cm revanth reddy - Vishvambhara News

22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ప్రైవేటు భూముల యజమానులకు గుడ్‌న్యూస్
CM Revanth Reddy: 22ఏ భూముల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రైవేటు భూముల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన భూముల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రైవేటు భూములు 22ఏ జాబితాలో ఉన్నట్లు తేలితే వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, అర్హత ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులను ఆదేశించారు.

22ఏ భూములకు సంబంధించిన అంశాలపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రెండు రోజుల్లో సంబంధిత భూములను పరిశీలించి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, ఇతర వివాదాస్పద భూములను స్పష్టంగా గుర్తించి రికార్డులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు భూమి అని నిర్ధారణ అయితే యజమానులకు ఎలాంటి అనవసర ఇబ్బందులు లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

22ఏ భూముల వ్యవహారంలో ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. భూముల సమస్యల పరిష్కారం పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆస్తి హక్కును పరిరక్షించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. 22ఏ భూములపై వస్తున్న వదంతులు, కట్టుకథలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. వాస్తవాలను అధికారికంగా తెలుసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. 22ఏ జాబితాలో ఉన్న భూములపై రెవెన్యూ అధికారుల పరిశీలన పూర్తయిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై ఆసక్తి.. ఈ నెల 30 వరకు కీలక పర్యటన
Revanth Reddy Foreign Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈరోజు రాత్రి ఆయన 76వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న అనంతరం రేపు అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటన ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది.

విదేశీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు దేశాల్లో పర్యటించి పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల తీసుకురావడం వంటి అంశాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను విదేశీ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంది.

అలాగే విదేశీ పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

ఇక ఢిల్లీ పర్యటన కూడా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. 76వసారి ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి.. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలు, పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పెండింగ్ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ఆయన పర్యటించనున్న దేశాలు, అక్కడ నిర్వహించనున్న సమావేశాలు, పాల్గొనే కార్యక్రమాలపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఈరోజు రాత్రి ఢిల్లీ.. రేపు విదేశీ పర్యటన.. ఈ నెల 30 వరకు టూర్ కొనసాగనుండటంతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

లక్ష మంది తో సంగారెడ్డి లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ
విశ్వంభర,హైదరాబాద్ : ఈనెల 15న సంగారెడ్డిలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సచివాలయంలోని తన ఛాంబర్‌లో నీటిపారుదల, పౌర సరఫరా శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, మంత్రి దామోదర రాజనర్సింహ వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండటం వల్ల ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు.ఈ సందర్భంగా సభకు భారీ జన సమీకరణ, వేదిక ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డికి చేరుకుంటారని, సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డి లో  ఉంటారని నేతలు వెల్లడించారు.

సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని, జన సమీకరణ, భద్రత, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్, జగ్గారెడ్డి అధికారులకు సూచించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుండి నియోజకవర్గానికి ఒకరు చొప్పున, మొత్తం పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపైనే స్వయంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారని మంత్రి తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌కు సూచించారు. సుమారు లక్ష మంది జనంతో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది
Telangana CM RevanthReddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో 6E717 విమానానికి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వెంటనే ల్యాండింగ్ క్లియరెన్స్ లభించలేదు.

దీంతో పైలట్ విమానాన్ని తిరిగి పైకి ఎగరేసి సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. అనంతరం వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. తర్వాత విమానం శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది.

నిరూపించే ద‌మ్ముందా? కాంగ్రెస్ కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ యువజన సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ, ఉస్మానియా విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు, యూత్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ హామీలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను నిలదీశారు. కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ యువజన సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సభకు భారీగా తరలివచ్చిన యువత, నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తెలంగాణ యువతలో అపారమైన శక్తి, ప్రతిభ, పోరాట స్ఫూర్తి ఉందని అన్నారు. యువతకు పొట్ట నిండా ఆకలి మాత్రమే కాదని, భవిష్యత్తును నిర్మించుకోవాలనే తపన ఉందని పేర్కొన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని సాధించే సత్తా తెలంగాణ యువతకు ఉందని కేటీఆర్ అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను బీరు, బిర్యానీ బ్యాచ్ అంటూ అవమానించేలా మాట్లాడటం సరైనది కాదని కేటీఆర్ విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువని, వేలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం అక్కడ చదువుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటి విద్యార్థులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. యువతను తక్కువ అంచనా వేస్తే అదే యువశక్తి అధికారంలో ఉన్నవారికి గట్టి సమాధానం చెబుతుందని హెచ్చరించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ "ఓటు కొట్టు.. జాబ్ పట్టు" అంటూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్నో హామీలు ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పత్రికల మొదటి పేజీల్లో భారీ ప్రకటనలు ఇచ్చి యువతను నమ్మించారని ఆరోపించారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని కేటీఆర్ విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల మాట పక్కన పెడితే, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో తీవ్ర నిరాశ నెలకొందని, ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైందని ఆరోపించారు.

ప్రభుత్వం ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోందని ప్రస్తావించిన కేటీఆర్, ఆ లెక్కల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన నియామకాలనే చేర్చి క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం చేయడం వల్ల నిజాలు మారవని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను సభలో ప్రదర్శించారు. కేసీఆర్, కేటీఆర్ రెండు ఉద్యోగాలు పోతే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు.

అలాగే 2023 మే 8న సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్‌ను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఇదే సభా ప్రాంగణంలో నిరుద్యోగ యువతకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ సమయంలో చేసిన ప్రకటనలు, వీడియోలను సభలో ప్రదర్శించారు. యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలు అమలు కాలేదని, యువతను మోసం చేశారని ఆరోపించారు.రేవంత్ రెడ్డి మాటలు వింటే సాంప్రదాయిని, సుప్పిని, సుద్దపూసని పాట గుర్తుకు వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని, మాటే శాశ్వతమని చెప్పే నాయకులు ముందు తమ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గొప్పలు చెప్పుకోవడం సరికాదని విమర్శించారు.

సరూర్‌నగర్ సభలో కనిపించిన యువత ఉత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో సభకు హాజరుకావడం ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో మార్పు కోసం ఆలోచన మొదలైందని, ఇక నుంచి రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు.

"ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పటి నుంచి ఒక లెక్క" అంటూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. యువత తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జంగ్ సైరన్ మోగించేందుకు వచ్చిన యువతకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సభతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కగా, ఉద్యోగాల హామీలు, నిరుద్యోగ సమస్య, ఎన్నికల వాగ్దానాల అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.

‘ప్రీమియర్ ఎనర్జీస్’ మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
విశ్వంభర,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ప్రతిష్టాత్మక సోలార్ మాడ్యూల్స్ తయారీ సంస్థ ‘ప్రీమియర్ ఎనర్జీస్’ నూతనంగా ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల మెగా ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ  చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి సీఎం గురువారం ప్లాంట్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రికార్డు స్థాయిలో కేవలం 12 నెలల వ్యవధిలోనే ఈ గ్రీన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు సుమారు 2,500 నుండి 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిని కాలుష్య రహిత ‘కోర్ అర్బన్ జోన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు.

అనంతరం ప్లాంట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు.. ప్రీమియర్ ఎనర్జీస్ రూపొందించిన మొట్టమొదటి సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్, ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ ‘ఆక్సీట్రీ’ తో పాటు కంపెనీ నూతన ఉత్పత్తులను పరిశీలించి, యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

హరీశ్ రావు అబద్ధాలతో సీఎం రేవంత్, ఉత్తమ్ ను బద్నామ్ చేస్తున్నారు: జగ్గారెడ్డి
విశ్వంభర,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రాజెక్టు దెబ్బతినడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం కాదని అన్నారు.కట్టించింది మీరే, కూలిపోయింది మీ హయాంలోనే. దీనికి బాధ్యత మీదే" అని వ్యాఖ్యానించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం అంశంపై చర్చించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని జగ్గారెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు.హరీష్ రావు ప్రతిరోజూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, అయితే తాను సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లోపాలపై బాధ్యత వహించాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమేనని పేర్కొన్నారు.హరీష్ రావును సాగునీటి శాఖ మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో కేసీఆర్ ప్రజలకు వివరించాలని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల కారణంగానే ఆయనను మార్చారని ఆరోపించారు.
డ్యామ్ భద్రత విషయంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నీటి నిల్వలపై కేంద్ర సంస్థ హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల ప్రజల భద్రత కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వల నిర్వహణలో జరిగిన తప్పిదాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని జగ్గారెడ్డి అన్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం, సంబంధిత శాఖే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే అసెంబ్లీ చర్చకు కేసీఆర్, హరీష్ రావు హాజరై ప్రజల ముందే వాస్తవాలను వెల్లడించాలని సవాల్ విసిరారు.
హరీష్ రావు తన రాజకీయ స్థాయి గురించి మాట్లాడే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో సాధించిన ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ రాజకీయ జీవితంలో స్వయంకృషితో ఎదిగారని, బంధుత్వాల ఆధారంగా పదవులు పొందలేదని వ్యాఖ్యానించారు.
చివరగా, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణమైన వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం మానుకుని ప్రజలకు సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం.. సీఎం రేవంత్ చెప్పింది నిజ‌మే : జ‌గ్గారెడ్డి
విశ్వంభర,హైదరాబాద్ : డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం జ‌రుగుతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు నిజ‌మే అని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది అని మండిప‌డ్డారు.మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గాల పున‌ర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జ‌రుగుతుంది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతుంది. బీజేపీ మంత్రులు ఏం చేయలేరు..? మాట్లాడలేరు. కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా గాంధీకి చెప్పుకునే స్వాతంత్య్రం ఉండేది. బీజేపీలో అలాంటి అవకాశమే ఉండదు. బండి సంజయ్ ఏమట్లాడినా విలువ ఉండదు. ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల్సి అవ‌స‌రం లేదు. అధికార పార్టీ మీద ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌హ‌జం. ఉన్న‌ది లేన‌ట్టు.. లేనిది ఉన్న‌ట్టు చెప్ప‌డం స‌హ‌జం అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.

రెండున్నరయేండ్లలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి నేను తీసుకున్నట్టు, ఇన్వాల్వ్ అయినట్టు మీకు సమాచారం ఉందా..? అని అడిగారు పొంగులేటి. నా జిల్లాలో భూమి ముట్టుకోవడానికి నాకే వీలు లేకుండా పోతుంది.. ఇంకా పొంగులేటికి ఎక్కడ దొరుకుతుంది. నా జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికెట్ ఇచ్చిన. నాకు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఒక్కో ఎకరం కొల్లూరు.. ఉస్మాన్‌పూర్ పోతే ఎకరానికి రూ. 20 కోట్లు. ఎవరు వేలు పెట్టినా భగ్గుమంటదని ఆయ‌న తెలిపారు.మళ్ళీ హరీష్ రావు ఆరోపణలు చేస్తే.. వాళ్ళు ఏం చేశారో బయటా పెడతా. పటాన్‌చెరులో ఎవరు దందా చేశారో చెప్తా. 2014 నుండి మూడేళ్లు జగ్గారెడ్డి ఎక్కడైనా భూములు సంపాదించాడా అని వెతికారు. జల్లెడ పట్టినా.. ఏం దొరకలేదు. భూములు దొరకలేదు. ఆస్తులు చూశారు.. ఊర్లో ఇల్లు లేదు అని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.

మంత్రి పదవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కేబినెట్‌లో చోటు ఉండాలన్నారు. మంత్రి పదవి కావాలంటూ గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్న వేళ.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ప్రస్తుతం తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తూనే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కేబినెట్‍లో ఉంటే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తాను ఇదే చెప్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో డబ్బులు లేకుండా రాజకీయం లేదని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు డబ్బు పెడితే వాళ్లే నాయకులు అవుతున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు.

నిధుల కోసమే ఢిల్లీ పర్యటనలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. జిల్లాకు యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ఎయిర్‌పోర్టు వంటి మెగా ప్రాజెక్టులను ప్రకటించారు. గత పదేళ్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్యాయానికి గురైన ఈ పోరాట గడ్డను, పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సీఎం ప్రకటించిన కీలక హామీలు
ఎర్రబస్సు రావడమే కష్టమైన ప్రాంతానికి ఎయిర్‌పోర్టును తీసుకొచ్చి, స్వయంగా ప్రధాని మోదీతో ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు ప్రత్యేక యూనివర్సిటీతో పాటు, నిర్మల్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చనాకా-కొరాటా ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని తెలిపారు. బడ్జెట్ సమావేశాలలోపే తుమ్మడిహట్టి ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రతి ఎకరానికి  నీరందిస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేసీఆర్ సలహాలు ఇవ్వాల్సింది పోయి విమర్శిస్తున్నారు
కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అభివృద్ధికి ఉపయోగపడటం లేదని సీఎం ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. ఒక్క పంచ్‌తో కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారన్నారు. ఇక వారి గురించి మాట్లాడి సమయం వృధా చేయనని తెలిపారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అమలవుతున్న గ్యారెంటీలు
గత ప్రభుత్వం చేసిన అప్పుల చిక్కుముడులను విప్పుకుంటూనే ప్రజా సంక్షేమ పథకాలను పరుగులు తీయిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నవడ్లకు రూ.500 బోనస్, రైతులకు భరోసా పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మేడారం జాతర కోసం అద్భుతమైన ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.

ఢిల్లీ పర్యటనలపై క్లారిటీ
ప్రధాని మోదీని పదే పదే కలుస్తున్నారన్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు వ్యక్తిగత ఎజెండా లేదని.. పైరవీలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలంటే ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవాల్సిందేనని తెలిపారు.  అడగనిదే అమ్మ కూడా పెట్టదని.. అందుకే ప్రతిసారి వెళ్లి రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తున్నానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అడగడం మర్చిపోయింది కాబట్టే రాష్ట్రానికి నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కూడా కేవలం రాజకీయాలు చేయకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకోవాలని హితవు పలికారు.

మున్సిపల్ ఎన్నికల నగారా
మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి స్పందించారు. డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. అభివృద్ధి చేసే వారికే ఓటు వేయండి.. ప్రజా ప్రభుత్వంతో కలిసి నడిచే నాయకులనే ఎన్నుకోవాలని అని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
విశ్వంభర, తెలంగాణ, బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన భేటీ వివరాలను కిషన్ రెడ్డి ఈ లేఖలో వివరించారు. మెట్రో మొదటి దశను L&T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం (Takeover) చేసుకుంటుందని ఇప్పటికే సీఎం ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రెండో దశ పనులకు కేంద్రం సహకారం అందించాలంటే, ముందుగా మొదటి దశకు సంబంధించిన ఒప్పందాలు, లావాదేవీలు, టేకోవర్ ప్రక్రియ పూర్తి కావాలని కేంద్ర మంత్రి ఖట్టర్ స్పష్టం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

సంయుక్త కమిటీ ఏర్పాటులో జాప్యం
మెట్రో మలిదశ సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ఒక సంయుక్త కమిటీ (Joint Committee) ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులతో ఈ కమిటీ ఏర్పడాలని, కేంద్రం తన వంతు ప్రక్రియకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారుల పేర్లు ప్రతిపాదించలేదని కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
మెట్రో ఫేజ్-2పై కేంద్రం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ అధికారుల పేర్లను ఎప్పుడు పంపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కమిటీ ఏర్పాటుతో మెట్రో విస్తరణ పనుల్లో ఉన్న సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది.

ఆ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మార్కు..
విశ్వంభర, తెలంగాణ, న్యూస్: రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ వద్ద చనాక - కొరాట పంప్ హౌస్ ను, జగిత్యాల జిల్లాలోని సదర్‌మాట్ బ్యారేజ్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టుల ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్ పాలనలోనే 95 శాతం పూర్తయ్యాయని, సెప్టెంబర్ 2023లోనే విజయవంతంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అంతర్రాష్ట్ర ఒప్పందం వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని తెలిపారు. 0.98 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాలకు చెందిన 51 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

సదర్‌మాట్ బ్యారేజ్‌తో మారనున్న తలరాత

జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో గోదావరిపై 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజ్ కూడా కేసీఆర్ హయాంలోనే 90 శాతం పూర్తి అయ్యిందని వెల్లడించారు.దీని ద్వారా 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని తెలిపారు. గత పదేళ్లలో (2014-2023) కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని కేటీఆర్ కొనియాడారు. నెర్రెలుబారిన తెలంగాణ నేలను దేశానికే ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు నేడు ఫలాలను ఇస్తుండడం సంతోషదాయకమని పేర్కొన్నారు.

ఎన్నికల నగారా.. జిల్లాల బాట పట్టనున్న సీఎం రేవంత్!
విశ్వంభర, తెలంగాణ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించడమే లక్ష్యంగా సీఎం రోడ్‌మ్యాప్ ఖరారైంది.

జనవరి 16 నుంచి రెండు దఫాల్లో ఈ పర్యటనలు సాగనున్నాయి. ఈ సారి పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అటు అభివృద్ధి, ఇటు పోరాట పంథాను ఎంచుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచేలా బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు  వివిధ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కేంద్రంపై పోరు బాట చేపట్టనున్నారు.

తొలి విడత షెడ్యూల్
మొదటి విడతలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. జనవరి 16న నిర్మల్‌లో బహిరంగ సభ, అభివృద్ధి పనులకు శ్రీకారం చేయనున్నారు. 17న జడ్చర్లలో కార్యకర్తలతో భేటీ, ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
18న పాలేరు, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో పర్యటించనున్నారు. అదే రోజు మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన..
జనవరి 19న సీఎం రేవంత్ రెడ్డి మేడారం అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు.  రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలు, సమావేశాల ముగింపు అనంతరం ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఫిబ్రవరి 3 నుంచి మలి విడత
విదేశీ పర్యటన ముగిసిన వెంటనే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రెండో విడత పర్యటనలు ప్రారంభమవుతాయి. వరుసగా ఆరు రోజుల పాటు నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తూనే, ఉపాధి హామీ నిరసన సభలను భారీ ఎత్తున నిర్వహించేలా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.