ghmc - Vishvambhara News

జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ ప్రభావతి లంచం తీసుకుంటూ పట్టుబాటు
జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ ప్రభావతి ఫూల్‌బాగ్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఫూల్‌బాగ్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ప్రభావతిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

రూ.20 వేల లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ పట్టుబడటంతో సంబంధిత విభాగంలో కలకలం నెలకొంది. ప్రభావతి ఎవరిని నుంచి లంచం తీసుకున్నారు? ఏ పని కోసం డబ్బులు డిమాండ్ చేశారు? అనే వివరాలు ఏసీబీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు నోటీసులు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55పై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ జీవోను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జనాభా గణన-2027 కోసం జ్యూరిస్డిక్షనల్ ఫ్రీజ్ అమల్లో ఉన్న సమయంలో ఈ పునర్విభజన చట్టవిరుద్ధమని పేర్కొంటూ దరం గురువ రెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ రాజ్‌కుమార్ గుమ్మి, నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జనాభా లెక్కల కోసం జ్యూరిస్డిక్షన్ ఫ్రీజ్ ప్రకటించిన తర్వాత మున్సిపల్ సరిహద్దుల మార్పులు, స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణకు చట్టపరమైన అనుమతి లేదని ఆయన వాదించారు. అధికార పరిధి లేకుండా జారీ చేసిన ఈ జీవోను ప్రారంభం నుంచే చెల్లనిదిగా ప్రకటించాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు, ఈ విషయంపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయడానికి కోర్టు మూడు వారాల సమయం ఇచ్చింది. ఈ కౌంటర్లు దాఖలైన అనంతరం కేసును తదుపరి విచారణకు చేపట్టనున్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం, జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు అంటే 31 మార్చి 2027 వరకు జిల్లా, మండలం, గ్రామం లేదా మున్సిపల్ సరిహద్దులను మార్చడానికి వీల్లేదు. ఈ ఆంక్షలు అమల్లో ఉండగానే, ఫిబ్రవరి 11, 2026న తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పునర్విభజన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా, చట్టపరంగా చర్చనీయాంశమైంది.

ముక్కలైన మహా నగరం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భాగ్యనగర పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. పెరుగుతున్న జనాభా, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను మూడు భాగాలుగా విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై హైదరాబాద్ మహా నగరం జీహెచ్‌ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)ల పరిధిలోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ, కొత్త కార్పొరేషన్ల పరిధులు, జోన్లు, సర్కిళ్లతో కూడిన సమగ్ర మ్యాప్‌లను విడుదల చేసింది. కేవలం విభజనకే పరిమితం కాకుండా, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేలా వార్డుల పునర్విభజనపై కూడా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

6 జోన్లు.. 30 సర్కిళ్లు!

విభజన అనంతరం జీహెచ్‌ఎంసీని మొత్తం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా ఖరారు చేశారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లను జోన్లుగా నిర్ణయించారు. ఒక్కో జోన్ పరిధిలోకి వచ్చే సర్కిళ్ల వివరాలను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. శంషాబాద్ జోన్ పరిధిలో ఆదిభట్ల, బడంగ్‌పేట్, జల్‌పల్లి వంటి కీలక శివారు ప్రాంతాలను చేర్చగా, చార్మినార్ జోన్ కింద పాతబస్తీలోని సంతోష్ నగర్, యాకత్‌పురా, మలక్‌పేట, మూసారాంబాగ్‌లను ఉంచారు. రాజేంద్రనగర్ జోన్‌లో అత్తాపూర్, బహదూర్‌పుర, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాలు ఉండగా, గోల్కొండ జోన్ పరిధిలోకి గోషామహల్, కార్వాన్, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ వంటి కీలక వ్యాపార కేంద్రాలు చేరాయి.

ఐటీ కారిడార్.. మల్కాజ్‌గిరిలకు ప్రత్యేక గుర్తింపు

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న ప్రాంతాలన్నీ ఇకపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోకి వెళ్లనున్నాయి. అటు నగరం యొక్క తూర్పు, ఉత్తర ప్రాంతాలను అనుసంధానిస్తూ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) ఏర్పాటు కావడంతో ఆయా ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కానుంది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, అమీర్‌పేట, బోరబండ వంటి ప్రాంతాలు, అలాగే సికింద్రాబాద్ జోన్ కింద ముషీరాబాద్, అంబర్‌పేట్, తార్నాక వంటి నివాస ప్రాంతాల పరిధిలపై ప్రభుత్వం మ్యాప్ ద్వారా స్పష్టమైన సరిహద్దులను గీసింది. పాలన వికేంద్రీకరణ ద్వారా నిధుల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌కు ‘మహా’ బడ్జెట్.. రూ. 11,460 కోట్లతో నగరం నయా లుక్!
విశ్వంభర, హైదరాబాద్ బ్యూరో: భాగ్యనగరం మరింత మెరిసిపోనుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను సిద్ధం చేసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ బడ్జెట్ ముసాయిదాకు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. మొత్తం రూ. 11,460 కోట్ల వ్యయంతో నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులు గణనీయంగా పెరగడం గమనార్హం.

విలీన మున్సిపాలిటీలకు భారీ ఊతం
నగర శివార్లలోని అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు ఈ బడ్జెట్‌లో సింహభాగం కేటాయించారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలోని పనుల కోసం రూ. 9,200 కోట్లు కేటాయించగా, నగరంతో కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల కోసం ఏకంగా రూ. 2,260 కోట్లు కేటాయించారు. దీనివల్ల శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలు తీరనున్నాయి.

ట్రాఫిక్ కష్టాలకు చెక్ - రూ. 1,720 కోట్లు
నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంపై బల్దియా ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్తగా ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాస్ లు, ప్రధాన రహదారుల విస్తరణ, నిర్వహణ కోసం రూ.1,720 కోట్లను కేటాయించారు. ఎస్ఆర్‌డీపీ మలి విడత పనులు ఈ నిధులతో వేగవంతం కానున్నాయి.

పచ్చని భాగ్యనగరం - రూ. 590 కోట్లు
కాలుష్య రహిత హైదరాబాద్ కోసం పచ్చదనం పెంచేందుకు జీహెచ్ఎంసీ భారీ కార్యాచరణను రూపొందించింది. ‘గ్రీన్ బడ్జెట్’ కింద రూ. 590 కోట్లు కేటాయించారు. నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద లాండ్‌స్కేపింగ్, కొత్త పార్కుల నిర్మాణం, ఉన్న పార్కుల ఆధునీకరణకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.

ముంపు భయం లేని నగరం - రూ. 550 కోట్లు
వర్షాకాలంలో నగరం చిగురుటాకులా వణకకుండా ఉండేందుకు స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్లాన్ కింద రూ. 550 కోట్లు కేటాయించారు. నాలాల పూడికతీత, విస్తరణ పనుల ద్వారా లోతట్టు ప్రాంతాలకు శాశ్వత విముక్తి కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ భారీ బడ్జెట్ అమలుకు అవసరమైన నిధులను ప్రధానంగా ఆస్తి పన్ను, టౌన్ ప్లానింగ్ ఫీజులు, భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ల ద్వారా సమకూర్చుకోనున్నారు. ఆస్తి పన్ను వసూళ్లను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

అధికారుల వల్ల చెడ్డపేరు వస్తోంది... ప్రజల మధ్య తిరగలేకపోతున్నాం: దానం నాగేందర్
హైదరాబాద్ లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పేదల జీవనాధారాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు.

అధికారులు చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని... ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామని దానం చెప్పారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారని... వారికి పూర్తి అధికారాలు ఇస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని అన్నారు. కూల్చివేతలు మొదలుపెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టాలని చెప్పారు.

చెరువులను కాపాడటానికి హైడ్రా చేస్తున్న పనిని తాము స్వాగతిస్తున్నామని... మూసీ నదిని ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. ప్రజలకు అన్యాయం జరిగితే అడ్డుకోవడానికి తాను ముందుంటానని తెలిపారు. ఫుట్ పాత్ ల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనేదే తన అభిప్రాయం అని చెప్పారు. ఫుట్ పాత్ పై కుమారి ఆంటీని అధికారులు వేధించినప్పుడు ఆమె జోలికి వెళ్లవద్దని సీఎం ఆదేశించారని... ఇప్పుడు ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతలపై కూడా అలాంటి ఆదేశాలే ఇవ్వాలని కోరారు.

ఖైరతాబాద్, చింతలబస్తీలో దశాబ్దాలుగా షాపులు, హోటల్స్ పెట్టుకుని బతుకుతున్నారని, వారి షాపులను ఆపరేషన్ రూప్ పేరుతో కూల్చివేస్తే ఎలాగని ప్రశ్నించారు. ఆపరేషన్ రూప్ ను ముందు ఓల్డ్ సిటీలో అమలు చేయాలని అన్నారు.

ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోండి
14 జులై 2024 విశ్వంభర మెట్పల్లి :-  అసలే వర్షాకాలం ఆపై విష జ్వరాలు డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తే మెట్పల్లి పట్టణం జాతీయ రహదారి ప్రక్కన గల మురుగు కాలువ నీరు నిలిచి దోమలకు ఇతర కీటకాలకు నిలయంగా మారినవి ప్రభుత్వ దావకాన గేటు పక్కనే గల మురికి కాలువ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మురుకు కాల్వలో ఉండడం దానికి రక్షణగా ఉన్న కంచ చుట్టూ పిచ్చి మొక్కలు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎర్తింగ్ వైరు మురుగు కాల్వకు ఆనుకుని ఉండడంతో అనుకోకుండా కాలువలో దిగిన పశువులకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులు సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు

పారిశుధ్య కార్మికురాలిపై ప్రభుత్వ అధికారి లైంగికదాడి..!
ఓ ప్రభుత్వ అధికారి కామంతో కళ్లు మూసుకుపోయి బరితెగించాడు. ఒళ్లు మరిచి పారిశుధ్య కార్మికురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పైగా వీడియో రికార్డు చేసి బెదిరించి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జోనల్ కమిషనరేట్ పరిధి గాజుల రామారంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

గాజుల రామారంలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ ఓ మున్సిపల్ కార్మికురాలిపై కన్నేశాడు. తాను చెప్పినట్లు వినాలని ఆమెను బెదిరించాడు. చెప్పినట్లు వినకుంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు. రోజూ పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా ఈ తతంగమంతా తన ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ క్రమంలో కిషన్‌ లైంగిక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

తోటి కార్మికుల ఫోన్‌లో కూడా వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ చూసిన కార్మికులు ఏంటని ప్రశ్నించారు. దీంతో ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి రూ.10వేల చొప్పున దాదాపు 14మందికి డబ్బులు ఇచ్చి వారి నోరు మూయించాడు కిషన్. కూకట్‌పల్లి మహిళా జోనల్ కమిషనర్ పరిధిలో ఇలాంటి ఘటన జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లైంగిక వేధింపుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌ కిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు.