vishwambhara.com - Vishvambhara News

షర్మిల పార్టీ ఫండ్ నొక్కేసింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు..!
ఏపీ కాంగ్రెస్ లో గొడవలు మొదలయ్యాయి. అప్పుడే షర్మిల మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా షర్మిల మీద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఇన్నిరోజులురాహుల్ గాంధీమీదున్న అభిమానంతో షర్మిలను ఏమీ అనలేకపోయామని.. కానీ షర్మిల మాత్రం కక్షపూరిత చర్యల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చిందని మండిపడ్డారు.

మొన్న ఎలక్షన్లలో పార్టీ ఇచ్చిన ఫండ్ ను షర్మిల ఒక్కతే కాజేసిందని సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలకు కనీసం జెండాలు కూడా ఇవ్వకుండా.. ఆ డబ్బులుకూడా కాజేసిందని ఆరోపించారు పద్మ శ్రీ.

పార్టీలో సీనియర్లను చెత్తబుట్టల్లాగా చూసిందని.. కనీసం ఏ ఒక్కరికీ కూడా విలువ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని షర్మిలపై ఆమె మండిపడ్డారు. షర్మిల తప్ప కాంగ్రెస్ లో ఏ ఒక్కరూ మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మాణిక్కం ఠాగూర్ కూడా షర్మిలకే వత్తాసు పలికారని.. రాహుల్ గాంధీని కూడా ఎన్నికల ప్రచారానికి రప్పించలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే షర్మిల సంగతి ఢిల్లీలో చూసుకుంటామని.. ఆమెను పదవి నుంచి తీయించేస్తామని వార్నింగ్ ఇచ్చారు పద్మశ్రీ. ఈ సమావేశంలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రఘురామకృష్ణం రాజుకు స్పీకర్ పదవి..?
అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇప్పుడు రఘురామ గెలవడం ఒక ఎత్తు అయితే కూటమి అధికారంలోకి రావడం మరో ఎత్తు అనే చెప్పుకోవాలి. దాంతో ఇప్పుడు రఘురామ కృష్నం రాజు పేరు తెరమీదకు వస్తోంది. కొత్త ప్రభుత్వంలో ఎవరికి మంత్రి పదవులు అనేది ఇప్పుడు అందరి చూపు.

అయితే మంత్రి పదవులు ఎవరికి వచ్చినా సరే గానీ.. రఘురామకు మాత్రం స్పీకర్ పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు వస్తోంది. ఎందుకంటే జగన్ మీద రఘురామకు పీకలదాకా కోపం ఉంది. కాబట్టి అసెంబ్లీలో జగన్ ను బాగా కంట్రోల్ చేస్తాడని.. అంతే కాకుండా ఇన్ని రోజులు రఘురామను జగన్ ఆర్డర్ వేస్తే... ఇప్పుడు జగన్ ను రఘురామ ఆర్డర్ వేస్తే చూడాలని ఉందంటున్నారు కూటమి నేతలు. మరి అందరూ కోరుతున్నట్టు రఘురామకు ఆ పోస్టు చంద్రబాబు ఇస్తారా లేదా అనేది చూడాలి.

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి
హిమాలయ పర్వతాల్లో విన్యాసాలు చేస్తుండగా విషాదం మిగిలింది. ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహస్రతల్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది మంచులో చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకకు చెందిన 18మంది ట్రెక్కర్లు ముగ్గురు స్థానిక గైడ్‌లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో టెక్కింగ్ చేస్తున్నారు. సుమారు 4,100-4400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద వారు ఈ విన్యాసం చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి వారు మంచులో చిక్కుకుపోయారు. వారిలో తొమ్మిది మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు.

అటవీశాఖకు చెందిన పది మంది సభ్యుల రెస్క్యూ టీమ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందం బుధవారం తెల్లవారుజామున ఉత్తరకాశీ నుంచి బయల్దేరాయన్నారు. ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రి, భట్వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. 14మంది రక్షణ సిబ్బంది, ఓ వైద్యుడిని ఘటనాస్థలానికి పంపామని చెప్పారు. క్షతగాత్రులను వెంటనే తరలించడానికి హెలికాప్టర్, అంబులెన్స్‌లను సిద్ధం చేశామన్నారు.

చంద్రబాబుకు ఎన్టీఆర్, చరణ్, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కూటమి విజయంపై పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ యంగ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు.

ఎక్స్ వేదికగా ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

అదేవిధంగా మరో ట్వీట్‌లో ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు’ అంటూ రాసుకొచ్చాడు. అదేవిధంగా టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ చంద్రబాబు గెలుపు పట్ల స్పందిస్తూ ‘ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి సభ్యులందరికీ విజయాభినందనలు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లకు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు.

అదేవిధంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. ‘ ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఏపీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా గాయని స్మిత.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది.

ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.

అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…

— Jr NTR (@tarak9999) June 5, 2024

‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాల్లో ఏడింటికి బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచీ ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నానని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్ రావు తమ పార్టీ ఓట్లను రఘునందన్ రావుకు వేయించారని దుయ్యబట్టారు.

తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు ఎప్పటికీ ఆగవని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ రాజకీయ జూదగాడు అంటూ సెటైర్ వేశారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌తో కలిసి మోడీ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే మహారాష్ట్ర ఫలితాలే వస్తాయని హెచ్చరించారు. అక్కడ మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చితే మోడీ తలెత్తుకోలేని ఫలితాలను ప్రజలు ఇచ్చారని వెల్లడించారు. మోడీని దేశ ప్రజలు తిరస్కరించారని, ఒక్క వ్యక్తి పేరుతో ‘మోడీ గ్యారంటీ’ అనిచెప్పడం వల్లే బీజేపీకి మెజార్టీ రాలేదని స్పష్టం చేశారు.

అందుకే ఎన్డీయే కూటమిలోని మరో వ్యక్తిని ప్రధాని చేయాలని బీజేపీకి సూచించారని రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే మోదీని తన పదవికి రాజీనామా చేయాలని ఎన్డీయే నేతలు కోరాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బూడిదే మిగిలిందని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఏపీ ఫలితాలపై రేవంత్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, జగన్ స్వాగతించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాన‌ని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గుర్తుచేశారు.

ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు. తదుపరి మంత్రివర్గం ఏర్పడే వరకు మోడీని ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు.

17వ లోక్‌సభను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. 18వ లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు మార్చి మధ్య నుంచి జూన్ మొదటి వారం వరకు జరిగాయి.  జూన్ 5, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ 340 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనతాదళ్ (యునైటెడ్), శివసేన, లోక్ జనషాకీ పార్టీ (రామ్ విలాస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో సహా దాని మిత్రపక్షాల మద్దతు అవసరముంది. చారిత్రాత్మక విజయం తర్వాత బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పీఎం మోడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత
జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బ‌లగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అంద‌రినీ ఏడిపించిన విష‌యం తెలిసిందే. బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు పాడిన ఈ పాట తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కన్నీళ్లు పెట్టించింది. అయితే ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.

ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను వరంగల్‌లోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. మొగిలయ్య కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇక మొగిలయ్య ప్రాణాలను కాపాడాల‌ని, త‌మ‌ని ఆదుకోవాల‌ని ఆయ‌న‌ భార్య కొముర‌మ్మ ప్ర‌భుత్వాన్ని వేడుకుంది. ఇదివరకే మొగిలయ్య అనారోగ్యానికి గురి కాగా మెగాస్టార్ చిరంజీవి సాయమందించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొగిలయ్యను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ తరుణంలోనే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బలగం మొగిలయ్య భార్య కోరింది. ఎవరైనా సాయం చేయాలని వేడుకుంది.

మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ కొలువుదీరనుంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 8వ తేదీన ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ 272ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.

మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ అయింది. ప్రస్తుత లోక్ సభ రద్దుకు సిఫార్సు చేసింది. బుధవారం సాయంత్రం 4గంటలకు ఎన్డీయే భాగస్వామ్య పక్షనేతలు కీలక సమావేశం జరగనుంది.

‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..’ వైఎస్ షర్మిల ట్వీట్
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో ఆమె బుధవారం ఓ పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటూ సూచనలు చేస్తూ ఇలా రాసుకొచ్చారు. ప్రత్యేక హోదా, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టుల పూర్తి, రాజధాని నిర్మాణం, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగాలని ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని పేర్కొన్నారు.. ప్రజలు ఇచ్చిన ఇంతపెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగువేయాలో ఆలోచన చేసి వేయాలని సూచించారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, కేంద్ర సర్కారు ప్రత్యేక హోదా కోసం హామీ ఇస్తేనే అన్ని విభజన హామీలకు కట్టుబడి ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ.ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది’ అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.
ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి.…

— YS Sharmila (@realyssharmila) June 5, 2024

పేరు మార్చుకుంటున్నా.. ముద్రగడ సంచలన ప్రకటన
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వైసీపీకి కోలుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని తెలిపారు. పేరు మార్చుకునేందుకు గెజిట్ పబ్లికేషన్ పేపర్లు సిద్ధం చేసుకుని మీడియాకు చూపించారు.

రెండు, మూడు రోజుల్లో తన పేరు మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రజల సంక్షేమానికి కోట్లాది రూపాయలు అందించింది సీఎం జగన్ మాత్రమేనని ముద్రగడ తెలిపారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలు ఎందుకు ఆదరించలేదో తెలియడంలేదన్నారు. ప్రజల కోసం కష్టపడిన జగన్‌ను ప్రజలు గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇక ముందు కూడా జగన్‌తోనే కొనసాగుతుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.