ముందు 197 పరుగుల లక్ష్యం ఉంచగలిగాం. టీ20ల్లో ఎక్కువగా ఫిఫ్టీ(50)లు, సెంచరీ(100)లు అవసరం లేదనుకుంటా. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తే పరుగులు సులువుగా వస్తాయి. జట్టులో ఎక్కువ అనుభవమున్న ప్లేయర్లే ఉన్నారు. పాండ్య బ్యాటింగ్‌లో మెరిస్తే మాదే పైచేయి అవుతుందని గత మ్యాచ్ సమయంలోనే వెల్లడించా. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌తో కలిసి పరుగులు చేసే బాధ్యతను పాండ్య తీసుకున్నాడు. బౌలర్‌గానూ మాకు అత్యంత కీలకమైన ప్లేయర్. కుల్దీప్, బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

సూపర్-8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించి గ్రూప్-A నుంచి భారత్ సూపర్ -8లోకి అడుగు పెట్టింది. యూఎస్ఏతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల టార్గెట్‌ను ఛేదించి ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన గెలిచి రెండో స్టేజ్‌కు చేరుకుంది. కాగా, సూపర్-8 కు చేరుకోవడం టీమిండియాకు బిగ్ రిలీఫ్ అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కఠినమైన పిచ్‌పై సూర్యకుమార్ (50*), శివమ్ దూబె (31*) పరిణతి కనబరిచారని టీమ్ ఇండియా రోహిత్ వ్యాఖ్యానించాడు.

అదేవిధంగా యూఎస్ఏకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత మూలాలు కలిగిన క్రికెటర్లను మెచ్చుకున్నారు. గతేడాది ఎంఎల్సీ (మేజర్ లీగ్ క్రికెట్)లో వారి ఆటను చూశామని నిరంతరం మెరుగవుతూ ఉన్నారని తెలిపాడు. ఈ మ్యాచ్ అత్యంత క్లిష్టంగా ఉంటుందని తెలుసని ఏక్షణమైనా ఫలితం మారవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పిచ్‌పై 110+ స్కోర్‌ అయినా మంచి లక్ష్యమే అవుతుందని తెలిపాడు. అయితే, సూర్యకుమార్‌తో పాటు శివమ్ దూబె కీలక భాగస్వామ్యం నిర్మించడంతో మ్యాచ్‌పై పట్టు సాధించగలిగామని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లోనూ చివరి వరకూ పోరాడామన్న రోహిత్ ఆత్మవిశ్వాసంతో రెండో స్టేజ్‌కు వెళ్లగలిగామని చెప్పుకొచ్చాడు. తక్కువ స్కోరు నమోదైనప్పటికీ బౌలర్లదే పైచేయి అవుతుందన్నారు. కాసేపు ఆచితూచి ఆడాల్సి ఉంటుందని, సూర్య, దూబె అదే చేశారని తెలిపాడు. యువ బౌలర్ అర్ష్దీప్ మరోసారి తన సత్తా చాటాడని, బౌలింగ్ మరిన్ని ఆప్షన్లు ఉండటం మంచిదేనని తెలిపాడు. అందుకే ఈసారి దూబెతో బౌలింగ్ చేయించామన్నాడు.

హైఓల్టేజీ సమరానికి సై.. నేడే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్
క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఇవాళ(ఆదివారం) ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాదులు పోరుకు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీకి కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ స్టేడియం వేదికైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ హైఓల్టేజీ సమరాన్ని చూసేందుకు అభిమానులు తగ్గేదే లే అంటున్నారు. టిక్కెట్ల భారీ ధరను భారీగా పెంచినప్పటికీ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్టేడియానికి చేరుకుంటున్నారు. 34,000 ప్రేక్షకుల సామర్థ్యం కలిగి ఉన్న ఈ స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన అదే దూకుడు మీద ఉండగా పాక్ జట్టు యూఎస్‌తో జరిగిన మ్యాచ్‌తో నిరాశలో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే టీమిండియా సూపర్ 8 కి దూసుకెళ్లే అవకాశముంది.

ప్రపంచ కప్‌లో దాయాదిపై ఉన్న గెలుపు రికార్డును కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే టీమిండియా జట్టులో అక్షర్ బదులుగా కుల్దీప్ రానున్నట్లు సమాచారం. టీమిండియా: రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్ లేదా కుల్దీప్, బుమ్రా, అర్దీదీప్, సిరాజ్. పాకిస్థాన్: బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఉస్మాన్, జమాన్, ఆజమ్, ఇఫ్రికార్, షాదాబ్ లేదా ఆయూబ్, ఆఫ్రిది, నసీమ్, ఆమిర్, రవూఫ్ లు ఉండవచ్చని అంచనా.