Telangana Assembly - Vishvambhara News

తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు.. గాయాలను పరిశీలించిన హరీశ్‌రావు
KTR, Harish Rao Arrest,: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్ల దుస్తులు ధరించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీలోకి అనుమతించకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు తెలంగాణ భవన్‌కు తరలించారు. అనంతరం కేటీఆర్‌, హరీశ్‌రావును కూడా అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా కేటీఆర్‌కు గాయాలయ్యాయని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీశ్‌రావు.. కేటీఆర్‌ గాయాలను పరిశీలించారు.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపేందుకు వచ్చిన తమ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధులను ఇలా అడ్డుకోవడం సరికాదని బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసుల చర్యలు, కేటీఆర్‌కు గాయాలైన ఘటనపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారు.. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
Telangana Assembly BRS: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసన చేపట్టారు. గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వైపు నిరసనగా బయలుదేరిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, 1000 రోజుల పాలనలో ప్రజలకు చెప్పుకోదగ్గ ఫలితాలు లేవని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అవమానకరంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసులు ఆమె చీర పట్టుకుని లాగారని, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల దుస్తులు, టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడంలో తప్పేముందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కిందపడిపోయారని, ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి కాలికి గాయమైందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే పోలీసుల చర్యలపై పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

అసెంబ్లీ సమావేశాలను కేవలం తూతూమంత్రంగా నిర్వహించకుండా కనీసం నెల రోజుల పాటు నిర్వహించి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించేలా స్పీకర్ చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయని, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వారి సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తుతామని తెలిపారు. అలాగే 22ఏ పేరిట జరుగుతున్న వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో వైఫల్యాలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

అసెంబ్లీలో కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం ...వీడియో ఇదిగో
విశ్వంభర హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ ఆయనను పలకరించి అభివాదం చేశారు.

రెండు నిమిషాల తర్వాత వెళ్లిపోయిన కేసీఆర్

అసెంబ్లీ సమావేశాల తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సభలో ఉన్నది కేవలం రెండు నిమిషాలు మాత్రమే.

‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాల్లో ఏడింటికి బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచీ ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నానని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్ రావు తమ పార్టీ ఓట్లను రఘునందన్ రావుకు వేయించారని దుయ్యబట్టారు.

తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు ఎప్పటికీ ఆగవని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ రాజకీయ జూదగాడు అంటూ సెటైర్ వేశారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌తో కలిసి మోడీ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే మహారాష్ట్ర ఫలితాలే వస్తాయని హెచ్చరించారు. అక్కడ మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చితే మోడీ తలెత్తుకోలేని ఫలితాలను ప్రజలు ఇచ్చారని వెల్లడించారు. మోడీని దేశ ప్రజలు తిరస్కరించారని, ఒక్క వ్యక్తి పేరుతో ‘మోడీ గ్యారంటీ’ అనిచెప్పడం వల్లే బీజేపీకి మెజార్టీ రాలేదని స్పష్టం చేశారు.

అందుకే ఎన్డీయే కూటమిలోని మరో వ్యక్తిని ప్రధాని చేయాలని బీజేపీకి సూచించారని రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే మోదీని తన పదవికి రాజీనామా చేయాలని ఎన్డీయే నేతలు కోరాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బూడిదే మిగిలిందని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఏపీ ఫలితాలపై రేవంత్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, జగన్ స్వాగతించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాన‌ని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గుర్తుచేశారు.