Parliament - Vishvambhara News

వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, మూడోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయాలు, పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. దేశం ప్రస్తుతం సంస్కరణల పథంలో దూసుకుపోతోందని ఆమె ఉద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. గత 10-11 ఏళ్లలో భారత్ ప్రతి రంగంలోనూ తన పునాదులను పటిష్టం చేసుకుందని, 2026 సంవత్సరం 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) దిశగా సాగే ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

మహిళల ఆధారిత అభివృద్ధి దిశగా
గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని.. 10 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. 1.80 లక్షల ఆయుష్మాన్ భారత్ కేంద్రాల ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. మహిళల ఆధారిత అభివృద్ధి దిశగా భారత్ ముందుకెళ్తోందని రాష్ట్రపతి చెప్పారు. నేడు రెండు కోట్ల మందికి పైగా మహిళలు లక్ పతి దీదీలుగా ఎదిగారని చెప్పారు. ఈ దశాబ్దం ముగిసే నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారత్ ఖచ్చితంగా సాధిస్తుందని రాష్ట్రపతి ధీమా వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో 7,200 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించామని తెలిపారు. దీనివల్ల మారుమూల కొండ ప్రాంతాలు, గిరిజన, సరిహద్దు ప్రాంతాలకు రవాణా సౌకర్యం సులభతరమైందని పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముర్ము తెలిపారు. వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా 125 రోజులు పనిదినాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టడంతో పాటు, నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ఈ చట్టం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని, రైతులకు, పశుపోషకులకు, మత్స్యకారులకు కొత్త వసతులను కల్పిస్తుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం 150 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని కితాబిచ్చారు. ఏయే పంటల ఉత్పత్తిలో అయితే వ్యవసాయ రంగం వెనుకబడి ఉందో, వాటి ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ముఖ్యంగా తినే నూనెలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలపై చేపట్టిన 'జాతీయ మిషన్ల' ద్వారా దిగుమతులను తగ్గించి, భారత్‌ను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.

ఆత్మనిర్భర్ భారత్ & రక్షణ రంగం
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాలు దేశ గమనాన్ని మార్చేశాయని రాష్ట్రపతి కొనియాడారు. ఉత్పత్తి రంగంలో తీసుకొచ్చిన కీలక సంస్కరణలతో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయని తెలిపారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఆదాయపన్ను శాఖలో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని రాష్ట్రపతి ముర్ము వివరించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మంచి ఫలితాలను అందుకుంటుందని తెలిపారు. డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తూ కొత్త అవకాశాలను కల్పిస్తోందని రాష్ట్రపతి తెలిపారు. గతేడాది భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' మన సత్తాను ప్రపంచానికి చాటిందని, భారత్‌పై దాడి చేస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపితమైందని ఆమె పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ తర్వాత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని వెల్లడించారు.

చారిత్రక ఘట్టం వైపు అమరావతి
విశ్వంభర, ఏపీ బ్యూరో:  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. తొలుత కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ప్రకటించనున్నారు.

విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. 2024 జూన్ 2తో హైదరాబాద్‌పై ఏపీకి ఉన్న హక్కుల గడువు ముగిసింది.ఈ నేపథ్యంలో తమ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చింది. జూన్ 2, 2024 నుంచే అమరావతిని రాజధానిగా పరిగణించాలని రాష్ట్రం కోరగా, కేంద్రం కూడా ఇందుకు సానుకూలంగా స్పందించింది.

కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలను సేకరించిన హోంశాఖ.. పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖల తుది నివేదికల కోసం వేచి చూస్తోంది. ఈ బిల్లు రూపకల్పనలో నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. అన్ని శాఖల నుంచి సానుకూల నివేదికలు అందగానే, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు హోంశాఖ తుది నోట్‌ను సిద్ధం చేయనుంది.

ఏపీ ప్రభుత్వ నోట్ కీలకం
అమరావతిలో ఇప్పటికే జరిగిన నిర్మాణ పనులు, రాజధాని ఎంపిక ప్రక్రియ, రైతుల భూసేకరణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లోతైన వివరాలు కేంద్రానికి కీలక ఆధారాలుగా మారాయి. కేంద్ర గుర్తింపు లభిస్తే, అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు, కేంద్ర గ్రాంట్ల రాక మరింత సులభం కానుంది. కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదిస్తే, ఇకపై అమరావతికి ఎదురుండదని రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధమైన రాజధానిగా అమరావతికి ముద్ర పడితే, ఏపీ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.

అమిత్ షాతో ఈటల భేటీ.. అధ్యక్షపదవి ఖాయమేనా..?
ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్ కే ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సోమవారం నాడు అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా భేటీ కావడం సంచలనం రేపుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ విషయం తాను ఎలా చెప్పగలను అన్నారు.

పార్టీ అధిష్టానం ఆ విషయాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయన మాటలను బట్టి పార్టీ పగ్గాలు ఆయనకే ఇవ్వబోతున్నారని అర్థం అవుతోంది. తెలంగాణ నుంచి ఒక్క ఈటలతో మాత్రమే అమిత్ షా భేటీ అయ్యారు. అంటే కచ్చితంగా ఆయనకే పార్టీ పగ్గాలు అని.. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి చొరబడే యత్నం.. ముగ్గురి అరెస్ట్
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ రోజు(జూన్4) ఢిల్లీలో అనూహ్య పరిణామం జరిగింది. ముగ్గురు దుండగులు నకిలీ ఆధార్ కార్డుతో  పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. వారిని అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పార్లమెంట్ భవనం వద్ద గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ అనే ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.

జూన్ 4వ తేదీన మధ్యాహ్నం 1.30గంటలకు ఈ ఘటన జరగగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది అతని ఆధార్ కార్డును తనిఖీ చేయగా సిబ్బందికి వారికి అనుమానం వచ్చింది. విచారణ అనంతరం ఆధార్ కార్డు నకిలీదని తేల్చారు. అనంతరం ఆ ముగ్గురిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఈ ఘటన తర్వాత పార్లమెంట్ హౌస్ భద్రత బాధ్యతను సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోపల ఎంపీ లాంజ్ నిర్మాణ పనుల కోసం ముగ్గురు కూలీలను నియమించినట్లు సమాచారం. గత డిసెంబర్ నెలలోనూ దుండగులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో భద్రతాసిబ్బంది అప్రమత్తమైంది. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.