sdrf dispatches team to rescue - Vishvambhara News

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి
హిమాలయ పర్వతాల్లో విన్యాసాలు చేస్తుండగా విషాదం మిగిలింది. ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహస్రతల్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది మంచులో చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకకు చెందిన 18మంది ట్రెక్కర్లు ముగ్గురు స్థానిక గైడ్‌లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో టెక్కింగ్ చేస్తున్నారు. సుమారు 4,100-4400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద వారు ఈ విన్యాసం చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి వారు మంచులో చిక్కుకుపోయారు. వారిలో తొమ్మిది మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు.

అటవీశాఖకు చెందిన పది మంది సభ్యుల రెస్క్యూ టీమ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందం బుధవారం తెల్లవారుజామున ఉత్తరకాశీ నుంచి బయల్దేరాయన్నారు. ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రి, భట్వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. 14మంది రక్షణ సిబ్బంది, ఓ వైద్యుడిని ఘటనాస్థలానికి పంపామని చెప్పారు. క్షతగాత్రులను వెంటనే తరలించడానికి హెలికాప్టర్, అంబులెన్స్‌లను సిద్ధం చేశామన్నారు.